Jump to content

ఉపాసనం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పూజించడం, చింతన మొదలైన అర్థాలు ఉన్నాయి. ఇది సగుణోపాసన, నిర్గుణోపాసన అని రెండు విధాలు. సగుణోపాసన అంటే ప్రతీక ఆధారంగానో, దైవానికి వర్తించే కొన్ని గుణాలను దేనిలోనో ఆరోపించుకుని ఉపాసించటం. విగ్రహాన్ని పూజించడం సామాన్యమైన విషయమే. వాయువు, అగ్ని మొదలైన వాటిలో పరమాత్మను చూడటం, వేదంలోనో, పురాణాది గ్రంథాలలోనో ప్రస్తావనకు వచ్చే కొందరు దేవతలను వారి వారి గుణాలను, లక్షణాలను మనస్సులో ఉంచుకుని ఆరాధిండచం కూడా సగుణో పాసన. విగ్రహాన్ని/ ప్రతీకను ఆరాధించడం అధ్యాసోపాసన. దైవగుణాలను ఆరోపించుకుని చేసే ఉపాసన సంపదు పాసన. గుణాలకు అతీతుడైన బ్రహ్మను/ పరమాత్మను ఉపాసించడం నిర్గుణోపాసన. ఉపాసన చేసేవారు ఉపాసకులు. ఏయే లక్షణాలను, గుణాలను ఆరోపించుకుని దేవతలను ఉపాసిస్తారో అవే లక్షణాలతో, గుణాలతో దైవం సాక్షాత్కరించడం, అవే లక్షణాలు, గుణాలు ఉపాసకులలో వ్యక్తం కావడం సాధకులకు అనుభవం. నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు రచించిన ఉపనిష ద్దర్శనం (మూడవ భాగం)లో ఓంకారో పాసన, సామోపాసన, అన్నోపాసన, ప్రాణో పాసన, వ్యాహృత్యుపాసన, గాయత్య్రుపాసన మొదలైనవి ఉన్నాయని ప్రస్తావించారు. బొమ్మినేని నారాయణస్వామి నాయుడు రచించిన ‘ఆంధ్ర వేదాంత పరిభాష’లో అహంగ్రహోపాసన, తటస్థోపాసన, అంగావ బద్ధోపాసన అనే ఉపాసనా భేదాలు ఉన్నట్టు తెలియజేశారు. ఉపాసనలలో, కోర్కెలతో చేసినవీ కోర్కెలు లేకుండా చేసేవీ ఉండవచ్చు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉపాసనం&oldid=910620" నుండి వెలికితీశారు