ఊదు

విక్షనరీ నుండి

ఊఁదు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నోటి పెదాలను దగ్గరిగా చేర్చి గాలిని బలంగా బయటకు వేగంగా వదలటం.వేడి వస్తువును చల్లార్చుటకు లేదా చిన్న మంటను, దీపాన్ని/కొవ్వొత్తిని ఆర్పుటకు గాలిని ఊదెదరు.

  • 1. బంగారము వెండి యందలి మాలిన్యమును కాకలతో తొలగించు. [కర్నూలు; గుంటూరు]
  • 2. జలాశయములలో, ముఖ్యముగా ఊతతో చేపలుపట్టుట. [నెల్లూరు; వరంగల్లు]
  • 3. రహస్య విషయములను మెల్లిగా చెవిలోచెప్పి ప్రోత్సహించు. [నెల్లూరు]
  • ఏదో చెవిలో ఊది పోయినాడు.
  • 4. దేహము నీరెక్కి ఉబ్బుట. [నెల్లూరు; తెలంగాణము; అనంతపురం]
  • వాడు ఊదెక్కినాడు. (ఊదోడు)

వాఁచు/శోఫ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • శంఖము వంటి వాటిని ఊదుట
  • పట్టు
  • ఉంచు
  • అదుము
  • చేపలను బట్టుయూత
  • వాపు
సంబంధిత పదాలు

ఊదుట ఊదు బుర్ర, ఊదు గొట్టము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు. (ఇది ఒక సామెత.)
  • దనుజు చందమెల్లఁ దనదుచిత్తంబున, నెఱిగి శంకరుండు చిఱునగవునఁ, గాంతిమోము చెన్నువింత గావింపంగ, నుంగుటమున నల్లనూదుటయును
  • పట్టు ........... "క. ఉరగపతితల లవల నురు, తరజవమున నసురులూఁదితత్పుచ్ఛము ని, ర్జరవరులూఁది మహామ, త్సరమునవడిఁ ద్రచ్చిత్రచ్చి జన మఱియున్నన్‌." భార. ఆది. ౨, ఆ.
  • ఉంచు ............... "వీనులఁగప్పురమూఁది." కళా. ౬, ఆ.
  • అదుము ......"గీ. దనుజు చందమెల్లఁ దనదుచిత్తంబున, నెఱిఁగి శంకరుండు చిఱునగవునఁ, గాంతిమోము చెన్నువింత గావింపంగ, నుంగుటమున నల్లనూఁదుటయును." నిర్వ. ౪, ఆ.
  • నొక్కు ..................... "అని యూఁది చెప్పి." భార. ఆను. ౧, ఆ
  • చేఁపలను పట్టెడియూఁత ..................."క. వెరవున నూఁదుల నెత్తెల, గరముల మత్స్యములఁబట్టి." భార. శాం. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊదు&oldid=952052" నుండి వెలికితీశారు