ఐరేని కుండలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఐరేని / ఐరేణి / ఐరేని కుండలు / ఐరేని కడవలు / అయిరాణి / అయ్‌రణి / అయిరేణి

ఇలా బహురూపాలలో వినిపించే ఈ పదానికి అర్థం ఒకటే. వివాహ సమయంలో వేదిక విూద కనిపించే నీరు నింపిన అలంకృత ఘటాలు. రంగుల బొమ్మలు అద్దిన ఈ ఘటాలను పెళ్ళి కుండలు అని కూడా అంటారు. ఈ కడవలు లేని వివాహ వేదిక అసంపూర్ణం. కొన్ని చోట్ల ఈ కుండలు ఒకదానిపై ఒకటి పేర్చడానికి వీలుగా ఉంటాయి. కొన్ని చోట్ల ఒకదాని పక్కన ఒకటి చేర్చి ఉంటాయి. ‘‘ఐరిణీత్యాం మాదేవీ ...’’ అనే వివాహసమయ ప్రార్థనను బట్టి పార్వతి గాను, పసిపిల్లల్ని భక్షించేందుకు స్కందానుజ్ఞ పొందిన మాతృకగాను గుర్తించవచ్చు’’ అని తె. వ్యు. కో. వివరణ. (ఎరిణమ్మ/ ఎనెమ్మ/ ఎన్నెమ అనే పేర్లతో వ్యవహరించే ఒక భూతం పురిటిలో పిల్లలను చంపుతుందని ఒక (మూఢ) విశ్వాసం కొన్ని చోట్ల ఉంది. ప్రజలు తమను సరిగా ఆరాధించని పక్షంలో వారి పురిటి బిడ్డలను చంపడానికి మాతృగణ దేవతలకు కుమారస్వామి అనుమతి ఇచ్చినట్టు భారత గాథ. హారిణీ + అమ్మ జనం నోట వాడుకలోఎరిణమ్మ అయుండ వచ్చు. శివుడి భార్య పార్వతికి మరో పేరు అయుండవచ్చు. బాణుని కాదంబరిలో దుర్గావతారమైన షష్ఠీదేవి. (తె. వ్యు. కో.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఐరేని / ఐరేణి / ఐరేని కుండలు / ఐరేని కడవలు / అయిరాణి / అయ్‌రణి / అయిరేణి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]