కద్రువ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఈమె కశ్యప ప్రజాపతి భార్య. ఈమె సవతులలో వినత ఒకామె.పన్నగుల తల్లి.పన్నగులు:పాములు
  2. [వివరణ] కశ్యవుని భార్యలలో ఒకతె. దక్షుని కూఁతురు. ఈమెయందు నాగకులము పుట్టెను. అందు ఆదిశేషువు జ్యేష్ఠుఁడు. వాసుకి, కర్కోటకుఁడు, తక్షకుఁడు ఐరావతుఁడు, ఏలాపుత్రుఁడు మొదలయిన వారు ఇతరులు.

ఒకదినము సాయంకాలమున కద్రువయు, ఆమెసవతి వినతయు పాలసముద్రము గట్టున విహరించుచు ఉండి అచ్చట మేయుచు ఉండిన ఉచ్చైశ్రవమును చూచి కద్రువ 'అక్కా ఈగుఱ్ఱము దేహము అంతయు తెల్లగా ఉండియు తోకమాత్రము నల్లగా ఉన్నది చూచితివా' అని చెప్పెను. వాస్తవముగా తోకయు తెల్లగానే ఉన్నందున వినత 'అట్లులేదు నీవు చక్కగా చూడుము' అని చెప్పెను. అది విని కద్రువ 'అది దూరముగా ఉన్నది కనుక నీకు చక్కగా తెలియలేదు దగ్గఱపోయిచూచి నల్లగా ఉండినయెడ నీవునాకు దాసివి అగుము, లేనియెడ నేను నీకు దాసిని అయ్యెదను' అని, పందెమువేసికొని అది అస్తమయసమయముగా ఉన్నందున మఱునాఁడు తెల్లవాఱి వచ్చి చూచునట్లు నిష్కర్ష చేసికొనిరి. అనంతరము కద్రువ తన కొడుకులవద్దకు పోయి వారికి, తనకును వినతకును జరిగిన వాగ్వాదమును పందెమువేసికొనుటను తెలియపఱిచి మఱుసటినాటి ఉదయమున తాను సముద్రతీరమునకు వచ్చువేళకు ఆగుఱ్ఱము తోక నల్లగా ఉండునట్లు చేయవలయును అని వేఁడుకొనెను. అందుకు శేషుఁడు మొదలయిన కొందఱు అది అధర్మము అని ఆపనికి సమ్మతింపక పోగా సర్పములు అన్నియు జనమేజయుని సర్పయాగమునందు పడి నశించునట్లు కద్రువ శపించెను. శపింపఁగానే ఆశాపమునకు వెఱచి కర్కోటకుఁడు అనువాడు తల్లి ఇష్టప్రకారము చేసెను కనుక వినత కద్రువకు దాసి అయ్యెను. ఈదాసీత్వమును గరుడుడు మాన్పెను. (చూ|| గరుడుఁడు.) ఆదిశేషుఁడు మహాతపము ఆచరించి విష్ణుప్రసాదము పడసి అతనికి పాన్పై వేయిపడగలతో భూమిని మోయుచు ఉండును. వాసుకి రుద్రునికి భూషణము అయ్యెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కద్రువ&oldid=889288" నుండి వెలికితీశారు