కపింజలన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 'కపింజలానాలభేత' (కౌజుపిట్టలను ఆలంభనము చేయవలెను- వాజసనేయసంహిత) అనే చోట ఎన్ని కపింజలాలను ఆలంభనం చేయాలి అని సందేహం కలిగితే ఇన్ని అని సంఖ్యానియమం చెప్పనందువల్ల బహువచన ప్రయోగంచే ముందు మూడు సంఖ్య స్ఫురించి మూడు కపింజలాలను అని అర్థనిర్ణయం చేసినట్లు.
- "కపింజలా నాలభేత" తిత్తిరిపక్షులను విశసింపవలెను అని సూత్రము. అనుచో సూత్రమున నిన్నిపక్షులను అని నిర్ధారణ లేనందువలన ఎన్నిపక్షులను అను శంక రాఁగా సూత్రమున బహువచనప్రయోగముచే మూఁడింటిని అని స్పష్టమగుచున్నది. ["ఇహేదానీం చతుర్ణాం మహాభూతానాం సృష్టిసంహార విధి రుచ్చతే. మహాభూతానా మి త్యుక్తే త్రయాణామేవ పరిగ్రహః కపింజలా నాలభేతేతివ ద్బహుత్వసంఖ్యాయా స్తావత్యేన చరితార్థత్వాత్| అత శ్చతుర్ణా మిత్యుక్తమ్."]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు