కల్పం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. వేయి మహాయుగాలు ఒక కల్పం. వర్తమాన కాలంలో సంధ్యా వందనంలో చెప్పే ‘శ్వేత వరాహ కల్పం...’ లో ఇప్పటికి ఆరు మన్వంతరాలు గడిచాయి. ఇప్పుడు (అంటే విక్రమార్క/ శాలివాహన/ క్రీస్తు శకాలు జరుగుతున్న కాలం) ఏడవదైన వైవస్వత మన్వంతరం నడుస్తున్నది. మహా యుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు అనే నాలుగు యుగాల కాలం. ఈ మహాయుగంలో చివరిదైన కలియుగం కొనసాగుతున్నది.
- 2. వేద విహిత కర్మల విధివిధానాలను తెలియజేసే శాస్త్రం. షడంగాలలో ఒకటి. (చూడండి - కల్పసూత్రాలు) కొన్ని మన్వంతరాలు ఒక కల్పం. మన్వంతరం అంటే కొన్ని యుగాలు. సంధ్యావందనంలో ‘‘శ్వేతవరాహకల్పం’’, ‘‘వైవస్వత మన్వంతరం’’, ‘‘కలియుగే ప్రథమపాదే’’. అనే కాలం గురుతులను చెపుతుంటాము. కల్పాలు 18. అవి 1. కూర్మ, 2. మత్స్య, 3. శ్వేతవరాహ, 4. నృసింహ, 5. వామన, 6. స్కంధ, 7. రామ, 8. భాగవత, 9. మార్కండేయ, 10. భవిష్య, 11. లింగ, 12. బ్రహ్మాండ, 13. అగ్ని, 14. వాయు, 15. పద్మ, 16. శివ, 17. విష్ణు, 18. బ్రహ్మీ కల్పాలు అని 18 కల్పాలు ఉన్నట్టు భవిష్య పురాణం తెలియజేస్తున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు