Jump to content

కుంతీదేవి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కుంతిభోజుని అభిమాన పుత్రిక. దేవమీఢునకు మారిషయందు పుట్టినది. వసుదేవుని చెల్లెలు. ఈమెకు పృథ అని నామాంతరము కలదు. ఈమె బాల్యమునందు తండ్రిపంపున దుర్వాసమహామునికి శుశ్రూష చేయుచుండు తఱిని ఈమెభక్తికి ఆయన విస్మయము ఒంది ఒక దివ్యమంత్రము ఉపదేశముచేసి ఈమంత్రబలమున నీవు ఏవేల్పును కోరినను ఆవేల్పు ప్రసాదమున కోరినట్టు పుత్రుని పడయుదువు అని చెప్పినందున కుంతి ఆమంత్రశక్తిని ఎఱుఁగుటకయి ఒకనాఁడు గంగకు చని అవగాహనము చేసి ఆదిత్యుని తలఁచి అతనివంటి పుత్రుని కోరెను. అంత అతఁడు సాక్షాత్కరించి ఆమెకన్యాత్వము చెడకుండ ఒక సుపుత్రుఁడు కలుగ అనుగ్రహించి చనియెను. అట్లు సూర్యప్రసాదము వలన ఒక సుతుని పడసి అతనికి, సహజకర్ణకుండలుఁడు అయి జనించినందున కర్ణుఁడు అనియు, వసువర్మధరుఁడుగ పుట్టినందున వసుసేనుఁడు అనియు నామకరణము చేసెను. [ఈవిషయము భారతమున ఆదిపర్వమునందు ఒకవిధముగాను అరణ్యపర్వమునుందు ఒకవిధముగాను చెప్పఁబడి ఉన్నది.]

మఱియు ఈమె పాండురాజును వివాహము అయిన పిదప ఆమంత్రబలము వలననే యముఁడు, వాయువు, ఇంద్రుఁడు వీరి ప్రసాదమువలన వరుసగా ధర్మజుఁడు, భీముఁడు, అర్జునుఁడు అను కొడుకులను కనెను. ఈమె సిద్ధియంశస్థురాలు.

భారత యుద్ధానంతరమున ధర్మరాజు బంధువులకు ఎల్ల తిలోదక వాసోదకములను ఇయ్యఁబోవు అవసరమున అతనికి కుంతి, కర్ణుఁడు తనకు జ్యేష్ఠపుత్రుఁడు అనియు అతనికి తిలోదకాదులు మొట్టమొదట ఈయవలయును అనియు నుడువఁగా, అపుడు ధర్మరాజు కర్ణుని వృత్తాంతమును అంతయ ఎఱిఁగి అతనితో ఎదిరించి పోరినందులకును అతని మరణమునకు కడు దుఃఖించి తన తల్లి అగు కుంతి ఆవృత్తాంతమును తనతో ఇన్ని దినములు చెప్పక దాఁచినందులకై మిగుల అలిగి అది మొదలు స్త్రీలయందు రహస్యము ఏదియు నిలువక ఉండునట్లు శపియించెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]