Jump to content

కుమారీకంకణన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒక కన్యను పెండ్లివారు చూడవచ్చినారు. వారింటిలో బియ్యం నిండుకున్నాయి. కనుక ఆ కన్యక ధాన్యం దంచక తప్పిందికాదు. దంచేప్పుడు గాజుల చప్పుడు కాసాగింది. వచ్చినవారు వింటే సిగ్గుచేటని ఒక్కొక్కటిగా చప్పుడు తగ్గేవరకు గాజులు తీయడం మొదలుపెట్టి చివరికి ఒకేగాజు మిగిల్చింది. హెచ్చుగా ఉంటే కలకల ధ్వని, రెండేసి ఉంటే పరస్పర సంఘర్షణ. ఒక్కటి మాత్రమే ఉంటే నిశ్శబ్దత ఏర్పడింది. సన్యాసికి పలువురితో కలిస్తే కలహం, వేరొకనితో కలిస్తే వృథా కాలక్షేపం జరుగుతుంది. ఒక్కడే ఉంటే అతనికి భగవద్ధ్యానంలో ఏకాగ్రత లభిస్తుంది. చేతులు రెండు కలిస్తేనే చప్పుడు అనే సూచ్యార్థాన్ని తెలిపే న్యాయం. ఈ న్యాయంఈ క్రింది శ్లోకంలోనిది - "బహూనాం కలహో నిత్యం ద్వాభ్యాం సంఘర్షణం తథా, ఏకాకీ విచరిష్యామి కుమారీకంకణం యథా."

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]