గంగిగోవు పాలు గరిటడైన చాలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ఈ సామెత వేమన శతకంలో ఒక పద్యం నుంచి స్వీకరించబడింది. "గంగిగోవు పాలు గరిటడైన చాలు" "కడవడైననేమి ఖరము పాలు" అంటే నాణ్యత కలది, లేదా ప్రేమతో ఇచ్చింది కొద్దిగానైనా చాలుగానీ నాణ్యత లేనివి లేదా మనసులో కుళ్ళుకుంటూ ఇచ్చినవి ఎంత ఎక్కువైనా వ్యర్థం అని దీని భావం.