చతుష్షష్టి తంత్రాలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసాలు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తంత్రాలు ఏవేవి విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఏవో తెలియజేసే మూడు జాబితాలలో మొదటి రెండు విద్యలు/కళల పట్టికలుగా తోస్తాయి. నేదునూరి గంగాధరం సేకరించిన ఒక జాబితా ఇదీ: 1. అవ్యాజ పాలినీ తంత్రం, 2. రాజ్యలక్ష్మీ ప్రసాద తంత్రం, 3. సర్వసామ్రాజ్య తంత్రం, 4. అంగార గమన తంత్రం. 5. రాజ్యోపాంగ తంత్రం, 6. బాలరాజ తంత్రం, 7. చామర ద్వంద్వ తంత్రం, 8.ప్రహర్షరాజ తంత్రం, 9. ధీర తంత్రం, 10. గ్రామ పాలనా తంత్రం, 11. మిత్ర లక్ష్మీ ప్రయోగ తంత్రం, 12. దుర్గ పాలనా తంత్రం, 13. ప్రాణ లక్ష్మీ ప్రయోగ తంత్రం, 14. ప్రభాలక్ష్మీ ప్రయోగ తంత్రం, 15. తోయ లక్ష్మీ ప్రయోగ తంత్రం, 16. పుష్పలక్ష్మీ ప్రయోగ తంత్రం, 17. గంధ లక్ష్మీ ప్రయోగ తంత్రం, 18. కామరూప తంత్రం, 19. కల జీవనికా తంత్రం, 20. కుంజ కంబళ తంత్రం, 21. కనక ప్రయోగ తంత్రం, 22. బోధినీ తంత్రం, 23. సత్య లక్ష్మీ ప్రయోగ తంత్రం, 24. పాదుకా తంత్రం, 25. ప్రజా తంత్రం, 26. భేటక తంత్రం, 27. చాప తంత్రం, 28. లేప తంత్రం, 29. శల్య తంత్రం, 30. భీమ లక్ష్మీ ప్రయోగ తంత్రం, 31. మణి స్థాన ప్రయోగ తంత్రం, 32. పాతాళ గమన తంత్రం, 33. మర్దినీ తంత్రం, 34. స్ఫులింగ లక్ష్మీ తంత్రం, 35. శంఖ మర్దళ తంత్రం, 36. చక్రాయుధ ప్రయోగ తంత్రం, 37. భైరవాది ప్రయోగ తంత్రం, 38. సూప తంత్రం, 39. లేఖ తంత్రం, 40. పృథివీ తంత్రం, 41. అశ్వ తంత్రం, 42. గజ తంత్రం, 43. గోరక్ష తంత్రం, 44. ఐశ్వర్య లక్ష్మీ తంత్రం, 45. శుల్క తంత్రం, 46. మిశ్ర లక్ష్మీ ప్రయోగ తంత్రం, 47. గిరి తంత్రం, 48. వన తంత్రం, 49. స్థానాపత్య ప్రయోగ తంత్రం, 50. శ్రీ సర్వ దండినీ తంత్రం, 51. విఘ్న విచ్ఛేద తంత్రం, 52. భరత తంత్రం, 53. శృంగ వాద్య తంత్రం, 54. నర వాహన తంత్రం, 55. స్తంభినీ తంత్రం, 56. దాహినీ తంత్రం, 57. మారిణీ తంత్రం, 58. ద్వేషిణీ తంత్రం, 59. ఆకర్షణ తంత్రం, 60. ఉచ్చాటన తంత్రం, 61. తోషిణీ తంత్రం, 62. మృత సంజీవినీ తంత్రం, 63. హర మేఖలికా తంత్రం, 64. జీవనీ తంత్రం.
- శబ్దకల్పద్రుమం శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులు ఇచ్చిన పట్టిక. 1. గీతం, 2. వాద్యం, 3. నృత్యం, 4. నాట్యం, 5. ఆలేఖ్యం, 6. విశేషక చ్ఛేద్యం, 7. తండుల కుసుమ బలివికారాలు, 8. పుష్పాస్తరణం, 9.దశన వసనాంగరాగాలు, 10. మణి భూమికా కర్మం, 11. శయన రచనం, 12. ఉదక వాద్యం, 13. ఉదక ఘాతం, 14. చిత్రాయోగాలు, 15. మాల్యగ్రథన వికల్పాలు, 16. శేఖరా పీడయోజనం, 17. నేపథ్య యోగాలు, 18. కర్ణపత్ర భంగాలు, 19. గ్రంథయుక్తి, 20. భూషణ యోజనం, 21. ఇంద్రజాలం, 22. కేచిమార యోగాలు, 23. హస్తలాఘవం, 24. చిత్రశాక పూపభక్ష వికార క్రియ, 25. పానక రసరాగాసవయోజనం, 26. సూచీవాప కర్మములు, 27. సూత్రక్రీడ, 28. ప్రహేళిక, 29. ప్రతిమాల, 30. దుర్గంచక యోగాలు, 31. పుస్తక వాచనం, 32. నాటకాఖ్యాయికాదర్శనం, 33. కావ్య సమస్యా పూరణం, 34. పట్టికావేత్ర వాడీ వికల్పాలు, 35. తర్కుకర్మములు (తర్కువు అంటే కదురు), 36. తక్షణం (చెక్కడం), 37. వాస్తువిద్య, 38. రూప్యరత్న పరీక్ష, 39. ధాతువాదం, 40. మణిరాగ జ్ఞానం, 41. ఆకరజ్ఞానం, 42. వృక్ష ఆయుర్వేద యోగాలు, 43. మేష, కుక్కుట, లావక యుద్ధవిధి, 44. శుకశారికా ప్రలాపం, 45. ఉత్యాదనం (నలుగు పెట్టడం, త్రవ్వటం అనే అర్థాలు ఉన్నాయి.) 46. కేశమార్జన కౌశలం (తలంటు), 47. అక్షర ముష్టికా కథనం, 48. మ్లేచ్ఛితక వికల్పాలు (మ్లేచ్ఛితం అంటే అస్పష్టంగా పలికినది, అపశబ్దం, విదేశీభాష అనే అనే అర్థాలు ఉన్నాయి. 49. దేశభాషా జ్ఞానం, 50. పుష్పశకటికా నిమిత్తజ్ఞానం, 51. యంత్రమాతృక, 52. ధారణ మాతృక, 53. సంపాట్యం (టం?) సంపాటం అంటే ‘చెక్కడపు పనియందు కమ్మచ్చును అందు చెక్కెడు రత్నములును లక్కయుఁగూడఁజేర్చి తూఁచెడి తూనిక అని శబ్ద రత్నాకరము వివరణ. 54. మానస కావ్యక్రియ, 55. క్రియా వికల్పాలు, 56. భలితక యోగాలు (ఒక అభిప్రాయంతో ప్రయోగించిన పదానికి మరొక అర్థం తీసుకుని మాట్లాడటం), 57. అభిధాన కోశచ్ఛందో జ్ఞానం, 58. వస్త్రగోపనాలు, 59. ద్యూత విశేషాలు, 60. ఆకర్షక్రీడ. 61. బాలక క్రీడనకాలు, 62, 63, 64. వైనాయిక, వైజయిక, వైతాళిక విద్యాజ్ఞానాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు