చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు

విక్షనరీ నుండి

శ్రీరంగడు అంటే శ్రీ మహా విష్ణువు. శ్రీరంగనీతులు అంటే శ్రీ మహా విష్ణువు పేరుతో చెప్పే నీతులు. దొమ్మరి కులస్తులలో కొంత మంది పేదరికం మరియు ఆకలి వల్ల మనసు చంపుకుని వ్యభిచారం చేస్తారు. కొంత మంది తాము గౌరవంగల మనుషులమని చెప్పుకుంటూనే అందుకు విరుద్ధంగా వ్యభిచారిణులతో పడుకుంటారు. శ్రీరంగ నీతులు చెపుతూ దొమ్మరి గుడిసెలలో దూరడం అంటే దేవుని పేరుతో నీతులు చెపుతూ అందుకు విరుధ్ధముగా పాడు పనులు చెయ్యడం అని అర్థం.