జామాతృశుద్ధిన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అల్లుడు చేసిన పుస్తకపరిష్కారము విధమున. ఒకరాజు తనకుమార్తెకు తగిన వరుని నెతికి తెమ్మని పురోహితునితో ననెను. ఆపురోహితు డంతకుమున్ను రాజుకుమార్తెపైగల పగ సాధింప నెంచి బఱ్ఱెలను మేపుకొను మూర్ఖు నొకనిని తెచ్చి యితడు నీకు తగిన అల్లు డని చెప్పెను. రాజుకుమార్తె వానితెలివి పరీక్షింపఁగోరి సభచేయించెను. ఆసభలో పండితులు క్రొత్తగా రచింపబడిన పుస్తకము వానిచేతికిచ్చి యిందు తప్పులు దిద్దుమనిరి. వాడు పురోహితుడు తనకంతకు మున్న చెప్పిన చొప్పును నోరు మెదల్పక ఊరక పుస్తకము తిరుగవేయుచు ఉండిఉండి తోచక తనబొడ్డులో నున్న గోళ్ళు తీసుకొను కత్తితో అక్షరములను, గీతలను, తలకట్లను గీకివేయనారంభించెను. దానిని చూచియే రాజుకూతురు వానిమౌర్ఖ్యమును గ్రహించెనఁట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]