Jump to content

జైమిని దర్శనం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

[హిందూ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పతంజలి యోగ దర్శనానికి, కణాదుడు వైశేషికానికి మూలపురుషులైనట్లు పూర్వమీమాంసా దర్శనానికి మూల పురుషుడు జైమిని మహర్షి. ఇది వేద ప్రామాణ్యాన్ని పూర్తిగా అంగీకరించిన దర్శనం అంటారు ఆచార్య పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి తమ ‘భారతీయ తత్త్వదర్శనములు’ గ్రంథంలో. కర్మకాండ పరమైన 2735 సూత్రాలు, పన్నెండు అధ్యాయాలలో 192 అధికరణలుగా ఇది రూపొందింది. ‘‘ఒక వివాదాస్పదమైన విషయాన్ని ప్రస్తుతించి దానిపై ఆక్షేప పూర్వక వ్యాఖ్య చేసి, ఆపైన సిద్ధాంతాన్ని నిష్కర్షగా తేల్చేది అధికరణ’’ అని శాస్త్రిగారి వివరణ. వేద వాఙ్మయం అర్థాన్ని పరిష్కరించడానికి ఈ దర్శనం వచ్చినదని ఆయన అభిప్రాయం. ‘‘ప్రమాణాలు, కర్మభేదాలు, కర్మల అంగాంగీభావం, హోమపదార్థాల పరిమాణాదులు, అనుష్ఠాన విధానం, కర్మఫల భోక్తృత్వ విధానం, ప్రకృతి వికృతుల అతిదేశం, విశేషాతిదేశం, అధ్యాహారం, వికృతి బాధలు, వికృతి ఫల ప్రాప్తి, ఉపకార్యు పకారకభావం వివేచించినారు’’ అని ఆచార్య శాస్త్రి ఈ దర్శన గ్రంథంలోని విశేషాలను తెలియజేశారు. జైమిని దర్శనానికి శబర స్వామి రచించిన భాష్యం ప్రసిద్ధమైనది. ఈ భాష్యానికి కుమారిలభట్టు వ్రాసిన వ్యాఖ్యానాన్ని ఒప్పుకొన్న వారిది భాట్ట మతమనీ, ప్రభాకరుడనే ఆయన వ్రాసిన వ్యాఖ్యానాన్ని అనుసరించినవారిది ప్రాభాకర మతమనీ రెండు మతాలు ఏర్పడ్డాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]