జోరో ఆస్ట్రియనిజం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జోరో ఆస్ట్రియనిజం. పాశ్చాత్యులు ఈ పదం పలికేటప్పుడు జోరోలాస్ట్రియనిజం అని వినిపిస్తుంది. ‘ల’ అనే శబ్దం ఉచ్చారణలో నిజానికి రాదు. అది భ్రమ మాత్రమే. జోరో ఆస్ట్రియనిజం అనే పలకవలసి ఉంటుంది. ప్రామాణిక నిఘంటువులలో సైతం ఉచ్చారణ Zawr-oh-as-tree-uh-niz-uhm అని ఉంటుంది. మన దేశంలో జొరాష్ట్రియన్లు అని పలకడం అలవాటైంది. కాని, అసలు మతం పేరు జోరో ఆస్ట్రియనిజం. దాన్ని అనుసరించేవారు జోరో ఆస్ట్రియన్లు. వర్తమాన కాలంలో ఇరాన్ అని పిలుస్తున్న ఒకప్పటి పర్షియా దేశం ఈ మతానికి జన్మస్థానం. పాశ్చాత్య పండితుల అంచనాల ప్రకారం ఇది క్రీస్తు పూర్వం 1000 నుంచి 1500 సంవత్సరాలకు పూర్వం మొదలైన మతం. ఈ మతానికి పవిత్ర గ్రంథం ‘జెండ్ అవెస్ట’. మత వ్యవస్థాపకుడు జరతూష్ట్ర. జెండ్ అవెస్ట భారతీయుల ఋగ్వేద కాలం నాటిదని అంటారు. జెండ్ అవెస్టాలో ఋగ్వేద మంత్రాలను పోలిన ఛందోబద్ధ శ్లోకాల లాంటివి ఉన్నాయి. వాటిని Gathas/ గాథలు అంటారు. గాథ/ గాథా అంటే ఛందోబద్ధమైన రచన మాత్రమే. (అది ఋక్కును పోలినదే గానీ ఋక్కు కాదు. సామ కాదు, యజుర్వేద మంత్రం కూడా కాదు). జోరో ఆస్ట్రియనిజం మతం ఏకేశ్వరోపాసనను ప్రబోధిస్తుంది. నిజానికి వేదం సైతం దేవుడు ఒక్కడే అంటుంది. (ఏకం సత్, విప్రా బహుధా వదంతి. అంటే సత్యం ఒక్కటే, పండితులు అనేక విధాలుగా పలుకుతుంటారు.) జోరో ఆస్ట్రియన్లు అగ్నిని ఆరాధించరు గానీ, అగ్ని సాక్షిగా ఆరాధన చేస్తారు. వైదిక మతంలో హోమాగ్ని వలె ఆరాధన చేసే చోట అగ్ని ఉంటుంది. క్రీస్తు శకం పదవ శతాబ్దంలో పర్షియాలో ఇస్లామ్ మతం బలపడిన స్థితిలో అక్కడ ఉండలేక కొందరు జోరో ఆస్ట్రియన్లు భారత దేశానికి వలస వచ్చి గుజరాత్ రాష్ట్రంలో స్థిర పడ్డారు. ఇలా వచ్చిన వారిని భారత దేశంలో పార్శీలు అని పిలుస్తున్నారు. ఇరాన్‌లోని యజ్ద్, కెర్మాన్ అనే ఎడారి ప్రాంతాలలో కొద్దిమంది జోరో అస్ట్రియన్లు ఉన్నారంటున్నారు. కాని, ఎక్కువ మంది భారత దేశంలోనే ఉన్నారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు