జ్యోతిషశాస్త్రం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](ఎస్ట్రోలజీ) జ్యోతిషశాస్త్రం. వివిధదేశాలలో ఈ శాస్త్రం వర్ధిల్లింది. ఎస్ట్రోలజీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఎస్ట్రోన్ అంటే నక్షత్రం. వేల సంవత్సరాలుగా గ్రహగతులను బట్టి, నక్షత్రాల స్థితిని బట్టీ భవిష్యత్తును చెప్పడమనే విధానం చాలా దేశాల చరిత్రలలో కనిపిస్తుంది. మూఢవిశ్వాసాలని కొన్ని విశేషాలను కొట్టేసినప్పటికీ కొన్ని చారిత్రక సత్యాలను అలా చులకన చేయడానికి వీలుకాదు. సైకాలజీలో చాలా గొప్ప వ్యక్తిగా పేరున్న కార్ల్ యం(జం)గ్ తనకు జ్యోతిషం మీద నమ్మకం ఉందని ప్రకటించుకొన్నాడు. 1503 - 1566 మధ్య జీవించిన నోస్ట్రాడమస్ అనే ఫ్రెంచి దేశీయుడు అద్భుతమనిపించే విధంగా భవిష్యత్తును గురించిన అనేకవిశేషాలను ముందుగానే ప్రకటించాడు. ‘‘సెంచరీస్’’ అనే ఆయన గ్రంథంలోని సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని కొందరి విశ్వాసం. ఆయన జన్మతః యూదు జాతీయుడు. ఫ్రాన్స్‌లో పుట్టాడు. ఆయన అసలు పేరు మైఖేల్ డి నోత్ర్‌డామ్. భారతదేశంలోనూ వేదకాలం నుంచి జ్యోతిష శాస్త్రం గుర్తింపు పొందింది. ఐతే, ఇందులో ఒకప్పుడు ఫలితభాగం కంటె సిద్ధాంత భాగానికే ప్రాముఖ్యం ఉండేది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు