Jump to content

తిరుపతి యాస, భాష, పదాలు

విక్షనరీ నుండి

తిరుపతి ప్రాంతపు మాండలికంలో ఉపయోగించే కొన్ని పదాల జాబితా:

 • అమ్మి = ఆడపిల్ల, ( ఆ అమ్మి బాగా చదువు తుంది)
 • పలుకొటము = బడి - ఫాఠశాల
 • సమ్మళం = జీతము
 • అయ్యవారు = అయ్యేరు = పంతులు, టీచరు
 • దుడ్డు = డబ్బు, ధనము
 • ముండమోపి = భర్త లేని స్త్రీ, విడో,
 • బద్రం = జాగ్రత్త (
 • ఇస్కూలు = బడి, పాఠాశాల,
 • సిరిగందం చెట్టు = శ్రీగందం చెట్టు,
 • ఏంది = ఏంటి
 • గమ్మున = చాలా అర్థాలున్నాయి./గమ్మునుండు = ఊరికే ఉండు, గమ్మునరా = మారుమాట్లాడకుండా రా
 • మెట్లు = చెప్పులు
 • తరీఖ = పద్దతి. ఉదా: (నీ తరీఖ ఏమి బాగ లేదు)
 • తూటు, బొక్క, దుంక = రంధ్రము లేదా చిరుగు
 • పరక్కట్ట, పరక = చీపురుకట్ట, చీపురు
 • దూది = పత్తి
 • బిరీన, బిర్నా,బిన్నె = తొందరగా
 • యెలబారు= బయలుదేరు
 • అరం = తమిళ భాష
 • ఎర్రగడ్డలు = ఉల్లిగడ్డలు, ఆనియనులు
 • తెల్లగడ్డలు -- వెల్లుల్లి
 • ఉల్లగడ్డలు = బంగాళాదుంపలు
 • చీటీగలు =(లేదా చీకటి ఈగలు)దోమలు
 • బాడుగ = అద్దె
 • బీగాలు/బీగం = తాళం చెవులు/తాళం

వ్వవసాయ పనిముట్లు[<small>మార్చు</small>]

 • కపిలి =బావిలోనుండి నీరు తోడు సాధనము
 • మడక =నాగలి
 • కాడిమాను,= ఎద్దుల మెడమీద వేయు సాదనము
 • కదురుగోలు=
 • నొగ= నాగలి భాగము
 • పలికిమాను =భూమి చదును చేయుటకు వాడే ఒక పరికరము.
 • కొండ్ర=
 • సాలు=
 • కడిసీల=కడిసెల
 • కందినము=
 • బొడ్డుసీల=
 • మడవ=
 • పాది= చిన్న కయ్య
 • కయ్య = మడి
 • ఇరసాలు= రెండవసారి దున్నడము
 • మర్దాము=రెండవ పంట
 • గూడరేవు =
 • నీరుగట్టోడు=
 • మూజంబరము= ఆవులకు, దూడల మూతికి వేయు ఒక అలంకారము.
 • ఎలపట = ఎడమ వైపు,
 • దాపట = కుడి వైపు
 • కాడెద్దులు= జోడెద్దులు,
 • మక్కెన= ఎద్దులబండిలో వేసే ఒక పెద్ద బుట్ట
 • కొండ్ర = దున్నుచున్నప్పుడు వేసే ఒక సాలు( వరుస)
 • వంక = ఏరు, చిన్న నది.
 • యో = సాధారణంగా తరచూ ఉపయోగించే పదం। ఉదాహరణ్ఖు "యో ఇట్రావయ్యో" ?
 • అనపకాయ = field beans (ఆనపకాయ(సొరకాయ) కాదు)
 • మొబ్బు = చీకటి , మేఘం
 • మోఢం = మేఘం. మోఢంగా ఉంది = మేఘావృతమై ఉంది
 • పసల పండగ(పశువుల పండగ) = కనుమ
 • యాట/యాట మాంసం (వేట మాంసం) = గొర్రె/గొర్రె మాంసం
 • నూగులు = నువ్వులు
 • ఉద్ది పప్పు = మినప్పప్పు
 • పరింది కాయ = బొప్పాయి
 • పట్టా = దాల్చించెక్క
 • గసాలు = గసగసలు
 • మంచినూనె = నువ్వులనూనె
 • ముంత మామిడి కాయ(ముంత మామిడి పప్పు) -- జీడి కాయ(జీడి పప్పు)
 • ఖర్బూజకాయ = పుచ్చకాయ (water melon)
 • కీరకాయ = దోసకాయ (cucumber)
 • మొనక్కాయ = ములక్కాడ (drum stick)
 • వడ = గారె
 • చక్కెర = పంచదార
 • డేక్షా = పెద్ద పాత్ర
 • ఎనుము = గేదె
 • రిళ్ళ = బొద్దింక(cockroach)
 • అత్తిరసం = అరిశ
 • ఎర్రనీళ్లకాయ = కొబ్బరి బోండాం
 • మురుకులు = జంతికలు
 • జరుక్కోన్నా=కొంచెం అవతలికి జరుగన్నా
 • ఉద్దులు=మినుముల
 • ఉద్ది పప్పు = మినప్పప్పు
 • అలసందలు = బొబ్బర్లు
 • నిప్పట్లు = అరిసెలు
 • చియ్యలు కూర = మాంసముకూర
 • ఎర్రలు = వాన పాములు
 • గొడ్లు = పశువులు
 • జీవాలు = మేకలు, గొర్రెలు
 • మడక = నాగలి
 • సట్టి = కుండ
 • లోటా = నీళ్లు తాగె గ్లాసు
 • చెంబు =
 • గిన్నె=
 • గోతం =
 • గోనె పట్ట
 • బొంత =
 • తువ్వాలు =
 • ఊరుబిండి = చట్ని (చింతకాయ ఊరుబిండి)
 • సనగ్గింజలు = వేరుశనగ గింజలు.
 • వక్కాకు = తాంబూలము
 • నీపాసు గాల = ఇదొక ఊత పదం.
 • గుడ్డలు = బట్టలు
 • సేమిరి = పాలల్లో సేమిరి పెట్టాలి = పాలల్లో తోడు పెట్టాలి.
 • సల్ల = మజ్జిగ