ఒక్కోసారి ఏదైనా చిన్న తీగను అవసరంకొద్దీ లాగినప్పుడు అనూహ్యంగా ఆ తీగతోపాటు డొంకంతా కదలడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా చిన్న విషయం గురించి ఆరా తీస్తున్నప్పుడు పెద్ద విషయం బయటపడితే ఈ సామెతను వాడుతారు.