Jump to content

తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు

విక్షనరీ నుండి

తోచీ తోయనమ్మ /తోచనమ్మ తోటికోడలు / తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు

కొంతమంది ఏమీ తోచక విచిత్రమైన పనులు చేస్తుంటారు. చూసేవాళ్ళకు ఆ చేష్టలు వింతగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎంతో హాస్యరసపూరితంగా చెప్పడానికి తోచీ తోచనమ్మ తన తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుంది అంటారు. తెలుగు సామెతలలో చమత్కారం మేళవింపు కి ఇది ఒక మచ్చుతునక.