Jump to content

త్రి-దోషములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

మూడు విధములైన దోషములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

(అ.) 1. పదదోషము, 2. వాక్యదోషము, 3. అర్థదోషము. (ఆ.) 1. వాతము, 2. పిత్తము, 3. కఫము. [వీని వైపరీత్యము దోషము] (ఇ.) 1. జాతి దోషము, 2. ఆశ్రయ దోషము, 3. నిమిత్త దోషము. (ఈ.) 1. పరద్రవ్యాపహరణము, 2. పరదారాభిలాష, 3. మిత్రులయందు అవిశ్వాసము.

(ఉ.) 1. అతివ్యాప్తి (లక్షణము లక్ష్యములు కాని వాని యందుండుట), 2. అవ్యాప్తి (లక్షణము లక్ష్యములోనే కొన్నిటియందుండక పోవుట), 3. అసంభవము (లక్షణము లక్ష్యములలో నొక్కదానియందును ఉండకపోవుట). (ఊ.) (పరిసంఖ్యావిధి దోషములు) 1. స్వార్థ త్యాగము, 2. పరార్థ స్వీకారము, 3. ప్రాప్తబాధ.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • "పరస్వానాం చ హరణం పరదారాభిమర్షణమ్‌, సుహృదామతిశంకా చ త్రయో దోషా క్షయావహాః" [వా.రా. 6-87-24]
  • "శ్రుతార్థస్య పరిత్యాగా దశ్రుతార్థస్య కల్పనాత్‌, ప్రాప్తస్య బాధాదిత్యేవం పరిసంఖ్యా త్రిదూషణా"

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]