దక్షప్రజాపతి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. దక్షప్రజాపతి ఉమాదేవికి తండ్రి/ శివునికి మామ
  2. 1. నవబ్రహ్మలలో (లేక ప్రజాపతులలో) ఒక్కఁడు. కొందఱు ఇతఁడు బ్రహ్మయొక్క అంగుష్ఠముననుండి పుట్టినవాఁడు అందురు. కొందఱు బ్రహ్మమానసపుత్రుఁడు అందురు. ఇతని భార్య ప్రసూతి. విష్ణుపురాణప్రకారము దక్షప్రజాపతికి కొమార్తెలు ఇరువదినలువురు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి ఈపదిమువ్వురు ధర్ముని భార్యలు. (ధర్మద్వారములని ఎఱఁగవలయును.) ఈవీరియందు ధర్మునకు పుట్టిన పుత్రులు క్రమముగా కాముడు, దర్పుడు, నియముడు, సంతోషుడు, లోభుడు, శ్రుతుడు, దండుడు, బోధుడు, వినయుడు, వ్యవసాయుడు, క్షేముడు, సుఖుడు, యశుడు.

2. ఇతఁడు ప్రచేతస్సులకు చంద్రుని (సోముని) కూఁతురు అగు మారిషయందు పుట్టిన కొడుకు. ఈయన చక్షుర్మనువు కాలమున ఉండినట్లు కొందఱు చెప్పుదురు. ఇతఁడు బ్రహ్మయాజ్ఞపడసి మైథునక్రియవలన సృష్టిచేయ ఆరంభించెను. తత్పూర్వము సంతానము దృష్టిసర్శేచ్ఛాదులవలన కలుగుచు ఉండినట్టు తెలియవచ్చుచున్నది. ఈతఁడు వీరణప్రజాపతి కూఁతురు అగు అసిక్నిని భార్యగా గ్రహించి ఆమె యందు తొలుత హర్యశ్వులు అను ననేక పుత్రులను పడసెను. వారు అందఱును నారదుని ఉపదేశమున ప్రజాసృష్టియందు ఇచ్ఛ ఉడిగిరి. మరల శబలాశ్వులు అను ననేక పుత్రులను పుట్టించెను. వారలును అట్ల అయిరి. అంత దక్షుఁడు నారదుని మీద కోపించి అతనికి అనపత్యతయును నిరంతర సంచారమును కలుగునట్లు శపించి అఱువండ్రు కొమార్తలను అసిక్నియందు పుట్టించెను. అందు ధర్మునికి పదుగురను, కశ్యపునికి పదుమువ్వురను, చంద్రునకు ఇరువదియేడుగురను, అరిష్టనేమికి నలుగురను, అంగిరసునకు ఇరువురను, కృశాశ్వునకు ఇరువురను, బహుపుత్రునకు ఇరువురను ఇచ్చి వివాహములు చేయించెను. శ్రీమద్భాగవతమున తార్క్ష్యుఁడు అను నామాంతరము తాల్చిన కశ్యపునకు మరల నలుగురు కొమార్తెలను ఇచ్చినట్లు చెప్పి ఉన్నది. (ధర్ముని భార్యలు 10మందా 13గురా???

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]