దేవదారువనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇందు ఒకప్పుడు భృగ్వాది ఋషులు తపము ఆచరించుచు ఉండ వారల మాయామోహితులుగ చేయ రుద్రుఁడు ఒక సుందరము అయిన యౌవన పురుషరూపమును, విష్ణువు జగన్మోహనము అగు ఒక సుందరీరూపమును తాల్చి అచటికి వచ్చి తామును అచటి ఋషులవలె తపము ఆచరింపవచ్చినట్లు వారితో చెప్పఁగా వారు వీరి కలరూపును ఎఱఁగమిచే వీరి సుందరరూపములు తమకును తమయువిదలకును తపోభంగము కావించును అని భీతిచెంది రుద్రుని చూచి నీకు ఇందు ఉండ ఇష్టము ఉండనేని నీలింగమును విసర్జించి ఉండుము అనిన అతఁడు నిజలింగోత్పాటనము చేసి దానిని అందు పాఱవైచి అదృశ్యుఁడు అయ్యెను. అప్పుడు అనేక మహోత్పాతములు పుట్టెను. అంత ఆఋషులు నిజస్థితిని ఎఱిఁగి దీనికి ఉపశాంతి ఆనతి ఇమ్ము అని బ్రహ్మను ప్రార్థింపఁగా అతఁడు కరుణ కలిగి వారిని రుద్రుని లింగాకారముగ పూజింప నియమించెను. అంతట రుద్రుడు ప్రసన్నుఁడు అయ్యెను. దీనిని దారువనము అనియు అందురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]