నన్నయ్యభట్టారకుఁడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆంధ్రకవులలో మొదటివాఁడు. వేగిదేశాధీశుఁడైన రాజరాజనరేంద్రుఁడు రాజమహేంద్రమున రాజ్యము చేయుకాలమున అతనియొద్ద ఇతఁడు ఆస్థానపండితుఁడుగా ఉండెను. ఇతఁడు తన యేలినవాని ప్రేరేఁపణచేత భారతమున మొదటి రెండుపర్వములను, ఆరణ్యపర్వమున కొంతభాగమును తెనిఁగించి కాలధర్మమును పొందెను. (తక్కిన భారతవిశేషమును ఎఱ్ఱాప్రెగ్గడయు, తిక్కన సోమయాజియు తెనిగించిరి. చూ|| తిక్కన.) మఱియు ఈయన ఆంధ్రశబ్దచింతామణి అను పేర తెనుఁగునకు ఒక వ్యాకరణమును రచియించి దానికి లక్ష్యముగా ఈ భారతమును రచియించెను అని చెప్పుదురు. ఈహేతువును బట్టియే ఇతఁడు వాగనుశాసనుఁడు అనఁబడెను. ఈకవి తాను రచియింపబూనిన భారతమును ముగింపకయే కాలధర్మమును పొందుటకు కారణము భీమన అను మహాకవియొక్క శాపము అని కొందఱు చెప్పుచు ఉన్నారు. అది ఎట్లు అనఁగా, భీమన ఇతఁడు భారతమును తెనిఁగించుటకు మునుపే ఒక భారతమును తెనుఁగున రచియించి ఆగ్రంథమును నన్నయభట్టారకునివద్దకు కొనివచ్చి దానియందలి లోపాలోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగఁజేయవలయును అని అడుగఁగా దానిన అతఁడు చదివిచూచి అందలి ప్రయోగపద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండఁగా అది బయటవచ్చినయెడ తన భారతము అడఁగిపోవును అని ఎంచి ఆయభిప్రాయమును బయలుపఱపక భీమకవితో నేను రాజు ప్రేరేఁపణచేత ఒక భారతము రచియించుచు ఉన్నాను. ఆదిపర్వముమాత్రము ఇప్పటికి అయినది. ఇప్పుడు ఈగ్రంథమును రాజునకు చూపిన యెడ తన ప్రయత్నము నెఱవేఱుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపఁడు కనుక సమయముచూచి నీగ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన ఒద్ద ఉంచుకొని ఆయనను పంపి దానిని కాల్చివేసెను. ఈసంగతి భీమన ఎఱుఁగడు కనుక కొన్ని దినములు తాళి నన్నయభట్టారకుని యింటికివచ్చి అప్పుడు ఆయన ఇంటలేకపోఁగా ఆయన భార్యను పిలిచి నీభర్తచేయుచు ఉన్న భారతము ముగిసెనా అని అడిగినంతట ఆమె ఆరణ్యపర్వము జరుగుచు ఉన్నది అని చెప్పెను. అది విని అతఁడు తనకు ఏసమాచారమును తెలియఁజేయకయే ఇతఁడు గ్రంథరచన జరపుచు ఉన్నాఁడు కనుక తన గ్రంథమును ముందుకు రానీయఁజాలఁడు అని తలఁచి దానివలని సంతాపముచే ఇంకను ఆరణ్యములోనే పడి ఉన్నాఁడా అని చెప్పఁగా అదియే శాపముగా తగిలి ఆకాలమందు ఏమోపని కలిగి ఊరిముందరి అడవికి పోయి ఉండిన నన్నయభట్టారకుఁడు అక్కడనే దేహత్యాగము చేసెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు