నముచి
స్వరూపం
నముచి ఒక రాక్షసుడు. ఈయన కశ్యపునికి , ధనువుకి జన్మించిన కుమారుడు. నముచి భార్య ప్రభ. దేవ దానవ యుద్ధంలో ఇంద్రుడు వజ్రయుధంతో కొట్టినా ఈయన కసికందలేదు.ఇతనికి బ్రహ్మ యిచ్చిన వరం అలాంటిది. తడిసిన దానితోగానీ, పొడిదానితో గానీ ఈతనికి చావులేదు. అయినా నముచి దేవేంద్రునికి భయపడి దాగి భయంకరమైన తపస్సు చేశాడు. ఇంద్రుడు నముచితో ఇంద్రుడు చంపనని నమ్మించి స్నేహం చేసి పగలు రాత్రి గాని సంధ్యా సమయంలో, తడి పొడి గాని సముద్రపు అలల నురగతో తన వజ్రాయుధాన్ని ముంచి సంహరించాడు.