Jump to content

నాడు

విక్షనరీ నుండి

మొన్న

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆరోజు, ఒక్క ప్రాంతం., ఉదా: తమిళనాడు,

  • ఈ పదానికి రోజు, సమయం, కాలం, పక్షంలో (ఎడల), దేశం ప్రదేశం, పల్లె మొదలకు అర్థాలున్నాయి. ఎన్.టి.రామారావు గారి తెలుగు దేశం ఆవిర్భావంతో బాటు తెలుగుభాషలో మరో నాడు క్రొత్తగా ప్రవేశ పెట్టబడినది. అది మహానాడు ఇది తమిళార్థం గల మాట. "కమ్మనాడు", కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.కర్మరాష్ట్రములోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి. దాని తర్వాత కాపునాడు వంటి పదాలు పుట్టు కొచ్చాయి. కాపునాడు అనగా కాపు కులస్థులున్న దేశం, /ప్రదేశంగా చెప్పుకోవచ్చునేమో గాని మహానాడుకు అలాంటి అర్థ బోధ లేదు. రాజకీయంగా మరో అర్థం వచ్చి చేరిందన్నమాట భాషాభి వృద్ధికి చిహ్నంగా. కానీ ఇది (మహానాడు) ఇంకా నిఘంటువుల కెక్కలేదు. (మూలం: బూద రాజు రాధాకృష్ణ గారి వ్వాసం. మాటలు మార్పులు.....70)
నాటు, గ్రుచ్చుకొను, విఱుగు, ఖండితము.....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఇవ్విశ్వంభర నేద్వీపంబున నేదేశంబున నేనాట నేవీట నేత్రోవ నేక్రేవ నేవేళ నెవ్వండేమి సేయఁదలంచె
  • తోడన హయసూతుల నో, నాడఁగ నేయుటయు నతఁడునలిగి కడఁక విల్‌, గ్రీడయపోలెన్‌ గొని మెయి, నాడఁగ నిగిడించెఁ ద్రిదశ నారాచంబుల్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=నాడు&oldid=956148" నుండి వెలికితీశారు