నూరు చిలుకల ఒకటే ముక్కు
Appearance
పల్లె ప్రాంత ప్రజల ఉహా ధోరణి విచిత్రంగా ఉంటుంది. వారికి తెలిసిన వస్తువులను వారికి తెలిసిన వాటితో పోల్చి చెపుతుంటారు. ఈ పొడుపు కధ కూడా అలా ఒక వస్తువుతో పోల్చి చెప్పుకొనగా ఉద్భవించినదే. నూరు చిలకలు ఉంటే వాటికి ఒకటే ముక్కు ఉండటం సృష్టిలో చాలా విచిత్రమైన విషయమే. ద్రాక్షపండ్ల గుత్తిలోని ద్రాక్ష పళ్ళన్నీ పచ్చగా గుత్తిగా ఒద్దికగా ఒకే చోట ఉండటం పొడుపు కధ. ద్రాక్ష పళ్ళన్నీ చిలకలుగా వాటిని కలుపుతూ ఉన్న ఒకే తొడిమ ముక్కుగా సృష్తికర్త భావం. అందుకే దీనిని విడుపు ద్రాక్ష గుత్తి అంటుంటారు.