Jump to content

పంచార్ష సంప్రదాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

హిందూ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పంచార్ష సంప్రదాయం : వర్ణ వ్యవస్థ ఏర్పడిన కొంతకాలానికి ‘‘బ్రాహ్మణ్యంలో కర్మ జన్మ విశేషాల వల్ల ఆర్షేయమనీ, పౌరుషేయమనీ రెండు శాఖలు’’ ఏర్పడ్డాయి. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు (మన్వంతరాలలో సప్తర్షులు మారుతుంటారు) అనే సప్తర్షుల పేర్లు గోత్రాలుగా వృద్ధిపొందినవారు ఆర్షేయ (శాఖ) బ్రాహ్మణులు. వీరే సప్తార్షేయ బ్రాహ్మణులు. సానగ, సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణులనే పంచార్షుల గోత్రాలు కలిగి వృద్ధిపొందినవారు పౌరుషేయ (శాఖ) బ్రాహ్మణులు. వీరు పంచార్షేయ బ్రాహ్మణులు. ‘‘సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే ఐదు ముఖాల నుంచి మను, మయ, త్వష్టృ, శిల్పి, విశ్వజ్ఞులనే పంచ బ్రహ్మలు ఉదయించారు, వీరు ఋక్‌ యజుస్సామాధర్వణ ప్రణవాలనే పంచవేదాలకు ప్రవక్తలు.’’ సానగాది ‘‘పంచర్షులు ఈ ఐదుగురి అంశావతారులు. వీరే విశ్వబ్రాహ్మణులకు మూల పురుషులు.’’ విశ్వకర్మ పరమేశ్వరుడు విశ్వబ్రాహ్మణులకు ఇష్టదైవం. శ్రీ దీవి సుబ్బారావు ప్రచురించిన ‘పంచ ఋషి సంప్రదాయం’ గ్రంథంలో ఈ సమాచారం ఉంది. ఈ గ్రంథంలోని మరికొందరు విద్వాంసుల వ్యాసాలలోనూ, ‘ప్రత్నానంద’గా ఆశ్రమనామం స్వీకరించిన ‘కళాప్రపూర్ణ’, ‘దర్శనాచార్య’ కొండూరు వీరరాఘవాచార్యులవారి రచనలలోనూ విశ్వబ్రాహ్మణులను గురించి అనేకానేక ప్రమాణాలతో మరిన్ని వివరాలు లభిస్తాయి. .......................పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]