పరగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము,క్రియ/వై. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రయుక్తమగు; "వ. ఆ సూతనందనుండు మొదలగునమ్మేటిమగల మార్గణమ్ము లమ్మనుజపతిపైఁ బరగుటయు." భార. కర్ణ. ౨, ఆ.
- ప్రవర్తిల్లు; "క. ఎక్కడనడచును సత్యం, బెక్కడధర్మంబు పరగునెక్కడ గలుగుం, జక్కటినిలుచుం గృష్ణుం, డక్కడ నతఁడున్నకతననగు జయమధిపా." సం. "యతస్సత్యంయతో ధర్మోయతో హ్రీరార్జవం యతః, తతోభవతి గోవిందో యతః కృష్ణ స్తతో జయః." భార. ఉద్యో. ౨, ఆ.
- ప్రసరించు ; "క. తిరిగితిమి గాలికైనం, గొరగూడని చోటులెల్ల సూర్యమరీచుల్, పరఁగని నెలవులుసూచుట, యరుదే యనిరుద్ధు జూడ నలవడదయ్యెన్." ఉ, హరి. ౫, ఆ.
- ప్రసిద్ధమగు ; "క. ఉత్తమమగు వంశంబున, నుత్తమ కులమున నితండనుత్తమయశుఁడై, యుత్తమనృపతికిఁ బుట్టుట, నుత్తముఁడనఁగం బరంగు నుర్వినని మునుల్ చనిరి." మార్క. ౫, ఆ.
- ప్రయాణమగు ; "క. ఆ దివ్యౌషధమును దన, పాదంబుల యందు దాల్చిపరఁగి రయమునన్, భూదేవు డుదఙ్ముఖుడై, మోదంబున హిమనగేంద్రమునకుం జనియెన్." మార్క. ౪, ఆ.