పాడి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం./ దే. వి.
- వ్యుత్పత్తి
నామవాచకము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పాలు. న్యాయము/ క్షీరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పాడి అంటే పాలిచ్చే జంతువులను పెంచడం.
- పాలు అని అర్థం
- పాడి అనగా న్యాయము అని కూడ అర్థమున్నది.
- పాడి అనగా..... చనిపోయిన మానవ శరీరాన్ని... శవ దహనానికి తీసుకెళ్ళడానికుపయోగించే కర్రలతో చేసిన ఒక వేధిక.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పద్యంలో పద ప్రయోగము: పదుగురాడు మాట పాడి యై ధర జెల్లు... ఒక్కడాడు మాట ఎక్కదెందు.
పాడిపంటలకు కొదవ లేదురా....
- "ఎ, గీ. పాఁడిసేఁపెఁ బుష్పఫలభరితంబులై, తరువనంబులొప్పె." భార. ఆది. ౫, ఆ.
- "ఎ, గీ. ప్రణవమను క్రేపుతోఁగూడి పాఁడిఁబిదుకు, నవనిసురులకు గాయత్రియనెడు సురభి." కాశీ. ౩, ఆ.
- 1. ధర్మము;......."గదాసంగరమునఁ బాడిఁదొఱంగి యిప్పాపకర్ముడు వైచెఁగాక." సం. "అధర్మేణ గదాయుద్ధే యదహం వినిపాతితః." భార. శల్య. ౨, ఆ.
- 2. వ్యవహారము;."ఎ, గీ. పాడికరిగి గురునితోడ శిష్యుఁడు తండ్రి, తోడఁ గొడుకు మగనితోడ నాలు, స్వామితోడఁ బంటు సభఁజెప్పఁ జనదైన, నందు నిహపరములనిందవచ్చు." సం. "గురోశ్శిష్యే పితుఃపుత్రే దంపత్యో స్స్వామిభృత్యయోః, విరోధేతు మిధస్తేషాం వ్యవహారో నసిద్ధ్యతి." విజ్ఞా. వ్య, కాం.
- 3. న్యాయము;......"క. నడవఁజాలనివారలఁ, దడయక మోపించితెచ్చి ధరణీశుఁడు దాఁ, దడవోర్వని కార్యములకు, నెడసేయక పాడి నిర్ణయింపఁగవలయున్." విజ్ఞా. వ్య, కాం.
- 4. స్వభావము......"చ. అతివ యపాయముం బొరయునప్పుడు కావక తక్కెనేని యా, పతి పతియే తలంప మగపాడియె లోకము పాడియే." భార. విరా.
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 బయటి లింకులు[<small>మార్చు</small>] |