పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు

విక్షనరీ నుండి

'పుల్లాయావారం చేసావ్.' ఇది మాట వాడుక. సరిగా జరగని లేదా ప్రయోజనము లేక జరిగిన పనిని గురించి వాడబడు పదం. ఆచంట షావుకారు తన పనివాడు పుల్లయ్యకు చెప్పాడు ఇలా "ఒరే పుల్లయ్యా రేప్పొద్దున్నే ఓసారి వేమారం వెళ్ళిరావాల్రా పెందలకడనే లేచి". అప్పుడు పుల్లయ్య "సరేనండయ్యా" అని పుల్లయ్య ఇంటికెళ్ళి పడుకొని మరునాటి ఉదయమే లేచి వేమవరం వెళ్ళి వచ్చేసాడు.తాపీగా మధ్యాహ్నానానికి వచ్చిన పుల్లయ్యను చూసి "ఏరా పుల్లయ్యా ఎక్కడికి పోయావ్ పొద్దున్నే వేమవరం వెళ్ళాలన్నానుగా " అన్నాడు షావుకారు. అప్పుడు పుల్లయ్య "అయ్య నేను పొద్దున్నే లేచి ఎల్లొచ్చేసేనయ్యా ఏమారం" అన్నాడు మన పిచ్చి పుల్లయ్య . "నేను పనేంటో చెప్పకుండా ఎలా వెళ్ళావు. ఎందుకెళ్ళావు ?ఎందుకొచ్చావు? నీకు చెప్పడం నా తప్పు " అని వాపోయాడు షావుకారు.

పై కధనం మీదుగా ఈ సామెత పుట్టిందని ఒక వాదన.