పేదరాసి పెద్దమ్మ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
రూపాంతరం
పేదరాజు పెద్దమ్మ, పేదరాల పెద్దమ్మ,

అర్థ వివరణ[<small>మార్చు</small>]

యాభై అరవై ఏండ్ల దాక, ఆంధ్రదేశకథా వాఙ్మయంలో ఈమె ఒక కీలకపాత్ర. ప్రతి పల్లెలోను, పట్టణములోను ఉండవలసిన ధర్మశాలకో, సత్రానికో ఈమె పాలకురాలు. నైమిశారణ్య సత్రయాగాలలో శౌనకాది మహర్షులకు పురాణము చెప్పుచుండిన సూతుల స్థానము వంటిదే, ఆంధ్రదేశ జానపద కథాశ్రవణ ప్రకరణమున ఈ పెద్దమ్మ పాత్ర. వచ్చే పొయ్యే బాటసారులకు ఈమె మంత్రాలోచనలు చెప్పి కాలక్షేపము జరిపి, కతలుచెప్పి ఊరడించి దారిచూపేది. దేశంలో జరిగిన జరుగుచున్న సమాచారము ఈమె నోటిగుండానే ప్రసారిత మగుచుండును. ఈమె కతలకు పుట్ట, మాటలకు నేర్పరి. సత్రంలోనే ఒక మూల ఉండే పూటకూల్లిల్లు ఈమె సొంతము. తిన్నవారు ఎగవేసి పోయినట్లు మాత్రం ఇంత వరకు వినికిడి లేదు. . పాంథులు వచ్చి రాత్రి విడిది చేసి ఈమె చేతి అన్నంతిని, నోటిమాటలు విని. దేశ కాలపరిస్థితులు ఆకళింపునకు దెచ్చుకొని, పరిశ్రాంతిని పొంది, తొలికోడితోగూడలేచి, ఎవరిపాటికి వాళ్లు పొయ్యేవాళ్లు. . విజయజిగీషులైన రాకుమారులకు దుర్గాధిపతుల వార్తలు సవిస్తరంగా చెప్పేది. ప్రణయార్తులైన యువకులకు ప్రియలబ్ధోపాయముల ఉపదేశించేది. వర్తకులకు సాగరాంత సీమ వాణిజ్య పద్ధతుల వివరించేది. ఇక స్థానికులకు ఈమె కథలే ఊరట; ఊరివారంతా వేసవి రేయి ఈమె దీపంచుట్టూ, చలికాలంలో ఆమె కుంపటి చుట్టూ మూగి ప్రపంచ వృత్తము వినేవారు. . ఈమెకు మగడుండిన పొలకువే కానరాదు. అయినా "శివదీక్షాపరురాలనురా, శీలమెంతైనా విడువజాలనురా" అని ఒక జావళిలో ఆవేదన పడిన ఇల్లాలు వలెనే నడతలో కొరత లేకుండా నడచుకొన్నది. కాంచీపురానికి నంగనాచి, నెల్లూరుకు నెఱజానవలె, యావదాంధ్ర దేశానికి, ఈ పేదరాజు పెద్దమ్మ, తెనుగు దనంతో తొణికే మహిళామణి. ఆమెతో గూడానే, రసవత్తరమైన ఆ కథలు గూడ తెనుగునాట నుండి నిర్వాసం పోయినవి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]