ప్రస్తరప్రహరణన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ప్రస్తరప్రహరణమన దర్భాగ్రములను హోమము చేయుట. అనవసరముగ దర్భలను దాచియుంచికొనక వానిని హోమము చేసి తద్ద్వారా ఉత్కష్టఫలమును పొందుటయేగాక కర్మకాండానుసారిత్వము మున్నగు ననేక ప్రయోజనములను పొందునట్లు. అనఁగా- దర్శపూర్ణమాసలయందు ప్రస్తరప్రహరణము సూక్తవాకములతో విధింపఁబడియున్నది. ఆ ప్రస్తరప్రహరణము (దర్భలతో హోమము) నకు ఫలితమేమన- ఒక హోమాదులకేగాక ఇంకెందును దర్భలకుఁ బ్రయోజనము కాన్పించదు. అట్టి నిరర్థకపదార్థములు గుట్టలు గుట్టలుట నిలువగాకుండఁ బోవుటయు, విధ్యనుసారిత్వము, దేవతా ప్రీతి, కర్మాధికారిత్వము మున్నగు ఫలములు ఆ హోమము వలన లభించుచున్నవి. 2. ప్రస్తరప్రహరణమన ఱాలు రువ్వుట యని మఱొక యర్థము. ఱాలు రువ్వుటవలనను ననేకలాభాపత్తి దృష్టమవుచున్నది. అనుపయోగములయిన చిన్నచిన్న ఱాళ్ళు కాళ్లుకొట్టుకొనిపోవునట్లు వ్యర్థముగ నిలువగాక అందందు పారవేయఁబడుటయు, యదుద్దేశమున ఱాలు రువ్వనారం భించితిమో అయ్యది సిద్ధించుటయు నెఱవేఱుచున్నవి. ఏతావతా ఆశయ మేమన "ఏకా క్రియా ద్వ్యర్థకరీ" అనునట్లు ఒకేకార్యమువలన ననేకార్థసిద్ధి యవుపట్ల నీన్యాయ ముపయోగింపఁబడును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]