బోరు బావి
Appearance
బోరు బావి అనే పదం ఇంగ్లిసు తెలుగు పదాలసంకరం.బోరు(Bore)అనగా పొడవైన గుల్ల/రంద్రం/ఖాళి భాగం.భూమిలోనికి100-400 అడుగులలోతు వరకు నీటి వూట పడు వరకు రంధ్రం చేసి,ఆ లోతులో మునుగి వుండెలా నీరును తోడు పంపును(submersible pump)అమర్చిన దానిని బోరు బావి(bore well)అందురు.ఈ బోరుబావి వ్యాసం 5-8 అంగుళాల వ్యాసం వుండి,నీరు తోడు పైపు(గొట్టం)2-4 అంగుళాల వ్యాసంతో వుండును.మాములు బావులు30-50అడుగులలోతు మాత్రమే వుండును.నీరు తక్కువగా వుండు ప్రాంతాలలో బోరుబావి లోతు500-600 అడుగులు వుండును.