బౌద్ధులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బౌద్ధులూనగా బౌద్ధమతమును అవలంబించినవారు. ఈమతమును స్థాపించినవాఁడు శాక్యబుద్ధుఁడు అని ప్రసిద్ధికి ఎక్కిన గౌతముఁడు. ఇతఁడు రమారమి రెండువేల నన్నూఱు సంవత్సరములకుముందు జీవించి ఉండినటుల తెలియవచ్చుచు ఉన్నది. ఈ మతము సత్య శీల శమ దమాదిగుణములను విశేషముగ బోధించును. ఎట్టివానికిని ఇది శాంతమును ఉపదేశించునే కాని వైరమును పుట్టింపదు. సత్వగుణ ప్రధానము అయి అడఁకువ నమ్రత వినయము ఇత్యాది సాధుగుణముల నేర్పుటయందు మఱి యేమతమును దీనిని మించి ఉండదు. అయినను బౌద్ధులు పురాణములను వేదములను విశ్వసింపరు. వర్ణాశ్రమభేదముల ఒప్పుకొనరు. కొందఱు నిరీశ్వరవాదులు, మఱి కొందఱు సృష్టికి కారణము ఏదియో అది ఒకటి కలదు అని చెప్పుదురు గాని అందుల దృఢమైన మనోనిశ్చయముగాని నమ్మకముగాని వీరికి లేదు. వీరు భరతఖండమున ఇపుడు సకృత్తుగా కానఁబడుచు ఉన్నారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బౌద్ధులు&oldid=958177" నుండి వెలికితీశారు