భర్చున్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భర్చుడు బ్రతికియుండియే పిశాచమైనట్లు. ఒకరాజునకు భర్చుడు అను మంత్రి గలడు. అతడు రాజని యక్తుడై శత్రువును జయింప నితరదేశమునకేగెను. అత డాతని నోడించి కొన్నిసంత్సరములా దేశమునందే యుండెను. విరోథులెవరో "భర్చును శత్రువులు చంపివైచిరి" అని రాజునకు దెలిపిరి. రాజుమఱొక మంత్రిని నియమించికొనెను. కొంతకాలమునకు భర్చుడు స్వదేశమునకు మఱలి వచ్చి తన స్థానమున మఱొకడు నియమింపబడుట జూచి విరాగియై సన్యసించి అడవికి పోయెను. రాజొకనాడాయడవికి వేటకరిగెను. భటులు భర్చుని చూచిబెదరి "రాజా ! అదుగో, భర్చునిపిశాచము"అని కేకలువైచిరి. అంతకు బూర్వమే అట్లువిని యుండుటవలన రాజు వాని యాకారాదుల్వలన నిజముగా భర్చుడు పిశాచి మయ్యెనని నిశ్చయించి కొనెను. (నలుగురూ నంది అనిన నంది: పంది అనిన పంది.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు