మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి కించన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పూర్వమొకపుడు శుకుడు జనకరాజు విదేహనామమున జీవన్ముక్తి సంపాదించినవాడనియు, బ్రహ్మజ్ఞాని యనియు, కర్మనిష్ఠుడై ఆత్మజ్ఞానియనియు, తండ్రివలన నెఱింగి జనకుని పాలికిం జని ఆయనతో వేదాంతవిచారణ చేయుచు కర్మపరుడై ఆత్మజ్ఞాని యగు టెట్లను విషయమున వాదించుచున్న సమయమున భటుఁ డొక డరుదెంచి జనకునితో- రాజా! పట్టణ మొకమూలనుండి తగుల బడుచున్నదని విన్నవించుకొనెను. అది విని రాజు చిరునవ్వునవ్వుచు వికార మిసుమంతయు నొందక యిట్లనెను. "మిథిలాయాం ప్రదీప్తాయాం న మే కించన దహ్యతి" (అలాగా? పోనిమ్ము. మిథిలాపట్టణ మంతయు తగుల బెట్టినను యీఅగ్ని నా మనస్సును తగుల బెట్టగలదా?) ఆమాటలు విని శుకు డాయన గంభీరచిత్తత్వమున కెంతయు నచ్చెరువొందెను. బ్రహ్మనిష్ఠుల మనసు అనంతమై యుండును. వారికి ప్రపంచములో కావలసిన దెద్దియు లేదు. ఎట్టిస్థితి సంభవించినను వారు వికారము నొందరు. కర్మలు చేయుచుందురు; కర్మఫలలిప్తులు మాత్రము కారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]