రంతిదేవుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పు|| సంకృతి కొడుకు. ఇతఁడు తన సంచితార్థమును అంతయు దీనులకు ఇచ్చి అడవుల తిరుగుచు ఒకప్పుడు మిక్కిలి అలసి కడుడస్సితోను క్షుత్తుతోను భుజింపఁబోవుతరిని ఒక బ్రాహ్మణుఁడు భిక్షము అడుగవచ్చెను. అపుడు అతనికి తన యన్నములో అర్ధభాగము ఇచ్చెను. తోడనే మఱియొక బ్రాహ్మణుఁడును అర్థి అయి వచ్చెను. అప్పుడు ఇతఁడు మిగిలి ఉన్న అన్నములో అర్ధభాగము అతనికి పెట్టెను. అటుపిమ్మట మఱియొకఁడు వచ్చి ఆఁకలి కొంటిని అన్నము పెట్టుము అని అడిగెను. అంత అతనికి తక్కిన అన్నమును అంతయు ఇచ్చివేసెను. మఱికొంతసేపటికి ఇంకొక అతిథి వచ్చి మిక్కిలి దప్పి అగుచు ఉన్నది అని ఇతఁడు ఉంచుకొని ఉన్న జలమును త్రాగిపోయెను. అట్లు అన్నపానీయములు రెండును తనకు దక్కకపోఁగా ఇతఁడు తనకు ఒదవిన ఆఁకలి దప్పులకు ఓర్చి ఈశ్వరధ్యానము చేయుచు నిర్విచారముతో ఉండఁగా, బ్రహ్మాది దేవతలు ఇతని ధార్మికత్వమునకు మిగుల మెచ్చుకొని ప్రసన్నులు అయి ఇతనికి మోక్షము ఇచ్చి చనిరి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]