Jump to content

రథకారన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

'రథకారుఁడు' అనిన వ్యుత్పత్తిసిద్ధమవు రథము చేయువాఁడు అను నర్థము గాక 'రథకారుఁడు' అను రూఢార్థమే గ్రహింపఁబడినట్లు. దీనికి 'రథకారాధికరణన్యాయము' అనియుఁ బేరు.

"ఆధానే శ్రూయతే, వర్షాసు రథకార ఆదధీతేతి! తత్రరథం కరోతీతి వ్యుత్పత్త్యా త్రైవర్ణికో రథకార ఇతిచేత్‌| నైవమ్‌ సంకీర్ణజాతివిశేషే రూఢత్వాత్‌| వైశ్యాయాం క్షత్రియాదుత్పన్నో మాహిష్యః| శూద్రాయాం వైశ్యా ఉత్పన్నా కరణీ| తస్యాం కరణ్యాం మాహిష్యాదుత్పన్నో రథకారః| తథా చ యాజ్ఞవల్క్యః-'మాహిష్యేణ కరణ్యాంతు రథకారః ప్రజాయతే' ఇతి 'తస్య చ రథకార స్యాధానకాలో వర్షర్తుః||"

(వైశ్యస్త్రీ యందు క్షత్రియునివలన జనించినవాఁడు మాహిష్యు డనఁబడును. శూద్ర స్త్రీ యందు వైశ్యుని వలన జనించిన స్త్రీ కరణి యనఁబడును. ఆకరణియందు మాహిష్యునివలన జనించినవాఁడు రథకారుడు అని చెప్పబడుచున్నాఁడు. ఇవన్నియు సంకీర్ణజాతులు.) "రథం కరోతీతి రథకారః" అను వ్యుత్పత్తిచే రథకారశబ్దమునకు రథము చేయువాడు అనియు నర్థమే. కాని రథము చేయువాడు అనునది గౌణార్థము; సంకీర్ణజాతిజనితుడు ముఖ్యార్థము. గౌణముఅనఁగా వ్యుత్పత్తిసిద్ధము; ముఖ్యము అనఁగా రూఢము. అట్టియెడ ఆధానప్రకరణమున వర్ష ఋతువునందు రథాకారున కాధానము కావింపఁబడవలయు నని చెప్పబడినది. ఇందు బ్రకరణగృహీత రథకారశబ్దమునకు సంకీర్ణజాతిజనితుడవు రథకారుడా, లేక రథములు చేయునాతఁడా వాచ్యుఁడు అను శంక వొడమ, "అవయవసిద్ధేః సముదాయసిద్ధి ర్బలీయసీ" (అవయవసిద్ధార్థముకంటె సముదాయసిద్ధార్థము అనఁగా రూఢార్థము బలవత్తరము అను పరిభాషచే పంకజమునకు అవయవసిద్ధములవు బురదలో పుట్టిన నత్త మున్నగునవి నిరాకృతములై పద్మము అను ముఖ్యార్థమే స్వీకరింపబడుచున్నటుల గౌణార్థము నిరాకృతమై ముఖ్యమవు సంకీర్ణజాతివాచక రథకారుడే గ్రహింపబడవలయునని యాచార్యులచే సిద్ధాంతీకరింపఁబడినది.) ఏతావతా గౌణార్థమును వదలి ముఖ్యార్థమును బోధించు పట్ల నీ న్యాయము ప్రవర్తించును అని సారాంశము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]