రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
స్వరూపం
ఎవరైనా తాము తినాలనుకున్న రొట్టె తనంతట తాను విరిగి నేతిలో పడితే దాని రుచి పెరుగుతుంది, దన్ని త్రుంచే శ్రమ తప్పుతుంది. అదే విధంగా అనుకున్న పని వేరొక సంఘటన వలన మనకు సౌకర్యంగాను, సులభతరంగాను మారితే ఈ సామెతను వాడుతారు.
- రొట్టెను నేతిలొ అద్దుకొని తింటే చాల రుచిగా వుంటుంది. పొరబాటున ఒక రొట్టె విరిగి నేతిలో పడింది. దాన్ని దాచిపెట్టనూ లేరు, పారేయనూ లేరు. తప్పనిసరిగా పిల్లలకు ఇవ్వ వలసిందె. ఆ విదంగా పిల్లలకు అనుకోకుండా కలిసివచ్చిన అవకాశము అది. అలా అనుకోకుండా మంచి అవకాశము వస్తే ఈ సామెతను వాడుతారు.