Jump to content

వాడుకరి:డా. గన్నవరపు నరసింహమూర్తి

విక్షనరీ నుండి

పూర్తి పేరు గన్నవరపు వరాహ నరసింహమూర్తి. జననం విజయనగరం జిల్లా, శృంగవరపుకోటలో. విద్యాభ్యాసం విశాఖపట్టణం, ఏలూరులలో జరిగింది. ఆంధ్ర వైద్యకళాశాలలో వైద్యవిద్య అభ్యసించి, పట్టభద్రుడనై, శస్త్రవైద్య విభాగంలో స్నాతకోత్తర విద్యాభ్యాసం ముగించి శస్త్రవైద్యనిపుణుడిగా పట్టభద్రుడయ్యాను. తర్వాత ఉత్తర అమెరికా దేశంలో వైద్యవృత్తి కొనసాగించా. వైద్యవిభాగంలోను, అత్యవసర వైద్యవిభాగంలోను, ఎండోస్కొపీలోను శిక్షణ, అనుభవం పొందాను. 2020 లో వైద్యవృత్తిని విరమించినా వైద్యవిజ్ఞానిక పత్రికలు, వైద్యగ్రంథాలతో పరిచయం కొనసాగిస్తున్నా. తెలుగుభాషపై ఎక్కువ మక్కువ, అన్ని రకాల సాహిత్యాలపై అభిలాష ఉన్నాయి. ఛందోబద్ధంగా కొన్ని పద్యాలు అల్లాను. కొన్ని కవితలు, వ్యాసాలు కూడ వ్రాసా. ‘తెలుగుతల్లి కెనడా’ మాసపత్రికలో సాధారణంగా చూసే విషయాలపై వైద్యవ్యాసాలు వ్రాసా. అవి పుస్తకరూపంలో ప్రచురించబడ్డాయి. వైద్యశాస్త్రంలో ఉన్న ఆంగ్ల సాంకేతిక పదాలకు సరియైన తెలుగు పదాలు నిఘంటువులలో లభించనపుడు ఆ పదాలు ఎలా పుట్టాయో ఆంగ్ల నిఘంటువులలో పరిశోధించి వాటికి అనువైన తెలుగు పదాలు సృష్టించుకొన్నాను.వాటిని విక్షనరీలో నిలుపుటకు ప్రయత్నిస్తున్నాను.