Jump to content

వాడుకరి చర్చ:Nsmurty4350

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి
తాజా వ్యాఖ్య: స్వాగతం టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha

నా పేరు నౌడూరి సూర్యనారాయణ మూర్తి. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను.నాకు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో కవిత్వం, కథ చాలా ఇష్టం. 19 ఎంపిక చేసిన తెలుగు కథలను నేనూ, మా మేనమామ దివంగత శ్రీ రావి శ్ర్రీకృష్ణమూర్తి ఆంగ్లంలోకి అనువాదం చేసి THE PALETTE ఆన్న ఆంగ్ల కథా సంకలనాన్ని అచ్చువేశాము. తర్వాత 2000 సంవత్సరానికి కథ-బ్రిటిష్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఆగ్నేయ ఆశియా కథల అనువాద పోటీలో మా ఇద్దరికీ ప్రథమ బహుమతి వచ్చింది. నేను కొత్తగా తెలుసుకున్నాను ఇక్కడ మనము కూడా మార్పులు చేర్పులు చెయ్యవచ్చునని. నావంతు తెలుగుభాషాభివృధ్ధికి కృషి చెయ్యడానికీ, తమిళంలో లాగనే తెలుగులో కూడా లక్షపదాలు మించి ఈ పదకోశం లో ఉండాలనీ అభిలషిస్తున్నాను. మనందరం కలిసి కృషి చేస్తే అది ఏమంత పెద్ద కష్టం కాదు.

స్వాగతం

[<small>మార్చు</small>]

Nsmurty4350 గారూ మీవంటి వారు విక్షనరీ మీద దృష్టి సారించడం విశేషం.మీరు చిప్పింది అక్షరాల నిజం.విక్షనరీ కోసం కలసి పని చేస్తాము.ఏ వైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు. --T.sujatha 16:51, 23 ఏప్రిల్ 2008 (UTC)Reply