Jump to content

విక్షనరీ:గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్

విక్షనరీ నుండి

జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము వెర్షన్ ౨.౦, జూన్ ౧౯౯౧ కాపీరైట్ (c) ౧౯౮౯, ౧౯౯౧ ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్, Inc. ౫౯ టెంపుల్ ప్లేస్ - సూట్ ౩౩౦, బోస్టన్, MA ౦౨౧౧౧-౧౩౦౭, యు ఎస్ ఏ

ఎవరైనను ఈ అనుజ్ఞాపత్రమును మాటకు మాటగా అనుకరణ చేయబడిన ప్రతులను అనుకరించవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు, కానీ ఎట్టి మార్పులూ చేయరాదు.

ఉపోద్ఘాతం

చాలా సాఫ్ట్ వేర్ లైసెన్సులు వాటిని ఇతరులతో పంచుకొనుటకు మరియు మార్పులు చేయుటకు గల స్వేచ్చను మీ నుండి హరించుటకుగాను ఉద్దేశించబడినవి . తత్విరుద్ధంగా, జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము/లైసెన్సు ఉచిత సాఫ్ట్ వేర్ ను ఇతరులతో పంచుకొనుటకు మరియు మార్పులు చేయుటకు గల స్వేచ్చను మీరు పొందుటకు పూర్తి హామీ ఇచ్చుటకుగాను ఉద్దేశించబడినది -- నిస్సందేహంగా వినియోగదారులందరికీ ఉచిత సాఫ్ట్ వేర్. ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారి చాలా సాఫ్ట్ వేర్ కు, మరియు దీనిని వినియోగించుటకు బద్ధులైనటువంటి మూలకర్తలు రూపొందించిన ఏ విధమైన ప్రోగ్రామునకైనను ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు వర్తించును. ( ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారి మరి కొంత సాఫ్ట్ వేర్ కు ప్రత్యామ్నాయంగా జి.ఎన్.యు గ్రంధసంచయ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు వర్తిస్తుంది.) దీన్ని మీ ప్రోగ్రాములకు కూడా మీరు ఉపయోగించవచ్చు.

ఉచిత సాఫ్ట్ వేర్ గూర్చి మాట్లాడునపుడు, మేము స్వేచ్చను ప్రస్తావించుట జరిగినది, దాని ఖరీదు కాదు. మీకు ఉచిత సాఫ్ట్ వేర్ ప్రతులను పంపిణీ చేయు స్వేచ్చను కల్పిస్తూ (మరియు ఈ సేవకు మీ ఇష్టానుసారం ఖరీదు కట్టునట్లూ), మీకు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సోర్స్ కోడ్ (సాంకేతిక మూలం) అందజేయబడునట్లు లేదా మీరు అడిగి పొందునట్లు, మీరు సాఫ్ట్ వేర్ ను మార్చుకొనునట్లు లేదా క్రొన్ని భాగాలను క్రొత్త ప్రోగ్రాములలో వాడుకొనునట్లు; మరియు పైన పేర్కొనబడినటువంటివన్నీ మీరు చేయగలరన్న విశ్వాశం కలుగజేస్తూ ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సులు రూపొందించబడినవి.

మీ హక్కులను కాపాడుటకు, ఇతరులు ఈ హక్కులను మీకు ఇచ్చుటకు నిరాకరించకుండా లేక మీ హక్కులను స్వాధీన పరుచుకోకుండా, మేము కొన్ని నిబంధనలను చేయవలసి వచ్చింది. మీరు సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసినా లేక ప్రతులను పంపిణీ చేసినా, ఈ నిబంధనలు మీకు క్రొన్ని భాధ్యతలుగా అనువదించబడతాయి.

ఉదాహరణకు, ఒక వేళ మీరు అట్టి ప్రోగ్రామ్ ను పంపిణీ చేస్తే, ఉచితంగానైనా లేదా రుసుముకైనా, మీరు స్వీకర్తకు మీకున్న సర్వహక్కులను సంక్రమింపజేయవలెను. స్వీకర్తలకు సంబంధిత సోర్స్ కోడ్ (సాంకేతిక మూలం) అందునట్లు లేదా వారు అడిగి పొందుటకు వీలుగా ఉండునట్లు మీరు జాగ్రత్త వహించవలెను. ఇంకా, వారు తమ హక్కులను తెలుసుకొనుటకు వీలుగా మీరు ఈ నియమావళిని వారికి ప్రదర్శించవలెను.

మేము రెండు విధాలుగా మీ హక్కులను కాపాడటం జరుగుతుంది: (౧) సాఫ్ట్ వేర్ కు కాపీరైట్ కల్పించడం, మరియు (౨) మీకు ఈ లైసెన్సు సమర్పించుట ద్వారా, సాఫ్ట్ వేర్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు/లేక మార్పులు చేయుటకు మిమ్మల్ని చట్టపరంగా అనుమతించడం.

అంతేకాక, మూలకర్తల మరియు మా రక్షణార్దం, ఈ ఉచిత సాఫ్ట్ వేర్ కు ఎటువంటి పూచీ లేదని, కాబట్టి అందరూ దీనిని గ్రహించగలరని ఆశిస్తున్నాము. ఒక వేళ ఎవరైనా సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసి, అట్టి సాఫ్ట్ వేర్ ను వ్యాప్తి చేసిన, స్వీకర్తలు వారి వద్ద ఉన్నది మూలప్రతి కాదని గ్రహించవలెనని మా మనవి, దీనివలన, ఇతరులు స్రుష్టించిన సమస్యల కారణాన మూలకర్త గౌరవానికి ఎటువంటి భంగము కలుగదు.

చివరగా, ఎటువంటి ఉచిత ప్రోగ్రామ్ అయినను నిరంతరం సాఫ్ట్ వేర్ పేటెంట్ల హెచ్చరికలకు లోనవుతుంది. ఉచిత ప్రోగ్రామ్ పునఃపంపిణీదారులు వాటిపై వారి వరి వ్యక్తిగత పేటెంట్లు పొందుట, తద్వారా, వాటిపై సర్వాధికారాలు పొందుట వంటి దుష్పరిణమాలు కలుగకూడదని మేము ఆశిస్తున్నాము. దీన్ని నివారించుటకు, మేము స్పష్టం చేయునది ఏమనగా, ఏవిధమైనటువంటి పేటెంటు లైసెన్సు అయినను అందరి ఉచిత వినియోగానికి ఉపకరించవలెను లేదా ఎట్టి లైసెన్సూ వర్తించదు.

కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు మార్పులు చేయుటకు గల స్పష్టమైన నియమనిబంధనలు క్రింద తెలుపబడినవి.


జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు మార్పులు చేయుటకు గల నియమనిబంధనలు ౦. ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ నందైనను లేక మరే ఇతర రచనలందైనను కాపీరైట్ పొందిన వారిచే ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు నియమాలకనుగుణంగా వాటిని పంపిణీ చేయవచ్చునని తెలియజేసిన యెడల, అట్టి వాటికి ఈ లైసెన్సు అమలు చేయబడుతుంది. కాపీరైట్ చట్టప్రకారం, క్రింద తెలుపబడిన "ప్రోగ్రామ్" అనగా అటువంటి ప్రోగ్రామ్ లేదా రచన, మరియు "ప్రోగ్రామ్ ఆధారిత రచన" అనగా ప్రోగ్రామ్ లేదా ప్రోగ్రామ్ నిష్పన్న రచన: ఇంకా చెప్పదలచిన, ప్రొగ్రామ్ లేక ప్రోగ్రామ్ లోని కొంత భాగము కలిగిన రచన, మాటకు మాటగా లేక మార్పులు చేయబడిన మరియు/లేక వేరొక భషలోనికి అనువదించబడిన రచన. ( ఇకనుండి, "మార్పుగావించుట"లో నిరభ్యంతరముగా "అనువదించుట"ను చేర్చుట జరిగినది.) లైసెన్సు పొందు ప్రతివారినీ "మీరు" అని సంభోధించుట జరిగినది.

కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు మార్పులు చేయుటకు తప్ప ఇతరేతర వినియోగానికి ఈ లైసెన్సు వర్తించదు; అట్టి వినియోగం దీని పరిధిని దాటి ఉన్నవి. ఎటువంటి పరిమితులు లేకుండా ప్రోగ్రామ్ ను అమలు చేయవచ్చు, మరియు ప్రోగ్రామ్ యొక్క ఔట్ పుట్ నందు ప్రోగ్రామ్ ఆధారిత రచనలు ఉన్న యెడల, అట్టి ఔట్ పుట్ కు ఈ లైసెన్సు వర్తిస్తుంది (ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ఎటువంటి సంబంధము లేకుండా). దాని యధార్ధం ఏమిటన్నది, ప్రోగ్రామ్ ఏమి చేస్తుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. `

౧ మీరు అన్ని ప్రతులపై సంబంధిత కాపీరైట్ నోటీసు మరియు పూచీకత్తు యొక్క అవధులు స్పష్టంగా మరియు తగిన విధంగా తెలియజేసిన యెడల, మీకు అందిన ప్రోగ్రామ్ యొక్క సోర్స్ కోడ్ ను, ఎటువంటి మాధ్యమం ద్వారానైనా, మీరు మాటకు మాటగా అనుకరణ చేసి పంపిణీ చెయ్యవచ్చు; ఈ లైసెన్సును ఉదహరింపబడిన అన్ని నోటీసులు ఎట్లున్నవి అట్లే యుండవలయును మరియు పూచీకత్తు లేనియెడల తత్సంబంధిత నోటిసులు ఉండవలెను; మరియు మరే ఇతర ప్రోగ్రామ్ స్వీకర్తలకైనను ప్రోగ్రామ్ తో పాటుగా ఈ లైసెన్సు ప్రతిని అందజేయవలయును.

భౌతికంగా ప్రతిని మీరు అందించుటకు గాను మీరు రుసుము కోరవచ్చు, మరియు మీ ఇచ్చానుసారం మీరు పుచ్చుకొను రుసుముకు బదులుగా పూచీకత్తు బధ్రత కల్పించవచ్చు.

౨. మీరు క్రింద తెలుపబడిని అన్ని షరతులకు లోబడిన, ప్రోగ్రామ్ యొక్క మీ ప్రతికి లేక ప్రతులకు లేదా అందులోని ఏదయినా భాగమునకు మార్పులు చేయవచ్చు, తద్వారా ప్రోగ్రామ్ ఆధారిత రచన రూపొందించవచ్చు , మరియు పైన సెక్షన్ ౧ నందు పేర్కొనబడిన నియమాలననుసరించి మీరు మీ మార్పులను లేక రచనలను అనుకరణ మరియు పంపిణీ చేయవచ్చు :

అ) మార్పులు చేయబడిన ఫైల్సు నందు మీరు మార్పులు చేసినారని తెల్పుతూ మరియు మార్పు గావించబడిన దినము తెలుపుతూ స్పష్టమైన నోటీసులు కలిగి యుండవలెను. ఆ) మీరు పంపిణీ చేయు లేదా ప్రకటించు ఏ విధమైనటువంటి రచనలకైనను, పూర్తిగా లేక నిర్ణీత భాగాలకు లేక ప్రోగ్రామ్ ఆధారితం లేక అట్టి ఏ విధమైన భాగమునకైనను, త్రుతీయ పార్టీలకు ఈ లైసెన్సు నియమాలకు అనుగుణంగా ఎట్టి రుసుము వసూలు చేయక పూర్తి లైసెన్సు జారీ చేయవలెను. ఇ) మార్పులు చేయబడిన ప్రోగ్రామ్ ను అమలు చేసిన,సాధారణంగా ఆఙ్ఞలను ఇంటరేక్టివ్ గా స్వీకరించినచో మీరు దాన్ని గూర్చి ప్రస్తావించవలెను,అటువంటి ఇంటరేక్టివ్ వినియోగానికి అతి సాధారణ పద్దతిలో ప్రోగ్రామ్ ను అమలు పరచిన, సంబంధిత కాపీరైట్ నోటీసు మరియు పూచీకత్తు లేదని తెలుపు నోటీసు(లేదా, పూచీకత్తు వర్తించునని తెలుపుతూ) కలిగిన ప్రకటన ముద్రించవలెను లేక ప్రదర్శించవలెను మరియు వినియోగదారులు ప్రోగ్రామ్ ను ఈ షరతులకనుగుణంగా పునఃపంపిణీ చేయవచ్చునని, మరియు ఈ లైసెన్సు యొక్క ప్రతిని ఎట్లు చూడవలెనో వినియోగదారునకు తెలుపవలెను. (మినహాయింపు: ఒకవేళ ప్రోగ్రామే ఇంటరేక్టివ్ గా వుండి, ఇటువంటి ప్రకటన సాధారంణంగా ముద్రించని యెడల, అట్టి ప్రోగ్రామ్ ఆధారిత మీ రచన ఎటువంటి ప్రకటన ముద్రించవలసిన అవసరం లేదు.) ఈ అవసరాలు అన్నీ కూడా మార్పులు చేయబడిన రచనలకు మొత్తంగా వినియోగించవలెను. ఒకవేళ అట్టి రచనలందు గుర్తించదగిన భాగాలు ప్రోగ్రామ్ నుండి నిష్పన్నం కాని యెడల, మరియు వాటిని సహేతుకంగా వివిధ స్వతంత్ర రచనలుగా పరిగణించ దగిన యెడల, ఈ లైసెన్సు మరియు దాని నియమాలు అట్టి విభిన్న స్వతంత్ర్య రచనలకు వర్తించవు. అట్లు కాక, మీరు అవే భాగాలను ప్రొగ్రామ్ ఆధారిత రచనతో పాటుగా పంపిణీ చేసిన యెడల, అట్టి పంపిణీ ఈ లైసెన్సు నియమాలకు లోబడి ఉండవలెను, లైసెన్సు పొందిన అందరికీ ఒకే విధంగా అనుమతులు విస్తరించుట జరుగుతుంది, మరియు ఎవరు వ్రాశారు అన్న దానికి సంబంధము లేకుండా ప్రతీ భాగానికి ఈ లైసెన్సు నియమాలు వర్తించును.

కావున, ఈ భాగము యొక్క ముఖ్యోద్ధేశం, ప్రోగ్రామ్ యొక్క నిష్పన్న లేదా సమిష్టి రచనల పంపిణీ వ్యవస్థను నియంత్రించు హక్కును వినియోగించుటయే తప్ప మీ సమస్త రచనలపై మీ హక్కులతో పోటీ పడుటకు లేక వాటిపై మీకున్న హక్కులను ఆశించి, వాదించుటకు కాదు.

అంతే గాక, కేవలం ఒక స్టోరేజి వాల్యూమ్ నందు గాని లేక పంపిణీ మాధ్యమంనందు గాని, ప్రోగ్రామ్ ఆధారితం కాని రచనను ప్రోగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన)కు జతచేసిన యెడల, అటువంటి ఇతర రచనలు ఈ లైసెన్సు పరిధిలోకి తీసుకురావటం సాధ్యపడదు.

౩. వీటికి తోడుగా, మీరు ఈ క్రింద తెలుపబడిన వాటిలో ఏదేని చేసిన యెడల, మీరు ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో ఉన్న ప్రోగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన, సెక్షన్ ౨ నందు వలె)ను సెక్షన్లు ౧ మరియు ౨ నందలి నియమాల ననుసరించి కాపీ చేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు:

అ) దానికి అనుబంధంగా, పూర్తి సంబంధిత మెషీన్-రీడబుల్ సోర్స్ కోడ్(యంత్ర పఠనయోగ్యమైన సాంకేతిక మూలం), పైన తెలిపిన ౧ మరియు ౨ సెక్షన్ల నియమాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ మార్పిడికి యోగ్యమైన మాధ్యమం పై పంపిణీ చేయవలెను; లేదా, ఆ) దానికి అనుబంధంగా, త్రుతీయ పార్టీకి మీరు సోర్స్ ను భౌతికంగా పంపిణీ చేయుటకు మీకు అయిన ఖర్చును అధిగమించకుండా కొంత రుసుముకు , కనీసం మూడు సంవత్సరాలు చెల్లు వ్రాతపూర్వక నివేదికతో, సోర్స్ కోడ్ సంబంధిత పూర్తి మెషీన్-రీడబుల్ ప్రతి, పైన తెలిపిన ౧ మరియు ౨ సెక్షన్ల నియమాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ మార్పిడికి యోగ్యమైన మాధ్యమం పై పంపిణీ చేయవలెను; లేదా, ఇ) దానికి అనుబంధంగా, మీరు పొందిన సంబంధిత సోర్స్ కోడ్ ను పంపిణీ చేయుటకు సంబంధించి మీకు లభించిన సమాచారం అందించవలెను. (ఈ ప్రత్యామ్నాయం, కేవలం వాణిజ్యపరంగా లాభాపేక్షలేని పంపిణీకీ మాత్రమే వర్తించును మరియు మీరు ప్రోగ్రామ్ ను ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో, పైన పేర్కొనబడిన "ఆ" అనుభాగమునకు లోబడినటువంటి అవకాశం ద్వారా పొందియుండవలెను.)

రచన యొక్క సోర్స్ కోడ్ అనగా, మార్పులు చేయుటకు అనుగుణంగా ఉన్న రచన. ఎక్సిక్యూటబుల్ రచన యొక్క పూర్తి సోర్స్ కోడ్ అనగా అందులో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ యొక్క సోర్స్ కోడ్,మరియు సంబంధిత ఇంటర్ఫేస్ నిర్వచన ఫైల్సు,మరియు ఎక్సిక్యూటబుల్ యొక్క కంపైలేషన్ మరియు ఇన్స్టల్లేషన్ ప్రక్రియలను నియంత్రించుటకు వాడు స్క్రిప్టులు. ఐతే, ప్రత్యేక మినహాయింపుగా, పంపిణీ చేయబడు సోర్స్ కోడ్ నందు, ఎక్సిక్యూటబుల్ అమలు చేయదగిన ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు సాధారణంగా పంపిణీ చేయబడు(సోర్స్ లేదా బైనరీ రూపంలో) ప్రముఖ భాగాలు(కంపైలర్, కర్నెల్ మరియు ఇతరత్రా) ఉండవలసిన అవసరం లేదు. అట్లుగాక, ఎక్సిక్యూటబుల్ అట్టి ప్రముఖ భాగాలతో అవిభిజాత్యంగా ఉన్నచో, అట్టి భాగాలు సోర్స్ కోడ్ పంపిణీలో ఉండవలెను.

ఎక్సిక్యూటబుల్ లేక ఆబ్జక్ట్ కోడ్ ను నిర్దేశిత ప్రదేశము నుండి అనుకరణ చేయుటకుగాను అనుమతిస్తూ పంపిణీ జరిపినచో,మరియు అట్లే అదే ప్రదేశము నుండి సోర్స్ కోడ్ ను అనుకరణ చేయుటకు కూడా సమానంగా అనుమతించినచో, అట్టి చర్య, త్రుతీయ పార్టీలను ఆబ్జక్ట్ కోడ్ తో కూడిన సోర్స్ ను అనుకరించుటకు నిర్బంధించకుండిననూ, సోర్స్ కోడ్ పంపిణీగా పరిగణించ బడుతుంది

౪. ఈ లైసెన్సు నందు తెలుపబడినదానికి విరుద్ధంగా మీరు ప్రోగ్రామ్ ను కాపీ చేయుట, మార్పులు చేయుట, సబ్ లైసెన్స్ ఇచ్చుట లేక పంపిణీ చేయుట మొదలగునవి చేయరాదు. అట్లు గాక మరే విధంగానైనను ప్రోగ్రామ్ ను కాపీ చేయుట, మార్పులు చేయుట, సబ్ లైసెన్స్ ఇచ్చుట లేక పంపిణీ చేయుట మొదలగునవి చేసినచో, అట్టి ప్రయత్నములేవీ చెల్లవు, మరియు ఈ లైసెన్సు ద్వారా మీకు సంక్రమించిన హక్కులు వర్తింపజాలవు. ఐనను, ఈ లైసెన్సు ననుసరించి మీ నుండి ప్రతులను లేదా హక్కులను పొందిన పర్టీల లైసెన్సు మాత్రము వారు లోబడివున్నంత వరకు చెల్లును.

౫. మీరు సంతకం చేయనందున, మీరు ఈ లైసెన్సుకు అంగీకరించవలసిన అవసరం లేదు. ఐనప్పట్టికీ, మీకు ప్రోగ్రామ్ లేక దాని నిష్పన్న రచనలను మార్పు చేయుటకు లేదా పంపిణీ చేయుటకు మరే ఇతరములు మిమ్మల్ని అనుమతింప జాలవు. మీరు ఈ లైసెన్సుకు అంగీకరించని యెడల ఇట్టి చర్యలు చట్టప్రకారం నిషేధించబడినవి. కాబట్టి, మీరు ప్రోగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన)ను మార్చుట ద్వారా లేదా పంపిణీ చేయుట ద్వారా మీరు ఈ లైసెన్సుకు, మరియు ప్రోగ్రామ్ ను లేక ఆధారిత రచనలను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు లేక మార్పులు చేయుటకు గల నియమాలకు మరియు షరతులకు అంగీకరించినట్లే.

౬. మీరు ప్రొగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన)ను పునఃపంపిణి చేసిన ప్రతిసారీ, అవ్యక్తంగా స్వీకర్త ప్రాధమిక లైసెన్సార్ నుండి సూచించబడిన నియమాలకు మరియు షరతులకు అనుగుణంగా ప్రోగ్రామ్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు లేక మార్పులు చేయుటకు గల లైసెన్సు పొందును. ఇందు ఆమోదించబడిన హక్కులకు సంబంధించి స్వీకర్తల వినియోగానికి మీరు ఎట్టి పరిమితులు విధింపలేరు. ఈ లైసెన్సుకు త్రుతీయ పార్టీల విధేయతను నిర్భంధించుటకు మీరు భాధ్యులు కారు.

౭. ఒకవేళ, న్యాయస్థనం తీర్పు వల్ల గానీ లేక పేటెంటు ఉల్లంఘన వల్ల గానీ లేక మరే ఇతర కారణము(పేటెంటు వివాదాలకే పరిమితము కాదు) చేత గానీ, ఈ లైసెన్సు యొక్క నిబంధనలకు విరుద్ధముగా మీపై షరతులు(న్యయస్థానం ఆజ్ఞమేరకు లేక ఒప్పందం మేరకు లేక మరే కారణము చేతనైనను) విధింపబడిననూ, మీరు ఈ లైసెన్సు షరతులనుండి విముక్తులు కాజాలరు. పంపిణీ చేయుటకు ఈ లైసెన్సు నందలి మీ భాధ్యతలు మరియు మరే ఇతర సంబంధిత భధ్యతలు ఏక కాలంలో మీరు ఆచరించలేనిచో, మీరు ప్రోగ్రామ్ ను పంపిణీ చేయుట అసాధ్యము. ఉదాహరణకు, మీద్వారా ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ ప్రతులను పొందిన వారందరికీ, ఏదేని పేటెంటు లైసెన్సు ప్రోగ్రామ్ ను రాయల్టీ-ఫ్రీ పునఃపంపిణీ చేయుటకు అనుమతించని యెడల, అట్టి లైసెన్సును మరియు ఈ లైసెన్సును ఏక కాలంలో మీరు ఆచరించ దలచిన,మీరు ప్రోగ్రామ్ యొక్క పంపిణీ నిలిపివేయవలెను.

ఈ విభాగము నందలి ఏదేని భాగము, ఏదైనా ప్రత్యేక సందర్భములో చెల్లకుండిన లేక విధింపలేకుండిన, ఈ విభాగము యొక్క సమతుల్యమును వర్తింపజేయవలెను, మరియు మరే ఇతర సందర్భములయందును ఈ విభాగమును సంపూర్ణముగా వర్తింపజేయవలయును.

ఏదేని పేటెంట్లను లేక మరే ఇతర ఆస్తి హక్కు అధికారాలను ఉల్లంఘించుటకు లేక అట్టి ఆరోపణల చట్టబద్ధతను ప్రశ్నించుటకు మిమ్మల్ని ప్రేరేపించుటకు ఈ విభాగము ఉద్ధేశించబడలేదు; సార్వజనిక లైసెన్సు పద్దతుల ద్వారా అమలు చేయబడు ఉచిత సాఫ్ట్ వేర్ పంపిణీ వ్యవస్థ యొక్క ఏకత్వాన్ని కాపాడుటయే ఈ విభాగము యొక్క ఏకైక ముఖ్యోద్ధేశం. ఏకరీతిగా అనుష్ఠింపబడుతున్న అట్టి వ్యవస్థ మీద ఉన్న నమ్మకముతో, ఎందరో వ్యక్తులు ఉదారతతో, ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ ను పంపిణి చేయుటకు ఇచ్చి సహకరించుట జరిగినది ; సాఫ్ట్ వేర్ ను వేరొక వ్యవస్థ ద్వారా పంపిణి చేయవలెనా లేదా అనునది కేవలం మూలకర్త/దాత ఇష్టతపై ఆధారపడి ఉంటుంది మరియు ఎంచు విషయంలో లైసెన్సీ ప్రభావము ఏమాత్రమూ ఉండబోదు.

మిగతా లైసెన్సు యొక్క పరిణామం ఏమిటన్నిది స్పష్టంగా తెలియ పరచడమే ఈ విభాగము యొక్క ముఖ్యోద్ధేశం.

౮. పేటెంట్ల వల్ల గానీ లేక ఇంటర్ ఫేస్ ల కాపీరైట్ల వల్ల కానీ ప్రొగ్రామ్ యొక్క వాడకము మరియు/లేక పంపిణీ ఏదేని దేశాలలో నిషేధింపబడిన యెడల, ప్రోగ్రామ్ కు ఈ లైసెన్సు వర్తింపజేయు ప్రాధమిక కాపీరైట్ హక్కుదారు, అటువంటి దేశాలను బహిష్కరిస్తూ నిశ్చిత భౌగోళిక పంపిణీ పరిమితిని చేర్చిన, తదనుగుణంగా భహిష్కరించబడని దేశాల నందు మాత్రమే పంపిణీ చేయుటకు అనుమతించుట జరుగుతుంది. అటువంటి సందర్భములో, పరిమితి లైసెన్సు నందు వ్రాతపూర్వకముగా సూచింపబడినట్లే పరిగణింపబడుతుంది.

౯. సమయానుకూలంగా సరిచేయబడిన లేక క్రొత్త సార్వత్రిక సార్వజనిక లైసెన్సు ప్రతిని ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ ప్రచురించుట జరుగుతుంది.అట్టి క్రొత్త ప్రతి ప్రస్తుత ప్రతి యొక్క భావనకు సమానంగా ఉండును, కాకపోతే క్రొత్త సమస్యలను లేక క్రొత్త విషయాలను ప్రస్తావించుటలో మార్పు ఉండును.

ప్రతీ వెర్షన్ కు గుర్తించుటకు వీలుగా ఒక వెర్షన్ నంబరు ఈయబడుతుంది. ప్రోగ్రామ్ కు వర్తించు ప్రస్తుత మరియు ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ నంబరును తెలియజేసినచో, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురించబడిన అట్టి లైసెన్సు వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని లేక ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని మీ ఇష్టానుసారం పాటించవచ్చును. లైసెన్సు యొక్క వెర్షన్ నంబరును ప్రోగ్రామ్ సూచింపకున్న, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురింపబడిన ఏదేని వెర్షన్ ను మీరు ఎంచుకొనవచ్చును.

౧౦. ప్రోగ్రామ్ యొక్క భాగాలను మీరు భిన్నమైన షరతులు ఉన్న ఇతర ఉచిత ప్రోగ్రాములందు చేర్చ దలచిన, అందుకు అనుమతి కోరుతూ మూలకర్తకు మీ విజ్ఞాపన వ్రాయవలెను . ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారు కాపీరైట్ పొందబడిన సాఫ్ట్ వేర్ కొరకు, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారికి మీ విజ్ఞాపన వ్రాయవలెను ; ఇందుకు కొన్ని సందర్భాలలో మేము మినహాయింపులిచ్చుట జరుగుతుంది. మా ఉచిత సాఫ్ట్ వేర్ యొక్క నిష్పన్నాల స్వతంత్ర్యత్వాన్ని కాపాడుట,మరియు సాధారణంగా సాఫ్ట్ వేర్ యొక్క ఉమ్మడి వాడకమును మరియు పునఃవినియోగమును వ్రుద్ధి చేయుట, అను రెండు లక్ష్యాలను ద్రుష్టిలో ఉంచుకొని , మా తీర్పును నిర్దేశించుట జరుగుతుంది.


పూచీకత్తు లేదు ౧౧. ప్రోగ్రామ్ లైసెన్సును ఎట్టి రుసుమూ లేకుండా ఉచితముగా ఇచ్చు కారణాన, సంబంధిత చట్టం అనుమతించినంత మేర, ప్రోగ్రామునకు ఎట్టి పూచీకత్తూ వర్తించదు. అన్యధా వ్రాతపూర్వకముగా తెలియజేసినప్పుడు మినహా, కాపీరైట్ హక్కుదారు మరియు/లేక ఇతర పార్టీలు, బహిరంగంగా కానీ లేక సూచనగా కానీ తెలుపబడినట్లూ, వ్యాపారానుకూలతను మరియు ప్రత్యేక ప్రయోజనా యోగ్యతను సూచించు పూచీకత్తులతో సహా తెలుపబడిన పూచీకత్తులకు మాత్రమే పరిమితము గాకుండనట్లూ, ప్రోగ్రామ్ ను "యధావిధిగా" ఏ విధమైనటువంటి పూచీకత్తూ లేకుండా అందజేయుట జరుగుతుంది. ప్రోగ్రామ్ యొక్క శ్రేష్ఠత మరియు నిర్వహణకు సంబంధించి పూర్తి సాహసము మీదే. లోపాయకారీ ప్రోగ్రామ్ అని తేలినచో, అందుకు పూర్తి సంరక్షణ వ్యయం, పునరుద్ధరణ వ్యయం లేక సవరణ వ్యయం మీరే భరింపవలెను.

౧౨. ఏది ఏమైనను, సంబంధిత చట్టం ఆదేశం మేరకు లేక వ్రాతపూర్వక ఒప్పందం మేరకు తప్పించి,పైన పేర్కొనబడినట్లు ప్రోగ్రామ్ ను మార్చుటకు మరియు/లేక పునఃపంపిణీ చేయుటకు అనుమతింపబడిన కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ గానీ, మీరు ప్రోగ్రామ్ ను వాడుటవలన గానీ లేక ప్రోగ్రామ్ యొక్క అశక్త వాడకం వలన గానీ( సమాచారం కోల్పోవుట లేక సమాచారాన్ని సరిగా చూపకుండుట లేక మీ వల్ల కానీ లేదా త్రుతీయ పార్టీ వల్ల కానీ భరింపబడు నష్టాల చేత లేక మరే ఇతర ప్రోగ్రాములతో ఈ ప్రోగ్రామ్ పనిచేయకుండుట) మీకు సంభవించిన సామాన్య, ప్రత్యేక, ఆకస్మిక లేక పర్యవసాన నష్టాలతో కూడిన ఏ విధమైనటువంటి నష్టాలకూ, అట్టి నష్టాలను గూర్చి వారి(కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ)కి ముందుగానే సూచనలు చేసిననూ, వారు మీ నష్టాలకు భాధ్యులు కారు.

నియమనిబంధనలు ముగిసినవి