విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము A3

విక్షనరీ నుండి

Act, n. s. క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. a noble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము. an * of parliament or government చట్టము. the * of God or the king దైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. I caught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.

Acting, adj. బదులుగా పని చేస్తూవుండే. the * judge ఒకరి బదులుగా పని చూస్తూవుండే న్యాయాధిపతి.

Acting, n. s. ఆట, నాట్యము, నర్తనము.

Action, n. s. క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch are not in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము, పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీద వ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morning and one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicine మందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talking మాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exact perfection they have brought The action Love : the passion is forgot. " మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమును విడిచిపెట్టినాడు.

Actionable, adj. శిక్షవచ్చే, దండన వచ్చే. Opening another man's letter is * ఒకరి జాబును విచ్చితే శిక్ష కలుగును.

Active, adj. క్రియగల, చలనముగల, చురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horse చురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horse చురుకైన గుర్రము. or busy పాటుపడే an * man చురుకుమనిషి, పాటుపడేవాడు. The volcano is not now * ఆ అగ్నిపురము యిప్పుడు మండలేదు. In grammar సకర్మకమైన. an * verb సకర్మక క్రియ. an * disease త్వరలో మనిషిని చంపే రోగము. charity is an * virtue : endurance and temperance are passive virtues ధర్మము ఆచరణ రూపమైన గుణము, సహనమున్ను మితమున్ను అనుభవరూపమైన గుణములు.

Actively, adv. చురుకుగా.

Activity, n. s. చురుకు, జాగ్రత. the * of fever or of a medicine వేగము. The fire is not in a state of * నిప్పు మండలేదు.

Actor, n. s. చేసేవాడు. a stage player నటి, ఆడేవాడు, వేషగాడు. We were actors in this business, and you were only spectators యీ పనిని చేసిన వాండ్లు మేము వూరికే చూచిన వాండ్లు మీరు.

Actress, n. s. ఆటకత్తె , వేషకత్తె.

Actual, adj. నిజమైన, వాస్తవ్యమైన, యధార్థమైన, ప్రత్యక్షమైన. or present తాత్కాలికమైన, ప్రస్తుతమైన. this is * murder యిది సాక్షాత్తు ఖూనిపని. this is * injustice యిది ప్రత్యక్షమైన అన్యాయము. the * holder of the land ప్రస్తుతము .ఆ భూమిని అనుభవించేవాడు. the * cautery రక్ష, వాత.

Actually, adv. నిజముగా, వాస్తవ్యముగా, యధార్థముగా, ప్రత్యక్షముగా.

Actuary, n. s. or Accountant లెక్కలు తీర్పుచేసేవాడు.

To Actuate, v. a. ప్రేరేపించుట. this actuated him to found a school వాడు పల్లెకూటము పెట్టడానకు యిది ప్రేరేపకమైనది.

Actuated, adj. ప్రేరేపించబడ్డ. In doing this he was * by friendship స్నేహితమునుబట్టి దీన్ని చేసినాడు. * by terror భయమునుపట్టి. * by love for her దానియందు వ్యామోహముచేత.

Acumen, n. s. సూక్ష్మబుద్ధి, కుశాగ్రబుద్ధి.

Acute, adj. క్రూరమైన, తీక్ష్ణమైన, చురుకైన. an * lawyer తీక్ష్ణబుద్ధిగలవకీలు. * pain పోటుబుద్ధిగలవకీలు. * pain పోటు, సళుపు. an * disease త్వరలో చంపేరోగము, తక్షణము చంపే రోగము. * intellect తీక్ష్ణబుద్ధి. the * accent ఉదాత్త స్వరము. an * angle అంతర్లంబకాస్రము.

Acutely, adv. కూరుగా, తీక్ష్ణముగా, సూక్ష్మముగా.

Acuteness, n. s. కూరు, తీక్ష్ణత, చురుకు.

Adage, n. s. వాడుకగా అనేమాట, సామిత. there is an * that "doctors differ " వైద్యులు తలా వక మాట అంటారనడము వాడుకగా అనే మాటేగదా.

Adagio, n. s. in music విళంబితము.

Adam, n. s. అదిమపురుషుని నామము. the sons of * * నరులు.

Adamant, n. s. వజ్రము, రవ, హీరము.

Adamantine, adj. అతికఠినమైన. a man of * constitution వజ్రదేహి.

To Adapt, v. a. పొసగించుట, సరిపరచుట. he adapted his speech to their minds వాండ్ల మనస్సుకు తగినట్టు మాట్లాడినాడు.

Adaptation, n. s. సరిపరచడము, పొసగించడము, పొందిక, యిమిడిక.

Adapted, adj. తగిన, ఉపయుక్తమైన, యోగ్యమైన. this is * to many purposes యిది బహు పనులకు వుపయుక్తమైనది.

To Add, v. a. చేర్చుట, కూర్చుట. he added that they will come tomorrow వాడు మరిన్ని చెప్పినదేమంటే వాండ్లు రేపు వత్తురు. he added that he was astonished at this వాడు మరిన్ని చెప్పినదేమంటే, అందుకు తనకు ఆశ్చర్యమైనది. he added up the figures లెక్కకూర్చినాడు, వెరశివేసినాడు. Add to this, or besides all this యింతేకాకుండా.

Adder, n. s. కట్లపాము. Deaf * మంత్రానికి లోబడని కట్లపాము, మాట వినని మూఖు ్డు.

To Addict, v. a. అలవరచుట, మరుపుట. he addicted himself to drinking, or to the bottle తాగ మరిగినాడు.to drinking, or to the bottle తాగ మరిగినాడు. they are addicted to stealing దొంగిలించ మరిగినారు. One who is addicted to women స్త్రీలోలుడు.

Addictedness, n. s. దురాశ, లోలత్వము.

Addition, n. s. కూర్చడము, చేర్చడము, వృద్ధి. In Arithmetic గుణకారము. he had an * to his family yesterday నిన్న వాడికి బిడ్డ పుట్టింది. In * to his former statement వాడు మునుపు చెప్పినది కాకుండా.

Additional, adj. అధికమైన, ఎక్కువైన. * expenses అధికవ్యయములు. * servants అధిక పనివాండ్లు.

Addle, adj. అవిసిపోయిన, నిస్సారమైన, కలవరమైన. an * egg అవిసిపోయిన గుడ్డు. an * pated or * headed fellow కలవరపు మనిషి, పిచ్చివాడు.

Addled, adj. See Addle.

To Address, v. a. to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్ని గురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but I took care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలు చెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abuse without addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగా తిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపు మాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధన చేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరట వ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. the beggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. the priest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచి ప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానా సేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * her song యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకు అర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him and asked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయము చేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross the river యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; or he did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. this book is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము. All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.

Address, n. s. a petition మనివి, అర్జి. or speech ప్రసంగము, సంభాషణ. direction పై విలాసము. title వక్కణ, బిరుదావళి. skill నిపుణత. Mode of behaviour మర్యాద, రసము. a man of good * సరసముగా, లేక, ఘనముగా మాట్లాడేవాడు. a man of mean * జబ్బురసముగా మాట్లాడేవాడు. he paid his addresses to her తన్ను పెండ్లి చేసుకొమ్మని దాన్ని ఉపసర్పించినాడు.

To Adduce, v. a. ఉదాహరించుట, తెచ్చుట. he adduced ten authorities for this word యీ మాటకు పది ఉదాహరణములు తెచ్చినాడు. Can you * one proof of this యిందుకు ఒక రుజువు యివ్వగలవా.


Adept, n. s. ప్రవీణుడు, నిపుణుడు, సమర్థుడు, జితపడ్డవాడు. he is an * in arithmetic లెక్కలో పూర్ణుడు.

Adequate, adj. తగిన, యోగ్యమైన, సరియైన.

Adequately, adv. తగినట్టుగా.

To Adhere, v. n. అంటుకొనుట, అనువర్తించి వుండుట. the paint adheres to the skin ఆవణ ్ము చర్మములో అంటుకొంటుంది. they adhered to him through all his troubles వాడికి వచ్చిన పాట్లకంత వాణ్ని కరుచుకొనే వుండిరి. he adhered to the rule చట్టమును అనుసరించినాడు.

Adherence, n. s. అంటుకొని వుండడము, అనువర్తనము. or fixedness పట్టు. By the * of the skin to the flesh తోలు మాంసమును అంటుకొని వుండడమువల్ల. this shews their * to the law యిందువల్ల ఆ చట్టము మీద వాండ్లకు వుండే పట్టు తెలుస్తుంది. his * to the truth saved him వాడు నిజమును అవలంబించడము వాణ్ని కాపాడింది.

Adherent, n. s. అనుసరించినవాడు, అవలంబించినవాడు, ఆశ్రితుడు. he and his adherents వాడున్ను వాడితో చేరిన వాండ్లున్ను.

Adhering, adj. అంట్లుకొన్న, చేరిన, అనుసరించిన, ఆశ్రయించిన.

Adhesion, n. s. అంటుకోవడము, కరుచుకోవడము, బంధన the water destroyed the * of the gum నీళ్ళచేత ఆ బంక యొక్క బంధన పోయినది.

Adhesive, adj. అంటుకొనే, కర్చుకొనే బంధనగల. * plaister కర్చుకొని వుండే ప్లాస్తిరి. glue is * వజ్రము బంధన గలది, కర్చుకొనేటిది.

Adieu, n. s. దండము, దీవన, సలాము, ఒకరిని ఒకరు యెడబాసేటప్పుడు శెలవు తీసుకొని పొయ్యేవాడు, శెలవు యిచ్చి పంపించేవాడు యిద్దరున్ను చెప్పేమాట. he bade them * శెలవు పుచ్చుకొన్నాడు, శెలవు యిచ్చి పంపినాడు, పోయి వస్తా నన్నాడు, పోయిరా అన్నాడు. I bade * to these hopes నేను యీ ఆశను విడిచిపెట్టినాను. he bade * to the world సన్యసించినాడు. the same as good bye or farewell అనే మాటలకు సమానము. he uttered his last * చచ్చినాడు.

Adjacency, n. s. సమీపత్వము.

Adjacent, adj. సమీపమైన, దగ్గిరి.


Adjective, n. s. విశేషణము.

To Adjoin, v. n. చేరివుండుట, యిరుగు పొరుగుగా వుండుట. his ground adjoins to mine వాడి నేల నా నేలకు చేరికగా వున్నది.

Adjoining, adj. చేరికగావుండే. In the * house పొరుగింటిలో, పక్క యింటిలో.

To Adjourn, v. a. మరి ఒక వేళ జరిగిస్తామని తత్కాలానికి నిలుపుట, నిలిపిపెట్టుట. they adjourned from the house to the market ఆ యింట్లో చాలించి అంగట్లో పోయికూర్చుని జరిగించినారు. this debate was adjourned to the next day యీ ప్రసంగమును మరునాడు జరిగిస్తామని నాటి దినానికి నిలిపినారు.

Adjournment, n. s. మరిఒకవేళ జరిగిస్తామని తత్కాలానికి నిలిపిపెట్టడము.

To Adjudge, v. a. తీర్పుచేసుట, తీర్పు యిచ్చుట, విధించుట. they adjudged him this punishment వాడికి యీ శిక్ష విధించినారు.

To Adjudicate, v. a. తీర్పుచేసుట, తీర్పు యిచ్చుట, విధించుట.

Adjudication, n. s. తీర్పు చేయడము, తీర్పు యివ్వడము, విధించడము.

Adjunct, n. s. సంయోగించివుండేటిది, చేరివుండేటిది.

Adjuration, n. s. ఒట్టుపెట్టడము, అనబెట్టడము, ఒట్టు, ఆన.

To Adjure, v. a. ఒట్టు పెట్టుట, ఆనబెట్టుట. he adjured me to do this నీవు యిట్లా చేయకపోతే నీకు వొట్టు అన్నాడు.

To Adjust, v. a. దిద్దుట, సవరించుట, క్రమముగా పెట్టుట.

Adjusted, adj. దిద్దిన, సవరించిన, క్రమపరచిన.

Adjustment, n. s. దిద్దుబాటు, సవరింపు.

Adjutancy, n. s. అజిట ్ వుద్యోగము .

Adjutant, n. s. దండులో అజిటననే వొక దొర. A sort of Crane బెగ్గురు అనే పెద్ద కొంగ.

Admeasurement, n. s. కొలత.

To Administer, v. a. యిచ్చుట, చెల్లించుట, జరిగించుట. he administered the government ప్రభుత్వమును చెల్లించినాడు. to * an oath ప్రమాణము చేయించుట. they administered punishment శిక్షచేసినారు. to * medicine మందు యిచ్చుట. to * consolation వోదార్చుట. to * justice న్యాయమును నడిపించుట. he administered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.

Administration, n. s. జరిగించడము, చెల్లించడము, విచారణ. * of government ప్రభుత్వమును జరిగించడము. During his * అతని మంత్రిత్వములో. * of justice న్యాయ విచారణ. Letter or power of * చచ్చినవాని ఆస్తిని గురించి న్యాయసభవారి ద్వారా వచ్చిన అధికార పత్రిక.

Administrator, n. s. చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారము తీసుకొన్నవాడు, విచారణకర్త.

Administratorship, n. s. చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో తీసుకొన్న అధికారము.

Administratrix, n. s. చచ్చిన వారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారమును తీసుకొన్న స్త్రీ.

Admirable, adj. అద్భుతమైన, ఘనమైన, ఉత్తమమైన.

Admirable, interj. భళి భళీ, శాబాష్.

Admirably, adv. అద్భుతముగా, దివ్యముగా, ఘనముగా.

Admiral, n. s. యుద్ధవాడలకు అధిపతి. * of the Red, * of the White, * of the Blue, Rear * యీనాలుగున్ను ధ్వజపటము యొక్క వర ్ భేదము చేత కలిగిన ఆధిపత్యము యొక్క భేదములు.

Admiralty, n. s. వాడలో జరిగే కొట్టుతిట్లు మొదలయ్ని వ్యాజ్యములు తీర్చే న్యాయసభ.

Admiration, n. s. అద్భుతము, ఆశ్చర్యము.

To Admire, v. a. ఆశ్చర్యపడుట.

Admirer, n. s. మెచ్చుకొనేవాడు. he is an * of hers దాన్ని మోహించినవాడు.

Admiringly, adv. ఆశ్చర్యపడి, మోహించి.

Admissibility, n. s. అంగీకారయోగ్యత. he proved the * of these accounts యీ లెక్కల యొక్క అంగీకారతను రుజువు చేసినాడు.

Admissible, adj. అంగీకరించ యోగ్యమైన.

Admission, n. s. ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకు శెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత. Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, he could not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు. the water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది, వురిసినది. they refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. or confession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీ తప్పులను వొప్పుకున్నందు మీదట.

To Admit, v. a. చేరనిచ్చుట, లోనికి రానిచ్చుట, అంగీకరించుట, ప్రవేశపెట్టుట. this hole would not * my hand యీ రంధ్రములో నా చెయ్యిపట్టదు. I admitted him into my house వాణ్ని నా యింటిలోకి రానిస్తిని. I * that he is your son but you had no authority to do this వాడు నీ కొడుకైనది సరే అయినప్పటికిన్నీ నీవు దీన్ని చేయడానికి అధికారము లేదు. the roof admits water యింటికప్పులోనుంచి నీళ్లు లోనికి దిగుతుంది. the boat admits water ఆ పడవలోకి నీళ్లు యెక్కుతుంది. the curtain admits mosquitos ఆ తెర గుండా దోమలు లోనికి వస్తవి. he admitted a scholar ఒక పిల్లకాయను చేర్చుకొన్నాడు. Justice will not admit of this యిది న్యాయానికి వొప్పదు. the time will not * of this యిందుకు ఆ కాలము చాలదు. this admits of no excuse యిందుకు సాకు పనికిరాదు. this admits of suspicion యిందుకు అనుమానము తట్టుతుంది. this admits of hope యిందుకు ఆశ కద్దు. this cannot be admitted యిది కారాదు, యిది కూడదు. Admitting for argument's sake that what you said was correct, still you had no authority to punish her నీవు చెప్పినది న్యాయమని పెట్టుకున్నప్పటికిన్ని దాన్ని దండించడానకు నీకు అధికారము లేదు. Admitting that you wanted the house, was that any reason for your taking it by force ? ఆ యిల్లు నీకు యెంత కావలసి వుండినా సరే, నీవు బలాత్కారముగా దాన్ని తీసుకోవడానకు అది ఒక కారణమౌనా. Admitting that he had no right to beat his wife, still you have no business to interefere వాడి పెండ్లాన్ని వాడు కొట్టడానికి స్వతంత్రము లేదనే పెట్టుకొన్నప్పటికిన్ని నీవు ఆ జోలికి పోవడానికి నిమిత్తము లేదు.

Admittance, n. s. లోనికి రానివ్వడము, లోనికిరావడానికి శెలవు, ప్రవేశము. I cannot get * to him; or, into his presence అతని వద్ద నాకు ప్రవేశము చిక్కలేదు, అనగా, అతని వద్దకి పోగూడలేదు.

Admitted, adj. చేర్చుకోబడ్డ, రానిచ్చిన, అంగీకరించబడ్డ, వొప్పుకొన్న.

  • but సరేగాని.

Admixture, n. s. మిశ్రమము, కలుపు.

To Admonish, v. a. బుద్ది చెప్పుట, బోధించుట.

Admonition, n. s. బుద్ధిచెప్పడము, బోధన, ఉపదేశము.

Admonitory, adj. బుద్ధిచెప్పే, బోధించే. an * poem నీతికావ్యము, ఉపదేశ గ్రంథము.

Ado, n. s. శ్రమ, తొందర, యిబ్బంది. or Bustle అల్లరి, గత్తర. without any more * he paid the money ఆ రూకలను అనాయాసముగా చెల్లించినాడు. I had much * to help laughing సంకటపడి నవ్వును అణుచుకొంటిని. he had much * to get food అన్నానికి నిండా శ్రమపడ్డాడు.

Adolescence, n. s. యౌవనము, యౌవనావస్థ.

Adolescent, adj. యౌవనావస్థగా వుండే.

Adonis, అతిసుందరమైన ఒక దేవుని పేరు.

To Adonize v. n. సింగారించుకొనుట, సొగసుగా బట్టలు ఆభరణాలు తొడుక్కొనుట.

To Adopt, v. a. దత్తు చేసుకొనుట, అవలంబించుట. You have adopted his habits వాడినడతలు నీకు పట్టుబడ్డవి. he adopted my advice నేను చెప్పిన బుద్ధిని అవలంబించినాడు. I adopted another method నేను మరి ఒక మార్గమును పట్టినాను.

Adopted, adj. దత్తుచేసుకోబడ్డ, అవలంబించిన. an * son దత్త పుత్రుడు. the method

  • by these వాండ్లు అవలంబించిన మార్గము.

Adoption, n. s. దత్తు, స్వీకారము, అవలంబించడము. from your * of his sentiments వాడి భావము నీకు పట్టుబడ్డది గనక, వాడి బుద్ధే నీకున్ను వచ్చినది గనక. After his * of this plan వాడు యీ యుక్తిని అవలంబించిన తరువాత, యీ మాదిరిని పట్టిన తరువాత.

Adoptive father, n. s. దత్తు చేసుకొన్న తండ్రి.

Adorable, adj. పూజ్యమైన, పూజనీయమైన, పూజార్హమైన.

Adorably, adv. పూజనీయముగా, పూజార్హముగా.

Adoration, n. s. పూజ, అర్చన.

To Adore, v. a. పూజ చేసుట, పూజించుట.

Adored, adj. పూజ్యమైన, పూజార్హమైన.

Adorer, n. s. పూజచేసేవాడు. an * of the sun సూర్యోపాసకుడు.

To Adorn, v. a. అలంకరించుట, శృంగారించుట, she adorned herself with diamonds రవల సొమ్ములు శృంగారించుకొన్నది. he adorned the room with pictures ఆ గదిని పటములతో శృంగారించినాడు.

Adorned, adj. అలంకరించిన, శృంగారించిన, with many virtues సకలగుణ సంపన్నుడైన.

Adornment, n. s. అలంకారము, శృంగారము.

Adrift, adv. నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికి కొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికి కొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగా విడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.

Adroit, adj. చమత్కారియైన, నేర్పరియైన, నిపుణుడైన.

Adroitly, adv. చమత్కారముగా, నేర్పుగా, నిపుణతగా.

Adroitness, n. s. చమత్కారము, నేర్పు, నిపుణత.

Adry, adv. దప్పికగా, దాహముగా. I am * నాకు దాహముగా ఉన్నది.

Adscititious, adj. అధికమైన, ఉపరియైన, అన్యత్ర తెచ్చుకొన్న.

Adulation, n. s. ఇచ్చకము, ముఖస్తుతి, బుజ్జగింపు.

Adulator, n. s. ఇచ్చకాలమారి, ముఖస్తుతి చేసేవాడు, బుజ్జగించేవాడు, ఉబ్బించేవాడు.

Adulatory, adj. బుజ్జగింపైన, స్తోత్రమైన, ఉబ్బించే.

Adult, n. s. వయసు వచ్చిన మనిషి, ప్రాయపు మనిషి. Both infants and adults పసివాండ్లున్ను వయసు వచ్చిన వాండ్లున్ను.

To Adulterate, v. a. కలిపి చెరుపుట. the meal was adulterated with chalk ఆ పిండి సీమసున్నము కలిపి చెరపబడ్డది. the silver is greatly adulterated యీ వెండినిండా కలపడమైపోయినది. this Telugu is adulterated with Hindustani యీ తెలుగు తురకభాషా సంకరముగా వున్నది. adulterated silver కందువెండి.

Adulteration, n. s. కలిపిచెరపడము, మట్టము చేయడము. to prevent the * of this silver యీ వెండి కలపడమై పోకుండా.

Adulterer, n. s. జారుడు, ఒకని పెండ్లాన్ని పట్టేవాడు.

Adulteress, n. s. వ్యభిచారి, జార స్త్రీ.

Adulterine, adj. పరపురుషునికి పుట్టిన, జారజుడైన.

Adulterous, adj. రంకుగల, వ్యభిచారముగల.

Adultery, n. s. రంకు, వ్యభిచారము, జారత్వము.

Adust, adj. యెండిన, శుష్కించిన.

To Advance, v. a. ముందుకు తేచ్చుట, అభివృద్ధి చేసుట, పొడిగించుట, ముందుకు చాచుట, ముందు రూకలిచ్చుట, చెప్పుట. he advanced his hand చెయి చాచినాడు. he advanced this statement యీ సంగతి చెప్పినాడు. education advances the mind శిక్షచేత బుద్ధికుశలత వస్తున్నది. his assistance advanced the work అతడి సహాయము ఆ పనికి సానుకూలముగా వుండినది. he advanced this on the strenght of your promise నీ మాట బలము పట్టుకొని దీన్ని చెప్పినాడు. the king advanced him రాజు వాణ్ని ముందుకు తెచ్చినాడు. he advanced me to this situation నన్ను యీ వుద్యోగములోకి పొడిగించినాడు. he advanced money for every article ప్రతి సామానుకున్ను ముందు రూకలిస్తాడు. to * money for cultivation వారకమిచ్చుట, తక్కావి యిచ్చుట.

To Advance, v. n. ముందుకు వచ్చుట, ముందుకుసాగుట, అభివృద్ధియౌట. he advanced some steps కొన్ని అడుగులు ముందరికి వచ్చినాడు, పోయినాడు. the day was now advancing యింతలో శానా ప్రొద్దాయెను.

Advance, n. s. ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు. in his * వాడివతలికి రావడములో. to prevent his * వాడివతలికి రాకుండా నిలపడానకు. his * in the service was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు. I observed no advance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము. he made a rapid * in the language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది. his rapid * in learning surprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది. she made advances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది. he made advances to a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు. Money paid in * for cultivation వారకము, తక్కావి.

Advanced, adj. ముందుకు వచ్చిన, ముందుకు సాగిన, ముందరనడచిన, అభివృద్ధియైన, పొడిగిన, చాచిన ముందు రూకలిచ్చిన, చెప్పిన. the boy is well * in grammar వ్యాకరణములో బహుదూరము చదివినాడు. Well * in age నిండా యేండ్లు చెల్లిన. * in rank వుద్యోగములో పొడిగిన. the work is now far * ఇప్పుడా పని బహుదూరము జరిగినది. the statement * by them వాండ్లు చెప్పినమాట. the * force ముందుగా పోయిన దండు. Money * to tenants to pay for seed వారకము, తక్కావి. the money * for this యిందుకై ముందుగా యిచ్చిన రూకలు.

Advancement, n. s. అభివృద్ధి.

Advantage, n. s. లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. that will be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు, పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune and strength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. or opportunity సమయము. they took * of his weakness and robbed him వాడి ఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయము చూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this house to me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములో అది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an

  • of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an
  • over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీది

పై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినా నన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over us కొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * over me in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appeared to great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడి ప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు, కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అది బాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టి మాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.

To Advantage, v. n. లాభము కలగచేసుట, ఫలము కలగచేసుట.

Advantaged, adj. లాభమును పొందిన, ఫలమును పొందిన.

Advantage-ground, n. s. వైపుగావుండే స్థలము.

Advantageous, adj. ప్రయోజనకరమైన, లాభకరమైన, ఫలకరమైన, ఆదాయమైన, ఉపయోగమైన, అనుకూలమైన. he made a very * marriage వివాహము చేసుకోవడమువల్ల వాడికి నిండా వుపయోగము.

Advantageously, adv. లాభముగా, ఉపయోగముగా.

Advantageousness, n. s. లాభము, ఫలము, ఆదాయము.

Advent, n. s. ఆగమనము, అనగా ఖ్రీస్టు మాస్పండుగకు ముందువచ్చే నాలుగు వారాలు.

Adventitious, adj. that which happens సంభవించే, సంఘటించే, తటస్థించే, సంప్రాప్తమయ్యే, ఆగంతుకమైన, అవాంతరమైన. or extrinsic పై, బయటి. he effected this without * aid పై సహాయము లేకనే దీన్ని నెరవేర్చినాడు. she is an excellent woman; her beauty is an * circumstance అది మహాఘనురాలు దాని అందము అవివక్షితము.

Adventiously, adv. తనకుతానే, తనంతటనే, హటాత్తుగా.

Adventure, n. s. దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము, వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్న నాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventures యీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of Robinson Crusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddha అనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంక విజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures you must go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది, యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.

To Adventure, v. n. తెగించుట, సాహసము చేసుట. See To Venture.

Adventurer, n. s. సాహసి, తెగించినవాడు, అనగా యిందులో మన అదృష్టము బయట పడదా అని వక పనికి తెగించినవాడు. Many adventurers joined the army శానామంది తమకున్ను యేదయినా ఒక పని చిక్కదా అని తెగించి ఆ దండులో పోయి కలిసినారు.

Adventuresome, adj. సాహసమైన.

Adventurous, adj. తెగువగల, సాహసముగల.

Adventurously, adv. తెగించి, సాహసముగా.