విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము B.A-Baluster

విక్షనరీ నుండి
B.A. the contraction of Bachelor of Arts విద్వాంసులకిచ్చే ఒక తరహా పట్టము.
B.C. Contraction of Before Christ, క్రీస్తు పుట్టక మునుపు. B.L. Bachelor of
Laws విద్వాంసులకిచ్చే ఒక తరహా పట్టము.

To Baa, a. n.  బా అని మేక కూసుట.

Baa, n. s. బా అని మేక కూత.

Baal, n. s. ఆకాశ  భైరవుడు, భేతాళుడు. See Adam Clarke, on Judges 2.11.

To Bable, v. n. వదరుట, పేలుట, రహస్యమును బయట చెప్పుట.

Babble, n. s. వదురు, పిచ్చి కూత, పిచ్చి మాటలు.

Babbling, n. s. వదురు, పిచ్చికూత, పిచ్చిమాటలు.

Babe, n. s. బిడ్డ, శిశువు, కూన. 

Babel, n. s. కలవరము.They attempted to build the tower of Babel 
up to the skies వాండ్ల ప్రయత్నమును చూస్తే రాయగోపురమునకు అడుగు 
వేసినట్టు వుండెను. అనగా, బ్రహ్మాండమైన ప్రయత్నము, కొనసాగదని భావము. 
The tower of Babel బేబెల్ బురుజు అనగా జలప్రళయమునకు తర్వాత మనుష్యులు 
అత్యున్నతమైన గోపురమును కట్టడమునకు యత్నపడినంతలో దేవుడికి కోపము వచ్చి
వొకడిమాట వొకనికి అథ ్ము కాకుండా పొయ్యేటట్టు చేసినందు మీదట ఆ ప్రయత్నము భంగమై
పోయినదని బైబిలు మొదటి కాండలో ఒక కధ వున్నది.


Baboon, n. s. గండుకోతి, తిమ్మడు.


Baby,  n. s. బిడ్డ, శిశువు. * linen పొత్తిగుడ్డలు.

Babyish, adj. బాలిక, పిల్ల, బాల్య, లేత, పిచ్చి.

Bacchanal, n. s. తాగుబోతు.

Bacchanalia, n. s. plu. Bacchus  యొక్క వుత్సవము.

Bacchanalian, n. s. Bacchus అనే దేవుని యొక్క వుత్సవములో తాండవమాడేవాడు.

Bacchus, బలరామనామము, తాగుబోతుల దేవుడు.


Bachelor, n. s. పెండ్లి లేనివాడు, బ్రహ్మచారి, ఒంటిగాడు. at the University
పాఠశాలలో విద్యార్ధులకు యిచ్చే మొదటిపట్టము.

Bachelor's button, n. s. Name of a flower వాసన లేని ఒక తరహా పుష్పము.  


Back, n. s. వీపు, వెనకతట్టు. the * of the chair కురిచిలో అనుకొనే వెనకటి
చట్టము. * of the head పెడతల. the * of the neck మెడపంపు. the small of the * 
నడుము. * of the hand పెడచెయ్యి, మీజెయ్యి. he came with an hundred men at his *
నూరుమందిని వెంటబెట్టుకొని వచ్చినాడు. at the * of the house యింటివెనక. he had not a rag to his * వాడికి కట్టుకొనేటందుకు గుడ్డ పేలిక లేక వుండినది,
పైకిబట్టలేకవుండినది . they turned the backs upon him when he was in trouble 
ఆపదలో వాణ్ణి చెయ్యివిడిచినారు, ఉపేక్షించినారు. he was lying on his back 
వెల్లవెలకల పండుకొని వుండినాడు. he has been upon his * this week వారము 
దినాలుగా పడ్డపడకగా వుండినాడు. he came with only the clothes on his *
పైబట్టతో వచ్చినాడు. this put his * up యిందుకు వాడికి కోపము వచ్చినది.
he slandered me behind my * నా ముడ్డి వెనక నన్ను దూషించినాడు.
he went on horse * గుర్రముమీద పోయినాడు.

Back, adj. వెనకటి. the * way వెనకటిదారి, పెరటిదోవ.     

Back, adv. వెనకటికి, తిరిగి, మళ్ళీ. four days * నాలుడుదినములకిందట.
to dirve * వెనకకు తరుముట. he went * మళ్లీ పోయినాడు. they kept *
వదిగివుండినారు. they kept this statement * యీ సంగతిని మర్మముగా వుంచినారు. 
sickness kept me * వొళ్లుకుదురులేనందున నేను రాలేదు, పని జరిగించలేదు.
he kept the money * రూకలను బిగపట్టినాడు.             

To Back, v. a. to mount a horse గుర్రమెక్కుట. to support వొదుగుట, సహాయము చేసుట 
his friends backed him వాణ్ని బంధువులు ఆదుకొన్నారు. his friends and backers
వాడి స్నేహితులున్ను సహాయులున్ను. to * or, break in a horse గుర్రమును మరుపుట.

To Back, v. n. వెనక్కు నడుచుట. the horse backed గుర్రము వెనక్కు నడిచింది.       

To Backbite, v. a. చాడీచెప్పుట, కొండెముచెప్పుట, దూషించుట.   

Backbiter, n. s. చాడీలు చెప్పేవాడు, కొండాలమారి.  

Backbiting, n. s. చాడీ, కొండెము, యిల్లామల్లితనము.

Backbone, n. s. వెన్ను యెముక.  he was a rogue  to the *
వాడినిలు వెల్లావిషము. 

Backdoor, n. s. దిడ్డి వాకిలి.

Backgammon, n. s. చొకటాలవంటి   ఒక తరహా ఆట. a * board యీ ఆట ఆడేపలక.    

Backhanded, adj. పెడచెయ్యి వాటమైన.  

Background, n. s. in a picture  పరస్థలము.  they kept this account 
in the * యీ సంగతిని మర్మముగా వుంచినారు. he remains in the *
అప్రసిద్దుడై వున్నాడు. 

Backpiece, n. s. వీపుజీరా.

Backside, n. s. the rear  వెనకపార్శ్వము. the buttocks పిరుదులు, ముడ్డి
or yard of a house పెరడు. 

To Backslide, v. n. వెనక్కు తీసుట, తగ్గుట. they who * భక్తిలో వెనక్కు
తీసినవాండ్లు. 

Backslider, n. s. భక్తిలో వెనక్కు తీసినవాడు, భక్తి తగ్గినవాడు.
or apostate ఆరూఢపతితుడు. 

Backsliding, n. s. భక్తి తగ్గడము.

Backstairs, n. s. వెనకటితట్టువుండేమెట్లు, మరుగుదారి.  

Backward,  adj. జబ్బైన, మందమైన, జడమైన.
this child is * in reading యీపిల్లకాయ చదువులో 
 జబ్బుగా వున్నాడు.  a * confession అర్దాంగీకారము.     
I was * to believe this దాన్ని నేను నమ్మడానికి అనుమానిస్తిని.  

Backward, Backwards, adv. వెనక్కు, తల్లకిందులుగా, విలోమముగా, జబ్బుగా.
he fell backwards వెల్ల వెలకల పడ్డాడు.       
he has gone backwards in his reading చదువులో వెనకపడ్డాడు.  
It was written backwards ముద్రాక్షరమురీతిగా వ్రాయబడ్డది, యిట్లా
వ్రాసిన దాన్ని అద్దములో చూస్తే సరిగ్గా తెలుసును.      
Reading a spell * ఒక మంత్రమును తల్లకిందులుగా చదవడము.
To go * మరుగు పెరటికి పోవుట, అనిన్ని కొన్నిచోట్ల అర్ధమౌతున్నది.   
యీ అర్ధము యిప్పట్లో వాడికలేదు.

Backwardness, n. s. Unwillingness అసమ్మతి, అనంగీకారము.   dullness       
మాంద్యము, జబ్బు. 
           
Backwater, n. s. కయ్యి

Backyard, n. s.పెరడు.

Bacon, n. s. పంది మాంసము, అనగా వుప్పు వేసి పొగనుకట్టిన పంది మాంసము.
he saved his *  తప్పించుకొన్నాడు.

Bad, adj. చెడ్డ, కాని, దుష్ట, పనికిమాలిన. * qualities దుర్గుణములు 
 he is very * to-day, or he is very ill to-day యీ వేళవాడికి వొళ్ళు
 నిండా కుదురులేదు. he wants it very * వాడికి అది నిండా 
 ఆగత్యముగా కావలెను. I know nothing about it good or * అది 
 పుణ్యమో పాపమో నే నెరగను you are quite as * as  he  వాడెంతో
నీవంతే.this objection is * యీ మాంసము మురిగిపోయినది, చెడిపోయినది. 
* advice or council దుర్బోధన. * coin తప్పునాణెము. he was in 
* circumstances దరిద్రుడై వుండినాడు. a * debt చచ్చుబాకి.
* English తప్పుయింగ్లిషు. * fortune దౌర్భాగ్యము, గ్రహచారము. 
owing to my bad fortune నా దౌర్భాగ్యమువల్ల. he did it with 
a * grace దాన్ని అసమాధానముగా చేసినాడు. A * man దుష్టుడు.
* character  అపకీర్తి. * conduct దుర్నడత, దుర్మార్గము. he set his son a *
 example తాను దుర్మార్గముగా నడిచి తనదుర్గుణములు కొడుకుకు పట్టుపడేట్టు
చేసినాడు. * faith ద్రోహము. * health అస్వస్థము. he has a * hand 
వాడికి చెయ్యి వుపద్రవముగా వున్నది. he is a * hand at reading వాడికి
చదువను చేత కాదు. *  humour కోపము, చిరచిర. I saw he was in a * humour 
వాడు మంటగా వుండినట్టు వుండెను. * humours in the bo    dy  పులినీళ్ళు
రసిక. he did me a * office నాకు ఒక అపకారము చేసినాడు.
* sign దుర్నిమిత్తము, దుశ్శకునము. * symptom దుర్లక్షణము.
the style of this poem is in * taste యీకవి చెప్పినది విరసముగా
వున్నది. * temper అలిగేభావము, దుర్గుభము, మూర్ఖము. they are on * terms 
వాండ్లు ఒకరికొకరు విరోధముగావున్నారు. Being on * terms with me
నా మీద గిట్టక. * times దుష్కాలము, చెడ్డకాలము. a * tooth పుచ్చిన
పల్లు. * weather మబ్బు మందారము, వానఘాలి.

Bade, the past of Bid ఆజ్ఙాపించినది. he * me go నన్ను పొమ్మన్నాడు.
I * him go there or I bid him go there వాణ్ని అక్కడికి పొమ్మన్నాను.
he bade them to dinner వాండ్లను భోజనానికి పిలిచినాడు.

Badge, n. s. గురుతు, చిహ్నము, బిరుదు. the * worn by a Policeman
బిళ్ళ.

Badger,  n. s. కొంచెము కుక్కరీతిగా కొంచెము పందిరీతిగావుండేఒక 
మృగము, యిదినీళ్ళలో నున్ను గట్టుమీదనున్ను సంచరించేటిది, చెడ్డకంపు
కొట్టేది; కొంచమున చావని మొండిజంతువు. In the Tamil Bible and 
in the Bengali version the Hebrew word Taghas is used.

To Badger, v. a. or plague రచ్చబెట్టుట, ప్రాణమువిసికించుట.

Badinage, హాస్యము, యోగతాళి.

Badly, adv. చెరుపుగా, జబ్బుగా.

Badness, n. s. చెరుపు, చెడ్డతనము, దుష్టతనము.  from the *
of the writing ఆ వ్రాలు బాగావుండనందున. from the *
of the wether మబ్బు మందారము చినుకుచిత్తడిగా వున్నందున.

To Baffle, v. a.  విఘాతముచేసుట, భంగముచేసుట, నిష్ఫలము
చేసుట. he baffled me in this business 
యీ పనిలో నాకు భంగము చేసినాడు.     or to confound 
కలతబెట్టుట, చీకాకుపరచుట. the style of this book baffles 
all my endeavours to understand it యీ గ్రంధము యొక్క
శయ్య తెలుసుకోవడానికి నాకు నిండా కలతగా వున్నది.  
the scene baffled all description ఆ వేడుక వర్ణనకు 
అలవికాలేదు.  this baffles all my conjecture యిందువల్ల
వూహించనలవి కాలేదు.

Bag, n. s. సంచి, తిత్తి, గోతాము. a. * of rice గోనెడు బియ్యము. 
a gunny * గోనెసంచి. a pair of bullock bags కంట్లము,
పెరికె. a nose * for feeding horses తోపరా. a * of musk
కస్తూరివీణె. an ornament for the hair పూర్వకాలమందు గొప్ప
దొరలు అలంకారానికి జడతీరుగా కట్టుకొన్న సంచి.

To Bag, v. a. సంచిలోవేసుట. he bagged three birds మూడు పక్షులను
కొట్టి సంచిలో వేసుకొన్నాడు.

Bagatelle, n. s. a trifle అల్పము, స్వల్పము, కొంచెము. a name of a
game ఒక ఆట పేరు. this a mere * యిదివొట్టి అప్రయోజకము.

Baggage, n. s. సామాను, సరంజాము. his * filled ten carts
అతని సామాను పదిబండ్లు నిండింది. she is a drunken *
అది తాగుబోతుముండ. a sly * నంగనాచి ముండ. in plu.
Baggages లంజలు, గుడిసెవేట్లు.

Bagman, n. s. or hawker ఆకరు. or man that carries a bag
మూటమోసేవాడు.

Bagnio, n. s. Bath స్నానము చేసే యిల్లు. or bowdy house
భోగము దాని యిల్లు.

Bagpipe, n. s. తోలుసుతి, తిత్తిసుతి, స్కాట్లాండు దేశపు ఒక తరహా సన్నాయి.

Bagpiper, n. s. తోలుసుతి వూదేవాడు.

Bab, interj. ఛీపో అనే ధిఃకారశబ్ధము.

Bail, n. s. పూట, జామీను, పూటబడ్డవాడు . I stood * for him 
నేను వాడికి పూటబడితిని. personal * నఫరుజామీను. he found *
వాడు జామీను యిచ్చినాడు. at circket పుల్ల, పుడక.

To Bail, v. a. పూటబడుట, జామీనుయిచ్చుట.

Bailable, adj. జామీనుమీద విడవతగ్గ.  a * offience జామీను తీసుకొని
విడిచిపెట్టతగ్గనేరము.

Bailiff, n. s. కోర్టుబంట్రోతు, సార్జంతు. the high * or Chief Magistrate
పెద్దమేజిస్ట్రేటు అధికారి. the * or Superintendent of an estate
పయిరుపచ్చ విచారించుకొనే మణియగాడు.

Bailiwick, n. s. సరహద్దు, తుకుడి, పేట.

To Bait, v. a. యెరబెట్టుట, యెరతగిలించుట. he baited the book with 
a worm గాలానికి పురుగును యెరగా తగిలించినాడు. he baited the
tiger trap పులిబోనులో యెరబెట్టినాడు. he baited his horse 
గుర్రానికి మజిలిలోదాణాపెట్టినాడు. he baited the bear
ఆ వెలుగ్గొడ్డుమీద కుక్కలను వుసుకొలిపినాడు.

To Bait, v. n. మజిలిలో దిగి భోజనముచేసుట. the men and their cattle 
were baiting మజిలిలో దిగి గొడ్లకు మేతవేసి తామున్ను భోజనము చేస్తూ
వుండినారు. a baiting place  దిగి భోజనముచేసే మజిలి.

Bait, n. s. ఎర, తీపి, మజిలిలో పెట్టేదాణా. they stopped to
give * to their beast గొడ్లకు దాణా పెట్టడానకై నిలిచిరి.       


Baize, n. s. ముతకనగళాతు, గొంగళి.

To Bake, v. a. కాల్చుట. to * bread రొట్టెలను కాల్చుట. to * pots
or bricks & c.  ఆనము కాల్చుట. sugar baking  బెల్లము  
కాచడము.

Baked, adj. కాల్చిన, వేపుడు. * rice వేపుడు బియ్యము.

Bake-house, n. s. రొట్టెలు కాల్చేయిల్లు, రొట్టెల గిడ్డంగి. 

Baken, adj. కాల్చబడ్డ.

Baker, n. s. రొట్టెలు కాల్చేవాడు. sugar * బెల్లముకాచేవాడు.

Baking, n. s. ఒక తడవ కాల్చినది.

Balance, n. s. a pair of scales  త్రాసు, తక్కెడ.
when you walk on a pole you must keep your * ఒక బొంగుమీద
నడిచేటప్పుడు యిటూ అటూ వొరగరాదు. keep your * or you will
fall  వొరిగితే పడుతావుసుమీ. an even weight సరితూనిక. *
in a watch  ఘడియారములో ఒక భాగము. or       remainder నిలువ,
మిగత, బాకి, అవశిష్టము. net *  నికరమైన  బాకి. he struck
the *  బాకి. he struck the * బాకితేల్చినాడు. a * sheet
జమాఖర్చులెక్క. Libra of the Zodiac తులారాశి. * of power
సమాధికారము. * of trade సమవ్యాపారము, సమవర్తకము.

To Balance, v. a. నిలువకట్టుట, తూగేటట్టుచేసుట. he sat on that
side to * the boat పడవ యీతట్టు వొరగకుండా సరిగ్గావుండడానకై  
ఆతట్టుకూర్చున్నాడు. he balanced the account బాకి తేల్చినాడు. I put in
a weight to * it అది సరితూగడానకై కొంచెము బరువు పెట్టితిని. when he
balanced the arguments ఆ న్యాయములలో తారతమ్యమును విచారించేటప్పటికి.
the advantage balances the evil కష్టానికి తగినఫలము కలిగినది.

To Balance, v. n.అనుమానించుట,సందేహించుట.he    balanced a long time
శానాసేపు సందేహించినాడు.

Balanced, adj. సరితూగే. a * account బాకి దేలినలెక్క. this 
evil is * by that good యీ చెరుపుకు ఆ మంచికి సరిపోయినది.

Balcony, n. s. వసార, బ్రాందా, అంముగా వుండడానకై మిద్దె 
జనలకుముందర బయిటికి వొత్తించి, యినుము, కొయ్య, లేక
రాతిలో కట్టిన బ్రాందా.

Bald, adj. బోడి, బట్ట, వెంట్రుకలు రాలిబట్ట కట్టిన. of style 
జబ్బైన, నీరసమైన, పేలవమైన. a * head బోడితల, బట్టతల.
a * style జబ్బు పాకము. this is a very * account
యిది తలాతోకలేని సంగతి.

Balderdash, n. s. సంకరము, కొంటెకూతులు.


Baldness, n. s. బోడి. of style జబ్బుతనము, పేలవము.

Bale, n. s. కట్ట, మూట, బస్తా, నగ.

To Bale, v. a. చల్లుట, బయిటికిచల్లుట, అనగా పడవలో, లేక, 
వాడలోవూరిననీళ్ళను బయటికి చల్లుట.

Baleful, adj. వ్యసనకరమైన, విషమైన చేటుదెచ్చే, నాశకారియైన.
their * example ruined him  వాండ్లకు వచ్చినచేటు వీడికిన్ని
వచ్చినది. * influence నాశకారియైనశక్తి.

Balk, n. s. disappointment నిరాశ. a beam దూలము. between
fields  దున్నకతుండుగా నిలిచి పోయిననేల.

To Balk, v. a. భంగముచేసుట, వ్యర్ధముచేసుట, నిష్ఫలముచేసుట.
నిరర్ధకము చేసుట. he balked my endeavours నా యత్నమును 
భంగముచేసినాడు.                                                             
                                                      
Ball,  n. s. గుండు, ఉండ, గోళము. or bullet గుండు.
a * of thread కండె, నూలుండ. a * of flowers or cloths
బంతి, చెండు. or dancing entertainment ఆట, విందుచేసి
దొరలు దొరసానులు ఆడడము. he has now the * at his
feet యిఖమీదట వాడిదెబ్బే దెబ్బ, యిఖమీద వాడిమాటకు 
యెదురులేదు.

Ballad, n. s.  సామాన్యమైన పదము, నారుపాట. A * singer
బొబ్బిలి కధలవంటివి, నారు పాటలవంటివే పాడేవాడు.

Ballast, n. s. అడుగుబరువు, తాపి, అనగా వాడపొర్లకుండా                 
వుండడానకై అడుగున వేసే రాయిరప్ప మొదలైనబరువు.

Ballasted, adj. అడుగుబరువుగల, అనగా వాడ పొర్లకుండా అడుగున
రాయిరప్ప వేసి బరువుగావుండే.

Ballet, n. s. a kind of dance perfomed by public actors వేషగాండ్లు
ఆడే ఒక తరహా లజ్జలేని ఆట.

Ballon, n. s. పొగగుమ్మటము.

Ballot, n. s. ఉండలువేయడము, అనగా ఒకణ్ని ఒకసభలో ప్రవేశ పెట్టడానకు
సభలో వుండేదొరలలు ప్రతిమనిషిన్ని ఒక పెట్టలో తెల్లవుండనైనా 
నల్లవుండనైనా వేస్తారు, తెల్లవుండలు నిండ్డావుంటే అతణ్ని ప్రవేశ పెట్టుతారు,
నల్లవుండలు అధికముగా వుంటే అతణ్ని ప్రవేశపెట్టరు, దీనికి
Ballot అనిపేరు.

            
To Ballot, v. a. ఉండలు వేసుట, చీట్లు వేసుట.they ballotted for him  వాణ్ని
సభలో ప్రవేశ పెట్టడమును గురించి చీట్లువేసినారు. See Ballot, n. s.

Ball-room, n. s. నాటకశాల

Balm, n. s. consolation ఓదార్పు, ఉపశంతి, ఉపశమనము. Medicine 
ఉపశమనమైన ఒకతరహా గాయతైలము.         a certain fragrant herb  పరిమళమైన 
ఒక తరహా చెట్టు.  

Balmy, adj. పరిమళముగల, మనోహరమైన,        ఉపశాంతికరమైన.    * breeze మలయ
మారుతము.

Balsam, n. s. ఒక తరహాతైలము, ఒక తరహా చెట్టు.  the flower  గులిముడి, 
చిలకముక్కు పువ్వు. oil of * సాంబ్రాణితైలము.

Balsamic, adj. పరిమళించే, సుగంధమైన.

Baluster,  Balustrade, n. s. మిద్దెమీద, గారతోనైనా కుండ పెంకుతోనైనా 
కట్టినగ్రాది, చెయిపిడిగోడ.