విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Bdelleum-Befriend
Appearance
Bdellium, n. s. గుగ్గిలము. some Translators say గోమేధికము. To Be, v. n. ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is he వాడెవడు. this is often understood, not expressed; as is shewn in the Telugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a little wind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది. There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది. this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to write it అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లు while matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there has been a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణ సంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off! మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యము తీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి. Beach, n. s. రేవు, వోడరేవు, సముద్రతీరము, Beacon, n. s. ఓడలకు రాత్రిళ్ళు ఫలాని అపాయస్థలమని గురుతు తెలిసేటట్టు నిర్ణయించబడ్డ వెలుతురు గల వున్నత స్థలము. or warning యెచ్చరిక. let him be a * to you అతడి గతిని చూచి నీవు యెచ్చరిక పడవలసినది. Bead, n. s. పూస, మణి, beads పూసలు, గుండ్లు. he was counting his beads జపమాలికతో జపము చేసుకొంటూ వుండినాడు. a * of sweat చెమట బిందువు. Beading, n. s. పూసకట్టుగా చేసిన కొయ్యపని. Beadle, n. s. ఒక తరహా బంట్రోతు, పేదా, తలారి. Beadman, Beadsman, n. s. సన్యాసి, పకీరు. Beagle, n. s. ఒక తరహా వేటకుక్క. Beak, n. s. పక్షి ముక్కు. Beaked, adj. ముక్కుగల. Beaker, n. s. గండిచెంబు. Beam, n. s. of wood దూలము. the * of a balance దండె, త్రాసుకోల. In trial this kicks the * పరిక్షలో యిది వెనక్కుబడుతుందు, weavers * పడమాను తరిమాను. * of a plough నొగమాను. of light కిరణము. To Beam, v. n. ప్రకాశించుట. beaming ప్రకాశించే. a beaming smile చిరునవ్వు. Bean, n. s. చిక్కుడుకాయ. there are many kinds of this బెండకాయ, పొట్లకాయ మొదలైన కాయగూరలు. To Bear, v. a. to carry కొంచపోవుట, మోసుకొనిపోవుట. to support వహించుట, ధరించుట. they bore him to prison వాణ్ని జయిలుకు తీసుకొనిపోయినారు. I bore this message to him అతనికి నేను యీ సమాచారము తీసుకొని పోతిని. they bore torches దివిటీలు పట్టినారు. this car cannot * the weight యీబండి ఆబళువును తాళనేరదు. he bore this name వాడిపేరు యిది. he bore arms ఆయుధములను ధరించినాడు. to endure సహించుట, పడుట, తాళుట, నిభాయించుట. I cannot * his conduct వాడినడతను నేను పడను వాడినడత నాకు సరిపడదు. your brother will * the brunt వచ్చేదాన్ని మీయన్న పడుకొనును. You will * the blame ఆ తప్పు నీకువచ్చును. If I fail to do this let me * the blame దీన్ని నేను చేయక తప్పితే ఆ తప్పు నాది. I cannot * it దాన్ని నేను తాళను. he bore the expense ఆ శెలవును తాను పడ్డాడు. to bring forth a child కనుట, ఈనుట, పిల్లవేసుట. the tree bore much fruit యీ చెట్టు బాగాపండింది. * this in mind దీన్ని మనుసులౌ పెట్టు మరిచిపోక. he bears them hatred వాండ్ల మీద చలమునువహించి వున్నాడు. he bears very good character మంచిపేరు యెత్తినాడు. I can * witness of that దానికి నేను సాక్షి, అది నేను యెరుగుదును. he bore himself like a hero శూరుడై ప్రవర్తించినాడు. this letter bears another date యీ జాబులో వేరే తేది వున్నది. his passion bore him away కోప పరవశుడై నాడు. we will * your company నీతో కూడ వస్తాము. they bore him down or over-threw him వాణ్ని వోడకొట్టిరి. this bears out his assertion యిందువల్ల వాడుచెప్పినది స్థిరమౌతున్నది. this is borne out by two arguments యిందుకు రెండు వుదాహరణలు వున్నవి. that bears no proportion to this అది యెక్కడ, యిది యెక్కడ. he bears a resemblance to you వాడు నీ పోలికగా వున్నాడు. To Bear, v. n. ఉండుట, పడుట, సహించుట. (in the sea language) పోవుట, వచ్చుట. this tree does not * యీచెట్టు కాయదు. the ship bore north of us ఆ వాడ మాకు వుత్తరముగా వుండినది. the ship bore towards us, or, bore down upon us ఆ వాడ మాకై రావడానకు ఆరంభించినది. he bore up against these difficulties యీ కష్టములను పడ్డాడు, సహించేనాడు. this does not *upon the subject యిది అంతా అందుకు సంబంధించదు. the gun bore upon them ఆ ఫిరంగి వాండ్ల మీద పారడానికి వాటముగా వుండినది. Bear, n. s. ఎలుగ్గొడ్డు, భల్లూకము. the man is a perfect * మోటువాడు, మర్యాద తెలియని వాడు, అమర్యాదస్థుడు. Bearsply మోటుసరసము. the stars called the great * సప్తర్షి నక్షత్రములు. the lesser * ఉత్తర ధ్రువ నక్షత్రము. Beard, n. s. దాడి, గడ్డము. * of corn వరిముల్లు, ధాన్యశూకము. To Beard, v. a. దాడినిపట్టి యీడ్చుట. to face యెదిరించుట. are you going to * the government రాజరికము చేసేవానిని యెదిరించపోతావా. Bearded, adj. దాడిగల. Beardless, adj. గడ్డముమీసము రాని, మీసకట్టురాని. Bearer, n. s. మోసేవాడు. a * of a palankeen బోయి. the * of this letter యీ జాబు తెచ్చేవాడు. a mace * వెండిబెత్తపువాడు. this tree is a good * యిది బాగా కాచేచెట్టు. Beargarden, n. s. కలహస్థానము, గందరగోళముగా వుండేస్థలము. Bearing, n. s. or birth కాపు, కాన్పు, ఈత. or purport సారాంశము, తాత్పర్యము. or ensign చిహ్నము. or point in the compass దిక్కు పార్శ్వము. he took the bearings of the place ఆ స్థలమువుండే వైఖరిని యంత్రములకుండా విమర్శించినాడు. in every * నల్దిక్కుల, అన్నివిధాల. or behaviour నడక, వైఖరి. a rose tree in full * విరగబూచిన రోజా చెట్టు. A tree in full * విరగ పండిన చెట్టు. this conduct is past * యిది తాళ కూడనినడత. or lordly port నీలుగు, నీటు, జంభము. Bearing, adj. కనే, కాచే, పూచే, ఈనే. past * కాన్పువుడిగిన, కాపుడిగిన a letter * postage టప్పాలు కూలియివ్వవలసినజాబు. Bearish, adj. ఎడ్డె, మడ్డి, మూఢ, మొండి. Bearward, n. s. ఎలుగ్గొడ్లను పెంచేవాడు. Beast, n. s. మృగము, పశువు. గొడ్డు, జంతువు, జీవము. Beastliness, n. s. పశుత్వము, రౌత, అసంహ్యము. Beastly, adj. రోతైన, అసంహ్యమైన, బండు. * language బండుబూతు. To Beat, v. a. కొట్టుట, మొత్తుట, బాదుట. they * the corn ఆ ధాన్యమును నూల్చుతారు. In knowledge of grammar he beats them all వ్యాకరణములో వాండ్లందరిని మించినాడు. he * them in argument తర్కములో వాండ్లను వోడగొట్టినాడు, జయించినాడు. this beats me or this beats my understanding యిది నాకు దురవగాహముగా వున్నది. to * cloth in polishing it ఘట్టనచేసుట. to * cotton దూదేకుట. they * drums తంబురు వాయించినారు. he * it to pieces నలగ్గొట్టినాడు, పొడిచేసినాడు. they * it to powder దాన్ని పొడి చేసినారు. they * the copper into leaf ఆ రాగిని రేకుగా కొట్టినారు. to * rice or mortar దంచుట. to * to dust చూర్ణముచేసుట. he * his brains about it all day నాడంతా దాన్ని గురించి చింతిస్తూ వుండినాడు. he * the hoof all day నాడంతా నడిచినాడు. he * the enemy back శత్రువులను తిరగగొట్టినాడు, మళ్ళగొట్టినాడు. he * the price down వెలను తగ్గించినాడు. to * down or ram ఘట్టన వేసుట. to * down fruit to leaves పండ్లను, లేక ఆకులను రాల్చుట. he * the enemy off శత్రువులను తరమకొట్టినాడు. they * the dust off the sheet దుప్పటిదుమ్మును విదిలించినారు, దులిపినారు.they * out the iron bar యినుపకంబిని సాగకొట్టినారు. they * out his teeth వాడి పండ్లను రాలగొట్టినారు. he * a retreat పారిపోయినాడు. they * the rounds the whole night రాత్రి అంతా గస్తు తిరిగినారు. to * time in music తాళమువేసుట, మీటుట. he * up the jewel సొమ్మును నలగ్గొ ట్టినాడు. he * up the guard పారా వాణ్ని యెచ్చరించి లేపినాడు. she * up the meal with butter వెన్నను పిండిని మరించినది, వెన్నను పిండిని పలచనయ్యేటట్టు కలిపినది. he * up the enemy or he * up their quarters శత్రువుల మీద అకస్మాత్తుగా పోయి పడ్డాడు. I shall * up your quarters tomorrow రేపు మీ యింటికి వస్తాను. NOTE:- సంఖ్య లేక కొట్టడమునకు Beat అనివస్తుంది. సంఖ్యగా కొట్టడమునకు strike అనివస్తుంది. యేలాగంటే; the washerman beats clothes చాకలవాడుబట్టలను వుతుకుతాడు. the robbers * him severely దొంగలు వాణ్ని బాగా కొట్టినారు. he struck ten blows upon the door తలుపును పదితట్లు తట్టినాడు. he struck me అంటే నన్ను ఒక దెబ్బ కొట్టినాడని అర్థమిస్తుంది. he * me అంటే నన్ను బాదినాడు అని,పులిమినాడు అని, చాలాదెబ్బలు కొట్టినట్టు అర్థమౌతుంది. To Beat, v. n. ఆడుట, కొట్టుకొనుట. the heart beats గుండెలు అదురుతుంది, రొమ్ము కొట్టు కొంటుంది. the puse beats ధాతువు ఆడుతుంది, నడుస్తుంది. the watch beats ఘడియారము కొట్టుకొటుంది. the waves * against the shore కట్ట మీద అలలు కొట్టుతున్నవి. he was beating about తారాడుతూ వుండినాడు. he was beating about for an answer జవాబు చెప్పడానకు మిణకరిస్తూ వుండినాడు. Why are you beating about the bush? కావలసినదాన్ని ఫళిచ్చుమని చెప్పక యెందుకు గురికలు మింగుతావు, నీళ్ళు నములుతావు? Beat, n. s. దెబ్బ. to publish by * of drum తంబరకొట్టి ప్రసిద్ధపరచుట. during 50 beats of the pluse ధాతువు యాభై మాట్లు కొట్టడములో. or ward in a town ఠాణా లరహద్దు. the watchman was then on his * రోందు. round తిరుగుతూ వుండినాడు, అనగా నగరశోధన చేస్తూవుండినాడు. Beat, the p. of To Beat, కొట్టినది. Beaten, adj. కొట్టబడ్డ, దెబ్బలుపడ్డ. he went over the * ground of the Will ఆ వుయిలు కాకితమును వివివినిపడివుండేదాన్ని మళ్ళి మళ్ళి చెప్పుతాడు. a * path నడిచి అరిగినదోవ * gold అపరంజి. See to Beat. Beater, n. s. కొట్టేవాడు. a cotton * or cotton cleaner దూదేకుల వాడు. an earth * or rammer ఘట్టనపలక, దిమ్మసు a gold * కుందనపు రేకులు చేసేవాడు. a rice * or pestle రోకలి. Beatific, adj. పరమానందమైన, దివ్యమైన. the * vision దైవ ప్రత్యక్షము, సాలోక్యము. Beatification, n. s. చచ్చిన ఒక మహాత్ముణ్ని దేవతులలో కలపడము . Ten years after his * వాణ్ని దేవుణ్నిగా నియమించుకొన్న పదియేండ్లకు తరువాత. Beatified, adj. ముక్తుడైన. Beating, n. s. కొట్టడము, తాడనము, ప్రహరము. of cotton ఏకడము. after this * యీ దెబ్బలు పడ్డతరువాత. Beatitude, n. s. మోక్షము. or Benediction, blessing, దీవన, ఆశీర్వాదము. Beau, n. s. నీటుగాడు, సొగసుగాడు, ఒయ్యారగాడు. The beau-ideal (more correctly, ideal, a French phrase) తిలకము, రత్నము. This is the beau-ideal of a garden ఉద్యానవనతిలకము. It is the very beau-ideal of a commentary వ్యాఖ్యానమంటే యిదే వ్యాఖ్యానము. Tipu Sultan was the beau-ideal of a Musulman. టీపు సుల్తాను తురకల చూడామణిగా వుండెను. Beauish, adj. నీటైన, వయ్యారమైన. Beauteous, adj. అందమైన, సౌందర్యమైన, యిది కావ్యశబ్దము. Beautiful, adj. అందమైన, సుందరమైన. * weather మంచికాలము, హాయిగావుండేకాలము, అనగా మబ్బుమందారము చినుకుచిత్తడి లేక హాయిగా వుండేకాలము. this is a * demonstration దివ్యమైన ఉదాహరణ.This was a * trait of affection విశాసమునకు యిదే దివ్యమైనగురుతు. Beautifully, adv. అందముగా, సౌందర్యముగా. To Beautify, v. a. అలంకరించుట, శృంగారించుట. Beauty, n. s. అందము, సౌందర్యము, చక్కదనము. or handsome woman అందకత్తె, రూపవతి. the beauties of a book, (as of Shakespeare) యెత్తి వ్రాసిన స్వారస్యమైన పద్యమంజరి. Beauty-spot, n. s. on the forehead తిలకము. dimple సిబ్బెము. Beaver, n. s. an animal ఒకజంతువు, దీని బొచ్చుతో టోపీలు చేస్తారు. or hat టోపి. front of hemlet ముఖమును కప్పుకొనియుండే తలజీరా యొక్క భాగము. Beazle, or Bezel, n. s. మిద్దెటుంగరము యొక్క వొమ్మచ్చు. Becafico, n. s. ఒక తరహా నేలనెమలి. To Becalm, v. s. ఘాలి లేకుండా చేసుట. the hill becalmed our ship ఆ కొండవల్ల మా వాడకు ఘాలి లేక పోయినది. Became, (the past of become) అయినది. Because, conj. గనక, కాబట్టి, యేలనంటే. * he went పోయినాడు గనక. * of the heat యెండ అయినందున. I did this * of you నిన్ను గురించి దీన్ని చేస్తిని. * of his youth పసివాడైనందున. Beck, n. s. శిరఃకంపము, చెయిసౌజ్ఙ. they are wholly at his * వాండ్లంతా అతని స్వాధీనములో వున్నారు, వాడు యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు. To Beckon, v. a. సైగచేసుట, చెయిసౌజ్ఙ చేసుట. she beckoned him to go వాణ్ని రమ్మని చెయిసైగ చేసినది. To Becloud, v. a. మందారము వేసుట. the sun was beclouded సూర్యుణ్ని మబ్బు మూసుకొన్నది. grief beclouded her mind దానిమనసు వ్యసనగ్రస్తమైనది To Become, v. n. అవుట. he became king రాజైనాడు. she became his wife వాడికి పెండ్లాము అయినది. It became earth మన్నైపోయినది. he became bail for me నాకు పూటపడ్డాడు, జామీను వుండినాడు. they became friends స్నేహితులైనారు. he became a convert to that faith స్వమతమును విడిచి ఆ మతమును అవలంబించినాడు, కులముచొచ్చినాడు. It became the costom అట్లా వాడిక అయిపోయినది. It became hard ఘట్టిపడ్డది. his head became grey వాడితల నెరిసినది. It became requisite to do soఅట్లా చేయవలసి వచ్చినది. the money which it became requisite for him to pay వాడు అచ్చుకోవలసివచ్చిన రూకలు. the leather became mouldy ఆతోలు బూజు పట్టినది. when it became visible అది కండ్లకు అగు పడ్డప్పుడు. It became warm వెచ్చనేనది, కాగినది. what will * of me నాగతి యేమి, నేనేమై పొయ్యేది. To Become, v. a. తగుట, తగివుండుట, ఒప్పుట. this conduct does not * them యీ నడత వాండ్లకు తగదు. Becoming, adj. తగిన, యుక్తమైన, యోగ్యమైన, ఉచితమైన. this is not a * dress యిది తగినవేషము కాదు. Becomingly, adv. యుక్తముగా, యోగ్యముగా, ఉతముగా. Bed, n. s. పడక, శయనము, శయ్య. he went to * పండుకొన్నాడు. when the birds went to * పక్షులు పండుకొనేటప్పుడు. she was brought to * of a son మొగబిడ్డను కనింది. or * stead మంచము. or mattrass పీచుకమెత్త. or feather * పక్షి రెక్కలమెత్త. in a garden * మడి, పాదు. the * of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు. they dig a canal out of the * of the river నట్లేటినుంచి ఒక కాలవ తీసినారు. a * of rocks చాపరాయి. To Bedaub, v. a. పూసుట, చరుముట, అలుకుట. Badaubed, adj. పూయబడ్డ. Bedchamber, n. s. పడకటిల్లు. Bedclothes, n. s. మంచముమీద పరచే దుప్పట్లు, బూర్నీసులు, పడకవుడుపు. they brought her in her * దాన్ని పడకవుడుపుతోనే తీసుకొని వచ్చినారు. Bedded, adj. మంచము వేసిన. a double * room రెండుమంచములు వేసివుండేగది. Bedding, n. s. పడక, పరుపు, మెత్త. To Bedeck, v. a. అలంకరించుట, శృంగారించుట. To Bedew, v. a. తడుపుట. Bedfellow, n. s. ఒకపడకలో కూడా పండు కొనేవాడు. those children are bedfellows ఆ బిడ్డలు ఒకపడకలో పండుకొనేవాండ్లు. Bedight, adj. అలంకృతమైన. To Bedim, v. a. మబ్బుకమ్మేటట్టు చేసుట, మకిలచేసుట, మసకచేసుట. age bedimmed his eyes వృద్ధాప్యముచేత వాడికండ్లు మబ్బు కమ్మినవి. To Bedizen, v. a. శృంగారించుట, అలంకరించుట, యిది హాస్యములో వచ్చేమాట. Bedlam, n. s. వెర్రివాండ్ల ఆస్పత్రి. Bedlamite, n. s. వెర్రివాడు. To Bedrench, v. a. తడుపుట. Bedrenched adj. తడిసిన. I was * in the rain వానలో దొప్పదోగ తడిసినాను. Bedrid, adj. మంచములో పడివుండే, పడ్డపడకగా పడివుండే. Bedroom, n. s. పడకటి యిల్లు. Bedropped, adj. చుక్కలుగల. Velvet * with gold చుక్కలు చుక్కలుగా సరిగె బుట్టాలు వేసిన మొహమలు. Bedstead, n. s. మంచము. Bedtime, n. s. పండుకొనేవేళ. To Bedung, v. a. యేరిగి చెరుపుట, విష్ట వేసి చెరుపుట. the rats have bedunged all the place ఆ స్థలము నంతా యెలుకలు పింటికలు వేసి చెరిపినవి. Bedunged, adj. యేరిగి రోతగా వుండే. To Bedust, v. a. దుమ్ముచేసుట. My face is all bedusted నా ముఖమంతా దుమ్మైనది. Bee, n. s. తేనీగ. Wild black bees that make no honey తుమ్మెదలు, తేంట్లు, భృంగములు. Bees wax మడ్డిమైనము. he was as busy as a * వాడు పనిలేక క్షణమైనా వూరికె వుండలేడు. Beech, n. s. ఒక తరహా పెద్ద వృక్షము. Beechen, adj. యీ చెట్టు యొక్క కొయ్యతో చేసిన. Beef, n. s. గోమాంసము. hung * యెండిన గోమాంసము. Beefeater, n. s. (derived from beaufet a side board) రాజసముఖములో వుండే ఒక తరహా బంట్రోతు. Beefsteak, n. s. కాల్చిన మాంసము. Beechive, n. s. తేనెగూడు. Beeizebub, n. s. the name of a devil ఒక తరహా శైతానుపేరు. This is rendered భూతరాజు in SNT and BNT, while R.F.P. and the Canarese versions retain the name untranslated భేతాళుడు. Betala would perhaps be the best rendering. Been, the past of Be వుండిన. have you * there అక్కడికి పోయివుంటివా, పోయి వస్తివా. I have * to his house వాడింటికి పోయివుంటిని, పోయివస్తిని. Beer, n. s. బీరుసారాయి, దీన్ని బార్లి బియ్యపు గంజితో నేస్తారు గనక యవనురా అనవచ్చును. Beestings, or Beestings, n. s. ముర్రుపాలు, జున్నుపాలు. Beet, n. s. ఒక తరహా కందమూలము, తినడానకు యోగ్యమైన ఒక తరహా గడ్డ. Beetle, n. s. an insect వీపున పెంకున్ను రెక్కలున్నుగల పురుగు, పేడపురుగు, బొద్దెంక. or rammer దిమ్మెస. * leaf See Betel. Beeting, adj. ఉబుకుగా వుండే. * brows మిట్ట కనుబొమలు. Beeves, n. s. plu. పశువులు. To Befall, v. a. సంభవించుట, తటస్థించుట, ఘటించుట, పొసగుట, this has befallen us మాకిది సంభవించినది, తటస్తించినది. To Befit, v. a. తగుట, తగివుండుట. this does not * you యిది నీకు తగదు, యోగ్యము కాదు. Befitting, P. తగిన, యోగ్యమైన. To Befool, వెర్రివాణ్నిగా ఆడించుట. Before, prep. and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The two words ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotes I will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under ) denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being the middle syllable, the syllable నా is called కిందటి అక్షరము the following syllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii). Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు. Beforehand, adv. ముందుగానే, ముందుమించి. I was * with them వాండ్లకంటే నేను ముందు మించుకొన్నాను. Beforetime, adv. పూర్వాకాలమందు. To Befoul, v. a. మురికిచేసుట, రోతచేసుట. To Befriend, v. a. ఆదరించుట, పోషించుట, కాపాడుట, రక్షించుట. God befriends the poor దేవుడు బీదలను రక్షిస్తున్నాడు, దేవుడు బీదల పక్షముగా వుంటాడు.