విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Beg-Beseiger

విక్షనరీ నుండి

To Beg, v. n. భిక్షమెత్తుట. he was driven to * వాడికి భిక్షమెత్తుకోవలసివచ్చినది.
I begged off మన్నించవలెనని వేడుకొంటిని.

To Beg, v. a. ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట, బిచ్చమెత్తుట. he begged
the money of me ఆ రూకలకై నన్ను బతిమాలుకొన్నాడు. May I * of you to do this 
తమరు దయచేసి దీన్ని చేయవలెను. he begs his bread or he begs alms తిరిపె 
మెత్తుకొంటాడు. I begged him off అతనికి శిక్షలేక తప్పిస్తిని. I tried to beg him off but I could not వాణ్ని తప్పించవలెనని యెంతపాటుపడ్డా కాకపోయినది. I * pardon
or I beg your pardon మన్నించవలెను, క్షమించవలెను, యీమాటను గద్దించడములోనున్ను
అంటారు.

Began, the past of Begin, ఆరంభించినది.

Begat, the past of Beget కన్నది. Abraham * Isaac అబ్రహాం యిజాకును 
కన్నాడు.

To Beget, v. a. కనుట, కలగచేసుట, పుట్టించుట. this begat a doubt యిందుచేత
ఒక అనుమానము పుట్టంది. mirth begetting సంతోషజనకమైన.

Begetter, n. s. కన్నవాడు, పుట్టించినవాడు, తండ్రి.

Beggar, n. భిక్షకుడు, యాచకుడు, తిరిపెమెత్తేవాడు. or pauper దరిద్రుడు, 
అతి దరిద్రుడు. he became a * అతిదరిద్రుడయినాడు, సన్యసించినాడు. A bull beggar
బండవాడు, బండపక్కిరి.  (i.e. fakir).    

To Beggar, v. a. పేదవాణ్నిగా చేసుట దరిద్రుణ్నిగా చేసుట. this splendour
beggars all description యీడంభము వర్నింప నలవికానిది. they played 
at * my neighbour పరులను దోచుకోవడమనే ఒక తరహా కాకితాల ఆట.

Beggarliness, n. s. meanness క్షుద్ర, నీచ, తుచ్ఛత, నీచత్వము.

Beggary, n. s.పేదరికము, దారిద్ర్యము. 

Begging, n. s. తిరిపెమెత్తడము, యాచకము.

To Begin, v. n. ఆరంభమౌట, మొదలుబెట్టుట, తలపడుట. he began to run
పరుగెత్తసాగినాడు. the fruits began to ripen పండబారింది. the poem
begins with these words ఆ కావ్యము యీ మాటలతో ఆరంభమౌతున్నది.

To Begin, v. a. ఆరంభించుట, మొదలుబెట్టుట, ఉపక్రమించుట.

Beginner, n. s. ఆరంభించేవాడు, ఉపక్రమించేవాడు.

Beginning, n. s. మొదలు, ఆరంభము, ఆది, మూలము. ఉపక్రమము. In the *
మొదట,  ఆరంభములో, ఆదిని. at the very * మొట్ట మొదట. without any * or
eternal అనాది. they rose from small beginnings, కొద్దిగా వుండి గొప్ప
బడ్డారు.

Beginning, part. ఆరంభించే, మొదలుబెట్టే. matters are * to mend 
పని చక్కబడే వైఖరిగా వున్నది. the fruit is * to ripen ఆ కాయ
పండబారుతుంది.   the prophets * from Moses మోససు మొదలైన
రుషులు. Beginning at Jerusalem యరూశలేమ పూర్వకముగా, యరూశలేమ
మారభ్య. SNT.1841.

To Begird, v. a. చుట్టుకొనుట, ఆవరించుకొనుట. they begirt the town 
ఆ వూరిని ముట్టడి వేసుకొన్నారు. he was begirded or begirt with a belt
నడికట్టును కట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకు
కట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకు కట్టుకొన్నాడు.

Begone, interj. లేచిపో, ఛీపో. come * పోపో, లేచిపో. well * మంచిది లేచిపో.

Begot, the past of Beget, కన్నది.

Begotten, P||. కన్న, జనిత.

To Begrime, v. a. మురికిచేసుట, మలినము చేసుట.

Begrimed, adj. మురికి అయిన, మలినమైన, మాసిన,

To Begrudge, v. a. పోతుందని యేడ్చుట.  See To Grudge.

To Beguile, v. a. వంచించుట, మోసముచేసుట. he beguiled his time
with reading చదువుతో ప్రొద్దుపుచ్చినాడు. he beguiled her దాన్ని
వంచించినాడు.

Begun, adj. ఆరంభించిన.

Behalf, n. s. పక్షము.they spoke on his * వాడి పక్షముగా మాట్లాడినారు. 
a witness on my * నాపక్షముగా వుండే సాక్షి. he went there on
my * నాకై అక్కడికి పోయినాడు. signed by me on * of my brother
నా యన్నకై నాచేత చేవ్రాలు చేయబడ్డది.

To behave, v. n. నడుచుకొనుట, ప్రవర్తించుట. he behaved himself properly
చక్కగా నడుచుకొన్నాడు. he behaved kindly towards her దానియందు విశ్వాసముగా
నడుచు కొన్నాడు. a well behaved child సన్మార్గమైన బిడ్డ. an ill behaved
child దుర్మార్గమైన బిడ్డ.

Behaviour, n. s. నడక, నడితి, నడవడిక, ప్రవర్తన. rough * దౌర్జన్యము. manly *
పెద్ద మనిషి తనము. good * మంచినడత. he is upon his good *
యీతేప తప్పితే యిందుతో వాడి పని సరి.

To Behead, v. a. తలకొట్టుట, శిరచ్ఛేదము చేసుట.

Beheld, the past and p. of Behold. చూడబడ్డ. this was * by thousands 
దీన్ని అందరు చూచినారు.  

Behemoth, n. s. ఒక తరహా మనుబోతు, నీరేనుగ.

Behest, n. s. ఆజ్ఙ, ఉత్తరువు.

Behind, prep. వెనక, వెనకతట్టు. I found it * the box పెట్టెకు వెనకతట్టు అది
చిక్కింది. they abused him * his back వాడు లేనప్పుడు వాణ్ని దూషించినారు.
he who is * the curtain తెర కవతల వుండేవాడు, సూత్రధారి, కలహానికి
మూలముగా వుండేవాడు.

Behind, adj. వెనకతట్టుగా.

Behindhand, adv.వెనకపడి, వెనక చిక్కి. In reading he is * చదువులో వాడు
పడ్డాడు.

To Behold, v. a. చూచుట, వీక్షించుట, దర్శించుట.

Behold, interj. ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్ని
వాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.

Beholden, adj.చూడబడ్డ. or obliged ఉపకారబద్దులైన.  I am much * to him
for this అతడు చేసిన యీ వుపకారమునకు నేను నిండా బద్ధుడైనాను.

Beholdern, n. s. చూచేవాడు.

To Behove, To Behoove, v. a. తగివుండుట, యుక్తముగా వుండుట. It does
not behove you to do this దీన్ని నీవు చేయడానికి తగదు. It behoves you
to go there ణీవు అక్కడికి పోవడము యుక్తము.

Being, part of Be. ఉంటూ, అవుతూ. this * just యిది న్యాయముగా వున్నందున.
న్యాయమైనందున.   this * so యిది యిట్లావుండగా. from his * there వాడు
అక్కడ వున్నందున. from his not * there వాడు అక్కడ లేనందున. from this *
yours యిది నీది అయినందున. from this not * yours యిది నీది కానందున.

Being, n. s. existence వునికి, వుండడము. or a human * మనిషి, వరుడు. living
* ప్రాణి, జీవి, జంతువు. there was not a * in the house ఆ యింట్లో ఒక ప్రాణి
లేదు. In him we live and move and have our * ఆయనలోనే బ్రతుకుతూ మెలగుతూ
వుంటున్నాము. In a future state of * పరమందు. the supreme * దేవుడు.
a social * సరసుడు. wretched beings దిక్కుమాలిన పక్షులు. a despicable
* దుష్టహరంజాదా or state స్థితి, విద్యమానము. well * కుశలము, క్షేమము.
this does not affect his well * యిందువల్ల వాడి క్షేమమునకు ఒక వ్యత్యాసము
లేదు.

Be it so, (thus placed by Johnson) కాని; అట్లా వున్నప్పటికిన్ని.

Bel, n. s. the Indian tree called Aegle marmelos మాలూరము, శ్రీఫలము,
మారేడుపండు.

Bel, n. s. an heathen god శివుడు, భేతాళుడు.

To Belabour, v. a. దుడ్డుకర్రతో బాదుట, పులుముట.

Belated, adj. చీకటిపడ్డ. he was * వాడు రావడానికి చీకటి పడ్డది.

To Belay, v. a. తాటిని యీడ్చి జారకుండా కట్టుట. or to waylay దోచుకోవడానకై
దోవకట్టుట. or to thrash బాదుట, పులుముట.

To Belch, v. n. తేపుట, తేణుపుట. a mountain belching flames జ్వాలలను
కక్కుతూ వుండే పర్వతము.

Belch, n. s. తేపు, తేంపు, తేణుపు.

beldam, n. s. ముసిలమ్మ, యిదితిట్టుమాట.

To Beleaguer, v. a. ముట్టడి వేసుకొనుట, చుట్టుకొనుట.

Belfry, n. s. ఘంటగూడు.

Belial, n. s. శివుడు, భేతాళుడు.

To Belie, v. a. అబద్ధము చేసుట, అపదూరుపెట్టుట. he belied me నన్ను
అపదూరు పెట్టినాడు. this proof belied his story యీ దృష్టాంతముచేత
వాడు చెప్పినది అబద్ధమైపోయినది. My tongue belied my thought నేను తలచినది
ఒకటి నా నోట వచ్చినది ఒకటి.

Belied, adj. అబద్ధమైపోయిన, అపదూరుపడ్డ. he is much * or he is a thief
వాడు దొంగ అని ప్రతీతిగా వున్నది. She is much * or she killed her
child అది తన బిడ్డను తానే చంపినట్టు వదంతిగా వున్నది. he was much *
వాడిమీద నిండా అబద్ధాలు పుట్టినవి. his prediction was * by the event
యీ సంభవించిన పనిచేత వాడు చెప్పినది అబద్ధమైనది.

Belief, n. s. నమ్మిక, ఎన్నిక, మతము. In my * he is dead వాడు చచ్చినాడని
నాకు తోస్తున్నది. I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారని
నమ్మివస్తిని. In the Mahomedan * తురక మతములో. this is beyond * 
యిది నమ్మరానిది. worthy of * నమ్మతగిన. unworthy of * నమ్మరాని. my *
was that it was already sent అది మునుపే పంపబడ్డదని ఎంచియుంటిని.

To Believe, v. a. నమ్ముట, యెంచుట, తలచుట. I * he is gone పోయినాడని
తోస్తున్నది. Do you * so నీకు అట్లా తోచిందా . * me he is gone వాడు
పోయినాడు సుమీ. those who * or the faithful భక్తులు. I * so or perhaps so
బహుశా, కాబోలు, యేమో . he made * to strike her దాన్ని కొట్టినట్టు అభినయించి
నాడు. he made * to assist me నాకు సహాయము చేసే వాడివలె నటించినాడు.
this was all a make believe యిది అంతా వట్టి మాయ.

Believer, n. s. నమ్మేవాడు, భక్తుడు, మతస్థుడు.

Belike, adv. or perhaps ఒకవేళ, యేమో, కాబోలు.

Bell, n. s. ఘంట, గంట. Morris bells ఆడే వాండ్లు కట్టుకొనే గజ్జలు. dumb-bells
సాముచేసే వాండ్లు తిప్పేలోడ్లు. In poetry it signifies a flower or a bud 
పుష్పము, మొగ్గ. Bhattumurtti bears the * among the Telugu poets ఆంధ్ర
కవులలోకి భట్టుమూర్తి తిలకము. the * man ఘంటవాడు, అనగా తండోరా 
వేసేవాడు, చాటించేవాడు.


Belladonna, n. s. See Nightshade; వసనాభివంటి ఒక విషమూలిక.

Belle, n. s. సువేష రసికయువతి, అందముగల రసికురాలైన పడుచు.

Belles Lettres, n. s. సాహిత్య విద్య, అలంకార శాస్త్రము.

Belligerent, adj. యుద్ధముచేసే. the * powers యుద్ధముచేసే రాజులు.

Bellmetal, n. s. కంచు.

To Bellow, v. n. రంకెవేసుట, గర్జించుట, అరుచుట. the child was bellowing
ఆ బిడ్డ భోరుమని యేడుస్తూ వుండెను.

Bellow, n. s. or roar రంకె, గర్జన, బొబ్బలు.

Bellows, n. s. or a pair of bellows కొలిమి తిత్తి. two pair of * ఒక జోడు
కొలిమి తిత్తులు.

Belly, n. s. కడుపు. the * of a lute కిన్నెర కాయ. a * god తిండిపోతు:
this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,
pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల. a big bellied woman 
గర్భిణి. he ate his * full కడుపునిండా మెక్కినాడు. he had his * full
of fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది. 
The prisoner pleaded her * తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా 
వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదని
మనివి చేసింది.

To Belly out, v. n. ముందరికి వుబుకుట. for want of wind the sails do not 
* ఘాలి లేనందున వాడ చాపలు ముందరికి వుబకలేదు.

Belly ache, n. s. కడుపునొప్పి

Belly-band, n. s. టంగువారు.

Belly-bound, abj. మలబద్ధకముగా వుండే.

Belly-worm, యేటిక పాము.

To Belong, v. n. సంబంధించుట. To whom does this * యిది యెవరి సంబంధమైనది,
యిది యెవరిది. these people * to the temple వీండ్లు ఆ గుడి సంబంధమైనవాండ్లు
, ఆ గుడివాండ్లు. Does this house * to you యీ యిల్లు నీదా. Vengeance belongs
to God శిక్షించడము యీశ్వరుడి పని. To do this does not * to you యీ పని 
నీవు చేయవలసినది కాదు.

Belonging, part. సంబంధమైన. property * to him అతనిసొత్తు. some sheets
* to that book ఆ పుస్తకసంబంధమైన కొన్ని కాకితాలు.

beloved, adj. ప్రియమైన, యిష్టమైన. * friends, ప్రియులు. My * Lord నా 
ప్రాణనాధ. My *  ప్రియులారా. a * girl పరియురాలు. * of God దైవకటాక్షమునకు
పాత్రుడైన.

Below, prep. కింద. * the tree చెట్టుకింద.

Below, adv. దిగువగా, కిందుగా కూర్చుండినారు. this translation is far * 
the original మూలానికంటే యీ భాషాంతరమునిండా జబ్బుగా వున్నది.     Such
conduct is much * you యీ నడత నీకు యోగ్యముకాదు.    while he is here *
యీ భూమిలో వుండేటప్పడు.

Belt, n. s. నడికట్టు, దట్టి, దవాలి. a silver * round the waist worn by men
వెండిబిళ్ళల మొలతాడు. worn by women వొడ్డానము. of a Saddle టంగువారు.

Belvedere, n. s. శృంగార మంటపము. 

Belwether, n. s. పెద్దపొటేలు, మేకపోతు.

To Bely, v. a. See To Belie.

To Bemire, v. a. మురికిచేసుట, మలినముచేసుట.

To Bemoan, v. a. యేడ్చుట, ప్రలాపించుట, దుఃఖించుట, శోకించుట, విచారపడుట.
he bemoaned his father తండ్రికై యేడ్చినాడు. they bemoaned their loss
తమకు వచ్చిన నష్టానకై వ్యసన పడ్డారు.

Bench, n. s. బల్ల, బలంపీట, పదిపన్నండు   అడుగులు నిడివి ఒక అడుగు 
వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండే పలక. a stone * వొరుగుదిన్నె
a carpenter's bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice 
న్యాయాసనము. he was raised to the * అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది.
the magisterial * పోలీసు అధికార్లు. the *, the kings *, the queens
* యిది సీమలో ఒక న్యాయసభ.

Bencher, n. s. ధర్మశాస్త్ర పాఠశాలలో ముఖ్యమైన విద్యార్థి, ఒక తరహా వకీలు.

To Bend, v. a. వంచుట, మడుచుట. he bent his head తలను వంచినాడు,
వందనము చేసినాడు. he bent the bow విల్లును వించినాడు. he bent his
eyes upon them అతనిదృష్టి వాండ్లమీదికి పారినప్పుడు. he bent his
brows బొమలు ముడిపెట్టినాడు. when he bent his mind to this business
వాడి మనసునంతా యీ పనిమీద పెట్టినప్పుడు. or to subdue అణచుట.
I could not * his stubborn will వాడి మూర్ఖబుద్ధిని అణచలేను, వంచలేను.
* down thine ear O God ఓ దేవుడా ఆలకించు. he bent his way to the 
hill కొండకు పొయ్యే దారిని పట్టినాడు. he bent his course to Benares
కాశి దారిని పట్టినాడు.

To Bend, v. n. వంగుట, వాలుట. the beam bends దూలము వంగుతున్నది.
here the river bend యిక్కడ యేరు వంకరగా పోతుంది. he beat backwards
వెనక్కు వంగినాడు. he bent forwards ముందరికి వంగినాడు. his mind did
not bend under all this trouble యింత తొందరకు వాడి మనసు చలించలేదు.
the branches * over the tomb ఆ కొమ్మలు గౌరిమీదికి వాలుతవి. or to yield 
లోబడుట.

                         
Bend, n. s. వంపు, వంకర. here the street makes a * ఆ వీధి యిక్కడ 
తిరుగుతుంది.

Bending, n. s. వంపు, వంకర, తిరుగుడు.

Bending, adj. వంపైన, వంగే, వాలే.

Beneath, adv. కింద, అడుగున.

Beneath, prep. తక్కువ, నీచత. he thought it * him to sell the horse,
so he gave it away తన గుర్రమును అమ్మడము తక్కువ అని వూరికె 
యిచ్చి వేసినాడు.

Benedicite, n. s. దీవించండి, దీవన, ఆశీర్వాదము.

Benedict, n. s. నాటకములౌ వుదాహరించబడ్డ ఒకని పేరు, పెండ్లి చేసుకో 
పొయ్యేవాడు. when I knew him he was a * నేను అతణ్ని యెరిగినప్పుడు
పెండ్లి చేసుకోవలెనని వుండినాడు.

Benedictine, n. s. ఒక తరహా పాదిరి.

Benediction, n. s. దీవన, ఆశీర్వాదము.

Benefaction, n. s. ఉపకారము, దానము. 

 benefactor, n. s. ఉపకారి. * of a temple కైంకర్యపరుడు.

Benefactress, n. s. ఉపకారి, ధర్మముచేసేటిది.

Benefic, n. s. గుడి మాన్యము, శ్రోత్రియము, గుడికి వచ్చే వరుమానము.

Beneficence, n. s. ఉపకారము, అనుగ్రహము, కృప, దాతృత్వము. a man of *
దాత.

Beneficent, adj. ఉపకారియైన, దాతయైన. the * ఉపకారులు, ధర్మాత్ములు.

Beneficently, adv.  ఉపకారిగా, ధర్మాత్ముడుగా, దాతగా.

Beneficial, adj. సఫలమైన, సార్ధకమైన, ప్రయోజకమైన. Bathing is * to the
health స్నానము చేయడము వొంటికి అనుకూలము.

Beneficially, adv. సఫలముగా, సార్ధకముగా.

Beneficiary, n. s. గుడిమాన్యమును అనుభవించే పాదిరి.

Benefit, n. s. ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.
what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers 
many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. 
he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదని
వాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలో
వచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,
కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభము
దొరికినది.

To Benefit, v. a. ప్రయోజన పరచుట, లాభముచేసుట, హితముచేసుట. this punish
ment benefited them యీ శిక్ష వాండ్లకు లాభమైనది. 

To benefit, v. n. ప్రయోజనమౌట, లాభమౌట, హితమౌట.

Benefited, adj. ప్రయోజనపడ్డ, ఫలమును పొందిన.

Benevolence, n. s. ధర్మ గుణము, ఉపకారము, దయ, కనికరము, ధర్మము.
between man and wife దాంపత్య ధర్మము.

Benevolent, adj. ధర్మగుణముగల, దయాళువైన, ఉపకారియైన. * mind చల్లని హృదయము.

Bengal, n. s. బంగాళాదేశము. a * newspaper బంగాళాదేశములో అచ్చువేశిన
ప్రసిద్ద పత్రిక. * letters అక్కడనుంచి వచ్చిన జాబులు. * rice బంగాళా
బియ్యము. ( never Bengali rice) .

Bengalee, adj. బంగాళాదేశ సంబంధమైన. a * బంగాళా దేశస్థుడు. a newspaper 
గౌళప్రసిద్ధ పత్రిక. * letters గౌడ అక్షరాలు. the * language గౌడ భాష. the * 
character గౌడ లిపి.

Benighted, adj. అస్తమించిన, వివేక శూన్యులేన, మూఢులైన, జడులైన. the * traveller   నడిదోవలో చీకటిబడ్డ బాటసారి, the * population పామర జనము. the 
* presidency అంధకార పట్టణము.

Benign, adj. దయాళువైన, అనుకూలమైన, హితమైన. or wholesome     
ఆరోగ్యకరమైన.

Benignity, n. s. దయారసము, కృప, దయాళుత్వము.

Beningly, adv. దయగా, కృపగా.

Benison, n. s. దీవెన, ఆశీర్వాదము.

Benjamin, n. s. (benzoin) సాంబ్రాణి. or cloak గొగ్గె, భైరవాసము.

Bent, n. s. or crookedness వంపు. or tendency తత్పరత, ఆసక్తి, ఇచ్ఛ,
అభిలాష, నిశ్చయము. he has a * towards making mischief వాడికి 
దుర్మార్గమందే ఆసక్తి.

Bent, adj. వంగిన, వంపైన, వంకరైన. the spear was * ఆ యీటె వంకరగా వున్నది.
he was * with age వాడికి వృద్ధాప్యము చేత గూనివంగినది. the silver plate
is * or indented ఆ వెండితట్ట నొక్కుపోయినది. or inclined తత్పురుడైన, 
ఆసక్తుడైన. he is * upon quarrelling జగడానికి సంకల్పము చేసుకొన్నాడు.
Being * upon injustice అన్యాయానకు ఆలయమై he is * on doing justice
న్యాయ తత్పరుడై వున్నాడు. Are you * on ruining yourself?  నీకు నీవే 
చెడిపోవలెనని నీకు సంకల్పమా?

To Benumb, v. a. తిమురుపట్టేటట్టు చేసుట, కొరడు పారేటట్టు చేసుట.
the cold benumbed  him చలిచేత వాడివొళ్ళు మానైపోయినది. Tarror Benumbed
her faculties భయము చేత మానై పోయినది.

Benumbed, adj. తిమురుపట్టిన, కొరడుపారిన. his hand was * by the blow దెబ్బచేత వాడిచెయ్యి మానై పోయినది.

Benzoin, n. s. సాంబ్రాణి.

To Bepraise, v. a. వెర్రి శ్లాఘన చేసుట.

To Bequeath, v. a. మరణశాసన పూర్వకముగా యిచ్చుట. My father bequeathed his
property to me మాతండ్రి తన ఆస్తిని నాకు వ్రాసినాడు. In going away he 
bequeathed me a number of old accounts వాడుపోతూ యీ పాత లెక్కలను 
నా తలమీద వేసి   పోయినాడు.

Bequeathed, adj. మరణశాసన పూర్వకముగా పెట్టిన.

To Bereave, v. a. or Rob విహీనపరచుట లేకుండా చేసుట, దోచుకొనుట. he was bereaved
of his children వాడు బిడ్డలను కోలు పుచ్చుకొన్నాడు. this affliction bereaved him of his senses యీ వ్యాకులము చేత వాడికి తెలివి తప్పింది. this bereft him of his life యిందువల్ల వాడి ప్రాణము పోయినది.

Bereavement, n. s. వహీనత, కోలుపోవడము.

Bereft, adj. వహీనమైన, కోలుపడ్డ.

Bergamot, n. s. ఒక తరహాపండు. a fragrant water పన్నీరు వంటి వకనీళ్ళు.

To Berhyme, v. a. అపారముగా వర్నించుట.

Beri-beri, n. s. (paralytic rheumatism) వుబ్బువాయువు, తిమురువాయువు:
See proof in Telugu, apud Malcolmson On Beri beri page 4-5.

Berry, n. s. కాయ, పండు, అనగా కలిసె గొంజి మొదలైనటువంటి చిన్న చిన్న 
పండ్లు. brows as a * చామని చాయగల. Berry-berry See beri-beri.

Berth, n. s. or lodgement స్థానము, పట్టు. or bed పడక.

Beryl, n. s.or  fine emerald  గరుడపచ్చ. దీన్ని పీరౌజా అని అంటారు.
See Madras Journal (1840) XII. 171.

To Bescribble, v. a. గిరుకుట.

To Beseach, v. a. వేడుకొనుట, బతిమాలుకొనుట, అడుక్కొనుట.

Beseechings, n. s. వేడుకోళ్ళు.

To Beseem, v. a. తగుట, ఒప్పుట, యోగ్యముగా వుండుట. this does not * you 
యిది నీకు తగదు.

Beseeming, adj. తగిన, ఒప్పిన, యోగ్యమైన. this is not * యిది యోగ్యము కాదు.

To Beset, v. a. చుట్టుకొనుట, ఆవరించుకొనుట, పరివేష్టించుకొనుట. they * the
town ఆ వూరిని ముట్టడివేసుకొన్నారు. he is * with difficulties వాడికి
యెటూ సంకటముగా వున్నది.

Beset, adj. చుట్టుకోబడ్డ, పరివేష్టితమైన. he was hard * వాడు చాలా యిబ్బంది
పడ్డాడు.

Besetting, adj. చుట్టుకొన్న, అనుసరించే, సహజమైన. drunkenness is their 
* sin తాగుబోతు తనము వాండ్లకు వుండే సహజమైన రోగము. Inventing
new phrases is the * sin of dictionary writers కొత్తవాక్యములను కల్పించడమనేది
నిఘంటుకర్తలకు వుండే సహజమైన దుర్గుణము.

Beshrew it!, interj. దాని తలపుండు పగల, దాన్ని తగలపెట్ట.

Beside, Besides, prop. పక్కన, చేర్పున. She lay down beside him 
అది వాడిపక్కన పడుకొన్నది. I was then beside the house అప్పుడు నేను ఆ
యింటి పక్కన వుంటిని. beside himself స్వాధీనము తప్పిన, he must have been
beside himself to do this అట్లా చేసినందుకు వాడికి తెలివి తప్పివుండవలసినది.
Are you beside yourself? నీకేమి తిక్కపట్టినదా?

Beside, besides, adv. గాక, యింతేగాక, వినా. three besides this 
యిదిగాక మూడు. three besides him అతనుగా ముగ్గురు. besides this 
యిదివినా.

To besiege, v. a. ముట్టడి వేసుట, నాలుగు తట్లా చుట్టుకొని తొందర బెట్టుట.
Visitors besieged his house దర్శనానికై వచ్చివాడియింటిని చుట్టుకొని వున్నారు.

Besieger, n. s. ముట్టడి వేసేవాడు.