విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Besmear-Billowy
స్వరూపం
To Besmear, v. a. చరుముట, పట్టించుట, అలుకుట, పూసుట. Besmeared, adj. చరిమిన, పట్టించిన, అలికిన, పూసిన, Besmirched, adj. మాసిపోయిన, మురికయైన, పొగచూరిన. Besmutted, adj. మూసిన, మురికయైన, పొగచూరిన, Besom, n. s. చీపరకట్ట, పొరక. Besotted, adj. తెలివితప్పిన, స్మారకములేని. how * he was to do this దీన్ని చేయడానికి వాడకేమి జడత్వము పట్టింది. * ignorance ఒట్టి అవివేకము. Besought, past and part of Beseech, వేడుకొన్నది, వేడుకోబడ్డ, బలిమాలుకోబడ్డ. he was * by us నాచేత వేడుకోబడ్డాడు. Bespangied, adj. మెరిసేవాటిచేత అలంకరించబడ్డ. the awning was * with gold ఆకురాళానికి బంగారు చుక్కలుపెట్టి కుట్టివున్నది. the sky is * with stars ఆకాశము చుక్కలచేత మెరుస్తున్నది. To Bespatter, v. a. మురికి చేసుట. I was bespattered with ink నామీద యింకి చెదిరింది. the horse gallopping by,bespattered me with mud ఆ గుర్రము నా పక్కగా పరుగెత్తినందున నా బట్టలమీదంతా బురద చెదిరించి. they bespattered his character వాణ్ని దూషించినారు. they stabbed the child in my arms and my clothes were bespattered with blood నా చేతిలో వుండిన బిడ్డను పొడిచినందున నా బట్టలమీద నెత్తురు చెదిరి మరకలైనవి. he was bespattered with abuse వాణ్ని నిండా తిట్టినారు, దూషించినారు. To Bespeak, v. a. మాట్లాడి పెట్టుకొనుట. this is the table which you bespoke yesterday నిన్న నీవు మాట్లాడి పెట్టుకొన్న మేజా యిదేను. to betoken సూచించుట, తెలుపుట. this hat bespeaks rain యీ యెండను చూస్తే వాన వచ్చేటట్టు వున్నది. his coming bespeaks good to you అతడు రావడము నీకు శుభసూచకముగా వున్నది. this bespeaks him your friend యిందువల్ల వాడు నీకు హితుడైనట్టు తెలుస్తుంది. Bespread, adj. పరచిన. the table was * with dainties ఆ మేజా ఆహారములచేత పరచబడి వుండెను. To Besprinkle, v. a. చిలకరించుట. To Besputter, v. a. ఉమినీరు తుంపర తుంపరలుగా ఉమియుట. the child besputtered me ఆ బిడ్డ నా మీద తుంపర తుంపరలుగా వుమిసినాడు. In reading he besputtered me వాడు చదవడములో నా మీద తుంపరలు పడ్డవి. Best, adj. సర్వోత్తమమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. Of all these horses this is the * ఆ గుర్రములలో యిది సర్వోత్తమమైనది. she is the * of women అది స్త్రీతిలకము, నారీరత్నము. I di my * to please him వాడికి సంతోషము రావడానకై నాచేతనైన మట్టుకు చేసినాను. to the * of my knowledge నేనెరిగిన మట్టుకు. I did it to the * of may power దాన్ని నా శక్తివంచన లేకుండా చేసినాను. to the best of my belief నాకు తోచినంతల్లో. I made the * of my way there అక్కడికి నాచేతనైన త్వరగా పోయినాను. you must make the * you can of this వుండేదాన్ని పెట్టుకొని నీచేతనైన మట్టుకు సాగవేసుకో వలసినది. he made the * of a bad bargain వున్నదాన్ని పెట్టుకొని యధోచితము గడుపుకొన్నాడు. you have the * of it జయించినావు, గెలిస్తివి. Best, adv. ఉత్తమముగా. he wrote it * అందరి కంటే వీడు బాగా వ్రాసినాడు. he came off * జయించినాడు. I like this * యిది నాకిష్టము. For some reason * known, to himself,he carried my horse away నాగుర్రాన్ని తీసుకొని పోయినాడు, ఆ హేతువ వాడికే తెలియవలెను. he came off second * వోడిపోయినాడు. Bestained, adj. కరయైన, మరకైన, మురికైన. To Bestead, v. a. to supply, to profit ఫలపరచుట. It bestead me nothing my being his brother అతడికి తమ్ముడైనందున కేమి ఫలము లేదు. he was sore * వాడు నిండా యిబ్బంది పడ్డాడు, సంకటపడ్డాడు. Bestial, adj. పశుప్రాయమైన, రసాభాసమైన. * drunkenness చెడ్డ తాగుబోతు తనము. Bestiality, n. s. filthiness పశుప్రాయత, రోత, రసాభాసము. To Bestir, v. a. త్వరపడుట. you must * yourself నీవు త్వరపడవలసింది, నీవు త్వర చేయవలసింది. To Bestow, v. a. యిచ్చుట, దయచేసుట. he bestowed his name on the child ఆ బిడ్డకు తనపేరు పెట్టినాడు. to lay up చేర్చుట. he bestowed the goods in the house వాడు ఆ సామానులను ఆ యింట్లో చేర్చి పెట్టినాడు. he bestowed his daughter on me తన కూతిరిని నాకిచ్చినాడు. he bestowed his attention on this వాడిమనసు నంతా దీనిమీదపెట్టినాడు. he bestowed no pains on this యిందునగురించి వాడు ప్రయాస తీసుకోలేదు. Bestowal, n. s. యివ్వడము, ఈవి. Bestowern, n. s. యిచ్చేవాడు, త్యాగి. To Bestride, v. a. పంగటి కాళ్ళ సందున వుంచుకొనుట. or ride on యెక్కుట. he bestrid the horse గుర్రము మీదికి యెక్కినాడు. In drawing water he bestrid the well యీ కట్టమీద ఒక కాలు ఆ కట్టమీద ఒక కాలు పెట్టుకొని బావిలో నీళ్ళు చేదినాడు. Bet, n. s. పందెము, పందెములో వొడ్డినపద్డు, పణము. he laid a * పందెము వేసినాడు. Bet, past of Beat, కొట్టినది. he * or did beat కొట్టినాడు యిది ప్రాచీనమే. To Bet, v. a. పందెము వేసుట, పందెము పెట్టుట, వొడ్డుట. To Betake, ones self to v. a. ఆశ్రయించుట, అనుసరించుట, అవలంబించుట. he betook himself to his old trade తన మునుపటివర్తకమునే అవలంబించినాడు. he betook them or themselves to the hill కొండకు పారిపోయినారు, కొండను ఆశ్రయించినారు. he betook himself to work తనపనికి తాను పోయినాడు. I betook myself to my room నాగదికి నేను వెళ్ళితిని. they betook themselves to the king రాజును శరణుజొచ్చిరి, ఆశ్రయించినారు. he betook himself to flight పరుగెత్తసాగినాడు. Betel, n. s. (or Areca, Paun) తమలపాకు, తాంబూలము. * nut పక్క. a * garden ఆకుతోట. the * vine తమలపాకుతీగె. * nut scissors or nippers to cut the nut ఆడ కొత్తు, పోకొత్తు. * nut box అడపము, సంబెళ. Four sorts are called వొప్పులు, పానారము, ఆరంగాలు and వలగ్రము. To Bethink, n. a. తలచుకొనుట. he bethought him of this దీన్ని తలచుకొన్నాడు. To Betide, v. a. సంభవించుట, తటస్థించుట, ఘటించుటు, కలుగుట. I cannot tell what will * me నాగతి యేమో నాకు తెలియదు. No evil betrides you నీకు ఒక కీడున్ను రాదు. Betimes, adv. పెందలకాడ, సమయానికి, వేళకు. Betle, n. s. See Betel. To Betoken, v. a. సూచించుట, సూచనచేసుట, ముందుగా తెలియచేసుట. this wind betoken rain యీ ఘాలి వానను సూచిస్తుంది. Betook, the past of Betake. Betorsed, adj. అల్లాడే, డోలాయమానమైన. To Betray, v. a. చూపించి యిచ్చుట శత్రువులకు చూపించి యిచ్చుట, బయటవేసుట, రట్టుచేసుట. they betrayed him to his enemies వాణ్ని శత్రువులకు పట్టియిచ్చినారు. he betrayed his love వాడి మోహము బయటపడ్డది they betrayed their trust వాండ్లు ద్రోహము చేసినారు. he betrayed the secret ఆ రహస్యమును రట్టు చేసినాడు. బయటవేసినాడు. she betrayed herself by laughing అది నవ్వినందున అక్కడ దాగి వున్నదని బయటపడ్డది. Betrayal, n. s. శత్రువులకు చూపించి యివ్వడము, బయట వేయడము, రట్టుచేయడము. Betrayed, adj. శత్రువులకు చూపించి యిచ్చిన, బయట పెట్టిన, రట్టుచేసిన. he was * into these expressions యీ మాటలు వాణ్ని యెరగకుండా బయట వచ్చినవి, వాడినోరు జారి వచ్చినవి. Betrayer, n. s. శత్రువులకు చూపించి యిచ్చేవాడు, ద్రోహి. To Betroth, v. a. పయడిముడుపు చేసుట, ప్రధానము చేసుట, నిశ్చితార్థము చేసుట. Betrothed, adj. పయిడిముడుపు చేసిన, నిశ్చితార్థము చేయబడ్డ. Betrothment, n. s. పయిడిముడుపు, నిశ్చితార్థము. Better, adj. మంచి, మేలైన, వాసియైన. for your * security నీకు మరీభద్రానకు. * times will come మంచికాలము వచ్చును. they * you wirte the * he will be please నీవు యెంతబాగా వ్రాస్తే ఆయన అంత సంతోషపడును. than కంటే, కన్నా. this is * than that దానికంటే యిది వాసి, యిదిమేలు. he remained there * than two years అక్కడ రెండ్లేండ్లకన్నా అధికముగా వుండినాడు. better and better మేలు మేలు, శుభము శుభము, మరీస్వారస్యము. he got the * of me నన్ను మోసపుచ్చినాడు, నన్ను గెలిచినాడు. you have changed it but not for the * నీవు దాన్ని మాచి ్నావు గాని దానివల్ల విశేషము యేమిన్ని లేదు. he was going there but thought * of the matter పోవలెనని వుండినాడు గాని మళ్ళీ యేమో తలచుకొని మానుకొన్నాడు. he and his * half వాడున్ను వాడి యిల్లాలున్ను, he took it for * or worse నయనష్టానికి బాధ్యపడి దాన్ని యె త్తుకొన్నాడు. he thinks himself my betters నాకంటే తానే ఘనుడు అనుకొటాడు. Prov. XII.9 Better is he & c. కూటికి లేక గర్వపడేవానికన్న ఒకపనివాడుగల రోసుబడివాసి. Better, n. s. he who lays a bet పందెము వేసేవాడు. Better, adv. బాగా, చక్కగా. for your * understanding నీకు బాగా తెలియ గలందులకు. the more you study the better నీవు యంతబాగా చదివితే అంత మంచిది. So much the * మరీమంచిది, మరీవాసి, మరీమేలు. She is * దానికి వొళ్ళు కుదురుగా వున్నది, వాసిగా వున్నది. he is * now వాడికి యిప్పుడు వాసి, వాడికి వొళ్ళు కుదురు ముఖముగా వున్నది. you had * do it నీవు దాన్ని చేస్తే బాగా వుండును. * die than do this దీన్ని చేయడానికంటే చావడము మేలు. To Better, v. a. గుణపరచుట, ఫలపరచుట. he did this hoping to * himself తాను బాగుపడవలెనని దీన్ని చేసినాడు. bathing bettered his health స్నానము వాడికి ఆరోగ్యము చేసినది. Bettermost, adj. ఉత్తమమైన, ఘనమైన. Better, n. s. పందెము వేసేవాడు. Betty, n. s. తలుపు పెళ్ళగించే ఒక తరహా ఆయుధము. Between, prep. నడమ, మధ్య, సందున. Is there any difference * this and that దీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము. the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతము did you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the two houses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరి లోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలో మీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య. Betwixt, prep. నడమ. See Between. Bevel, n. s. ఒకతరహా కొలిచే ఆయుధము. Beverage, n. s. పానము, పానకము, పానయోగ్యమైన, రసద్రవ్యము. their only * is milk వాండ్లు తాగేది పాలే. Bevy, n. s. సమూహము, పక్షిసమూహము, స్త్రీసమాజము. To Bewail, v. a. దుఃఖించుట, శోకించుట, విచారపడుట, అంగలార్చుట. he bewailed his son, or his son's fate కొడుకు చచ్చినదానికి అంగలార్చినాడు. To Beware, v. n. ఎచ్చరికగా వుండుట, భద్రముగా వుండుట, జాగ్రత్తగా వుండుట. you must * of eating fruit in fever జ్వరములో నీవు పండ్లు తినబోతావు భద్రము.you must * of telling him వాడితో చెప్పేవు సుమా, భద్రము వాడితో చెప్పబోయ్యేవు. Bewailing, n. s. యేడ్చు, మొర, రోదనము. Beware, interj. భద్రము, జాగ్రత్త. To Bewilder, v. a. చీకాకుపరచుట, కలవరపెట్టుట, దిగ్బ్రమపరచుట, గాబరాచేసుట. Bewildering, adj. చీకాకుపరచే, దిగ్భ్రమపరచే. Bewilderment, n. s. చీకాకు, చిక్కు, దిగ్భ్రమ. of love మోహనపరవశత్వము. Ellanna, 3. 200. To Bewitch, v. a. శూన్యముచేసుట, తోడుబోతుపెట్టుట. to charm పొక్కించుట, మోహింపచేసుట, వలపించుట, వశ్యముచేసుట. Bewidered, adj. చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ, గాబరాపడ్డ. Bewitched, adj. శూన్యము పెట్టబడ్డ, మోహించిన, మరులుకొన్న, పిచ్చిపట్టి దీన్ని చేసినావు. Bewitching, adj. మనోహరమైన, వలపించే. a * girl మోహింపచేసే స్త్రీ. * looks వలపుచూపులు. Bewitchingly, adv. మనోహరముగా, వలపించేటట్టుగా. To Bewray, v. a. విశ్వాసఘాతము చేసుట, చూపించి యిచ్చుట, బయిట పెట్టుట, ద్రోహము చేసుట. Bey, n. s. టర్కీషువాండ్లలో వుండేదొర, సర్దారు. Beyond, prep. and adv. అవతల, మించి, అతిశయించి. * the river యేటికి అవతలు. * this యిదిగాక. they went * వాండ్లు మించి పోయినారు. this disease is * cure యీ రోగము కుదురేది అసాధ్యము. he is now * hope అతను బ్రతుకుతాడని ఆశ లేదు. lost * all reddress బొత్తిగా చెడిపోయిన. * all bounds అమితముగా. * doubt నిస్సందేహముగా. * what is herein stated యిందులో చెప్పినదిగాక. they went * (or over-reached) him వాణ్ని మోసబుచ్చిరి . to go * or surpass మించుట. or defraud మోసము చేసుట. the sum that remained * the debt అప్పుపోగా నిలిచినరూకలు. he went * his depth నీళ్ళలో నిలువులోతును మించిపోయినాడు. It is * my power అది నాశక్తికి మించి వున్నది. * all dispute నిర్వివాదముగా. * measure అపారముగా. Bezel, n. s. వుంగరపుదిమ్మె, వొమ్మచ్చు, వుంగరపుగూడు. Bezoar, n. s. పామురాయి, తేలురాయి, విషహారియనే పేరుగల ఒకరాయి, గోరోచనము. Bias, n. s. పక్షము, పక్షపాతము, వొగ్గు. I saw his * in their favor అతడు వాండ్లతట్టు వొరిగివుండేటట్టు తెలిసింది. the * changes the direction of the bowl ఆగుండు కొంచెము వంకరగా వుండుటవల్ల సరిగ్గా పారలేదు. To Bias, v. a. వొగ్గుట, వొరుగుట, పక్షముగా వుండేటట్టుచేసుట, పక్షపాతముగా వుండేటట్టుచేసుట. Relationship may * a judge బంధుత్వముచేత న్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు. he was biassed in their favour అతను వాండ్ల యందు పక్షపాతముగా వుండినాడు. Bib, n. s. బిడ్డరొమ్ముగుడ్డ, అనగా బిడ్డలరొమ్ముబట్టలకు మురికి తగలకుండా మెడకు కట్టి రొమ్మున వేలాడవిడిచేగుడ్డ. Bibber, n. s. Wine bibber తాగుబోతు. Bibbing, n. s. తాగుబోతుతనము. Bible, (Literally The books) గ్రంధములు. The new Sanscrit edition says ధర్మపుస్తకము. other versions say ఖ్రీస్తుమత గ్రంధము. Names of the Books in the Bible: as rendered in the Sanscrit. Canarese, Tamil, and Bengali versions. OLD TESTAMENT ఆదిభాగము, పాతవొడంబడిక. NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT). Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండ Exodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండో కాండ. Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము. Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము. Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము. Joshua యెహోశూయ, యేశవా పుస్తకము. Judges విచార కర్తృ వివరణ, న్యాయాధి పతుల పుస్తకము. Ruth రూథ, రుత్తె. Sam. శిమూయేల్, శమువేల్. Kings రాజావళి, రాజులు. Chronicles వంశావళి దినముల ఆగమము. Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు. Job అయాబు, యోబుడు. Psalms గీతము, సంగీతములు, కీర్తనములు. Proverbs హితోపదేశము, సాలోమని వాక్యములు, సామితెలు. Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట, శలోమోన కీర్తనము. Isaiah యిశయియ, యోశాయా. Jerem యిరిమియి, యేరేమియ. Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము. Ezekiel యిశికేయల్, యెశేకియే. Daniel దానీయెల్. Hosea హేశెయి. Joel యోయెల్. Amos ఆమొస్. Obad. ఉబియ. Jonah యూనస్. Micah మీఖా. Nahum నహూం Habak హబక్కుక్. Zeph. సిఫనియ. Haggai హగేయ Zechariah సిఖరీయరు. Malachi మలాఖి. Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT). Matthew మథి, మత్తేయు. Mark మార్క, మార్కు. Luke లూక, లూకా. John యోహ ్ ,యోవాను. Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు. Romans రౌమీయ, రౌమర, Cor. కరింతీయ, కోరింధల. Gal. గలాతియ. Revelations ప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపు పుస్తకము. Biblical, adj. బైబిలుసంబంధమైన. Bibliographer, n. s. గ్రంధములు, వ్రాసేవాడు, యిది కాకుండా, ఆయా గ్రంధముల యొక్కవుత్పత్తి స్థితులను వివరించి వ్రాసేవాడు. Bibliomania, n. s. పుస్తకాలపిచ్చి, ఒట్టిపుస్తకాల ఆడంబరము. Bibulous, adj. సీల్చే, యీడ్చే. a brick is * యిటికరాయి నీళ్ళను యీచ్చుకొంటుంది. * paper తడిని పీల్చేకాకితము. Bice, n. s. ఆకాశనీలవర్ణము. To Bicker, v. n. పోరుబెట్టుట, కలహమాడుట. Bickering, n. s. కలహము, రచ్చ, పోరాటము. To Bid, v. a. to command ఆజ్ఞాపించుట. he bade them go వాండ్లను పొమ్మన్నాడు. he bade me be of good ఆయన నన్ను ధైర్యముగా వుండుమనెను. to invite పిలుచుట. he bade us to dinner మమ్మున భోజనానికి పిలిచినాడు. to offer యిస్తాననుట. he * ten rupees for this at auction యేలములో దీన్ని పదిరూపాయలకు అడిగినాడు. he bade us farewell మాకు దండము బెట్టిపోయి వస్తానన్నాడు. he bade adieu to the world లోకానికి ఒకదండము పెట్టినాడు, అనగా సన్యసించినాడు, చచ్చినాడు. he bade, them defiance వాండ్లను తిరస్కరించినాడు. She bids fair to be a beauty యిది పెద్దపెరిగితే, అందకత్తెగా వుండును. he bids fair to be a good scholar వీడు ముందరికి మహాపండితుడుగా వుండబోతాడు. Bid, the past of Bid, See to Bid. Do as you are bid ఆజ్ఞ ప్రకారము చెయ్యి. cannot you do as you are bid? చెప్పిన ప్రకారము చెయ్యి. Bid, n. s. ఏలములో అడగడము. Bidden, adj. ఆజ్ఞాపించబడ్డ, పిలువబడ్డ. Bidder, n. s. ఏలములో అడిగేవాడు. Bidding, n. s. ఆజ్ఙ, పిలవడము, ఏలములో అడగడము. To Bide, v. n. వుండుట. * here a while యిక్కడ కొంచెము సేపు వుండండి. To Bide, v. a. సహించుట, వోర్చుట, పడుట, యెదురుచూచుట. I* my time నేను సమయాన్ని నిరీక్షిస్తున్నాను. you must * God's time దేవుడు నిర్ణయించినకాలము వచ్చేవరకు తాళుకోవలెను. Biennial, adj. రెండు సంవత్సరాలకు ఒకమాటుసంభవించే. a * lease రెండేండ్లకు ఒకసారి చేసే గుత్త. Bier, n. s. పాడె, కటుక, శవవాహనము. Biestings, n. s. జున్నుపాలు, చీముపాలు. Bifucated, adj. పంగలుగా వుండే, పాయలుగా వుండే. a * branch పంగలకొమ్మ. Big, adj. పెద్దడైన, గొప్పైన, లావైన. a * dog పెద్దకుక్క. you are bigger than me నా కంటే నీవు పెద్దవాడవు. after the child grew big ఆబిడ్డ పెద్దపెరిగినతరువాత. as * as a cocoanut టెంకాయంత. he used * languge అహంకరించి మాట్లాడినాడు, గర్వముగా మాట్లాడినాడు. She has a * belly: or she is * with child అది కడుపుతోవున్నది. * with hope I visited him నిండా ఆశతో అతనిదర్శనము చేసుకొంటిని. Bigamist, n. s. రెండు పెండ్లాలుగలవాడు. Bigamy, n. s. పెండ్లిమీద పెండ్లిచేసుకోవడము. Bigbellied, adj. కడుపుతోవుండే, గర్భిణియైన. Biggin, n. s. a cup గిన్నె. a child's cap బిడ్డకళాయి. Bight, n. s. ఉచ్చు, ఉరి. Bigly, adv. గర్వముగా, అహంకారముగా. Bigness, n. s. లావు, వొమ్ము, వురుపు. Bigot, n. s. దురభిమాని, మతవైరి, మూఢత్వముగా తనమతమే మతమనేవాడు, మతములో బహుదురాగ్రహము గలవాడు. they are great bigots అన్య మతస్థుల ముఖము చూడకూడదనే వాండ్లు. Bigoted, adj. దురభిమానియైన, మతవైరముగల, తనమతమే మతమనే. Bigotry, n. s. మతవైరము, మతాగ్రహము, స్వమతవిషయకదురభిమానము. Bilberry, n. s. కోరిందపండ్లు, నల్ల గుత్తిపండ్లు, వీటివంటి ఒక తరహా అడివి చిన్నపండ్లు. Bilboes, n. s. సంకెళ్ళు, బొండకొయ్య, బొండమాను. Bile, n. s. పిత్తము, పైత్యము. this stirred his * యిందుచేత, వాడికి ఆగ్రహము వచ్చినది. Bile, n. s. a boil పుండు, గడ్డ. To Bilge, v. n. వూరుట, చెమర్చుట, అనగా వాడలోకి నీళ్ళువూరుట. Bilge water వాడలోకి వూరి కంపు కొట్టే నీళ్ళు. Biliary ducts, n.s. పైత్య సంబంధమైన నరములు, పిత్తనరములు. Bilious, adj. పైత్య సంబంధమైన. * attack పిత్తవికారము. * vomiting పైత్య సంబంధమైన. * attack పైత్యపువాంతి. a * fever పైత్యజ్వరము. the * humour పైత్య ప్రకృతి. To Bilk, v. a. మోసముచేతుట, పితలాటకము చేసుట. Bill, n. s. a bird's * ముక్కు . or account లెక్క, చీటి. a * of exchange హుండి. a * of inditement ఫిర్యాదు. in parliament మనివి, అర్జి. the * of rights యిది ఒక చట్టము పేరు. * of leading సరుకులపట్టి. * of mortality చచ్చినవాండ్ల పట్టి, ఖానెసుమారులెక్క. * of fare భోజన పదార్థములపట్టి. * of Sale విక్రయచీటి. or advertisement ప్రకటన కాకితము. a knife for hedging పాళకత్తి, మచ్చుకత్తి. Billet, n. s. చీటి. of wood వంట చెరుకు, మొద్దుకట్టె. a ticket for quartering soldiers విడిది చీటి, అనగా సోజరుకు ఫలానివాడు, యింట్లో చోటు యివ్వవలసిందని యిచ్చిన చీటి. a love letter నాయకుడు నాయకికి వ్రాసుకొనే చీటి. To Billet, v. a. సోజర్లుకు చోటిమ్మని చీటీ వ్రాసుట. he billeted four soldiers upon me నలుగురు సోజర్లుకు నా యింట్లో చోటిమ్మని వ్రాసినాడు. Billet-doux, n. s. a love letter నాయకుడు నాయకికి వ్రాసుకొనే చీటి. Billiards, n. s. దంతపుగుండ్లాట, యిందులో నిమ్మపండ్లంత రెండు తెల్ల దంతపు గుండ్లున్ను ఒక యర్ర గుండున్ను వుంటుంది. వీటిని తోసేకర్ర Cue or Mace అనబడుతున్నది. Billingsgate, n. s. యిది లండన్ పట్టణములో ఒక బజారుపేరు. * langauge బండుబూతు. Billion, n. s. నూరు కౌట్లు. Billow, n. s. అల, సముద్రపు అల. Billowy, adj. అలలుగల.