విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Blight-Bluster
స్వరూపం
Blight, n. s. ruin చెరుపు, నాశనము. of plants తెవులు, చీడ, కాటుక. To Blight, v. a. చెరుపుట, కాటుక బట్టి చెరుపుట. Blighted, adj. చెడిన, కాటుకబట్టిచెడిన, చీడబట్టిచెడిన. he mourned his * hopes తన కోరిక భంగమైనందుకు యేడిచినాడు. Blind, గుడ్డి, అంధ. he became * వాడికి కండ్లు పోయినవి, గుడ్డివాడైనాడు. * at night రేచీకటిగల. a * man గుడ్డివాడు, అంధుడు. a * woman గుడ్డిది, అంధకురాలు. Men of * heart మూఢులు, జడులు, అవివేకులు. a * alley మట్టు సందు. he was * to the consequences of this యిందుకు సంభవించబొయ్యే దాన్ని తెలియక వుండినాడు. * faith or zeal మూఢభక్తి. * man's buff దాగురుమూత, దాగిలిమూత. To Blind, v. a. గుడ్డిచేసుట, కండ్లను చెడగొట్టుట, అంధకారము చేసుట. this dust blind me యీ దుమ్ముచేత నా కండ్లు తెలియలేదు. to deceive మోసముచేసుట. you cannot * me to the truth నాకు నిజము బయటపడకుండా చేయను నీవల్ల కాదు. the robbers blinded me దొంగలు నా కండ్లకు గంత కట్టినారు. blinded by pride గర్వాంధుడైన, గర్వముచేత మైమరచిన. Blind, n. s. (or venetian) ఆకుల తలుపు. or screne పేములతెర. horse blinds గుర్రపు కంటి కప్పులు. or pretext సాకు, నెపము. the letter was intended as a mere * ఆ జాబు వూరికె భ్రమ పడేలాగు వ్రాసినది. Blindfold, adj. కండ్లకు గంతకట్టిన. he carried me * through the business ఆ వ్యవహారము నాకు తెలియనీయక నన్ను కొనే గడిపించినాడు. The Hindu girls are married * హిందూ పడుచులు అజ్ఞానదశగా పెండ్లిచేయ బడుతారు. I bought the horse * ఆ గుర్రాన్ని కండ్లుమూసుకొని కొన్నాను. Blinding, adj. or dazzling కండ్లుచెదిరే. Blindly, adv. గుడ్డితనముగా, అవివేకముగా, విచారించక. Blindness, n. s. గుడ్డితనము, అవివేకము, అజ్ఞానము. Blindside, n. s. దోషము. Pride is his * వాడికివుండేదోషము గర్వము. Blindworm, n. s. ఒక తరహా పాము. To Blink, v. n. చీకరించుట. To Blink, v. a. తప్పించుట. He blinked the question ఆ ప్రశ్నకు వుత్తరము చెప్పకుండా మాయచేసినాడు, సాగవేసినాడు. Blink, n. s. రెప్పపాటు. Blinkers, n. s. గుర్రపు కండ్లమూతలు. Bliss, n. s. బ్రహ్మానందము, పరమసుఖము, ఆహ్లాదము. Blissful, adj. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన. Blister, n. s. పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి. To Blister, v. a. పొక్కేటట్టుచేసుట. The sun blirtered my face యెండచేత నాముఖము పెట్లింది. Blistered, adj. పొక్కిన. * steel ఒక తరహా తెల్ల వుక్కు. my feet are * with walking కాళ్ళుబొబ్బలయినవి. Blithe, adj. ఉల్లాసముగల, ఉత్సాహముగల, సంతోషముగావుండే. Birtheful, adj. ఉల్లాసముగల, ఉత్సాగముగల, సంతోషముగా వుండే. Blitheness, n. s. ఉల్లాసము, ఉత్సాహము. Blithesomeness, n. s. ఉల్లాసము, ఉత్సాహము. To Blot, v. a. వాచేటట్లుచేసుట. Laziness bloated him సోమరితనము చేత వాడివొళ్ళువూదింది. Bloated, adj. వాచిన, వూదిన, వుబ్బిన. * with pride గర్వముచేత తలకొవ్విన. Bloater, n. s. పొగలోకట్టి యెండపెట్టిన ఒక తరహా చేప. Block, n. s. మొద్దు. a * of wood కొయ్య, మొద్దు. Some pictures, and books are printed from blocks of wood. కొన్ని పటములున్ను, పుస్తకములున్ను కొయ్య మొద్దుపడి అచ్చులతో అచ్చు వేస్తారు. A * cutter కొయ్యమొద్దుల మీద పడెచ్చులు చెక్కేవాడు. carpenter's * దాలికర్ర, వడ్లవాడు కొయ్యచెక్కేటప్పుడు యెత్తుగా పెట్టుకొనే మొద్దు దుంగకొయ్య. * of stone రాతిబండ. the culprit was brought to the * ఆ నేరస్తునితల నరకబడ్డది. He escaped the * వాడి తలతప్పింది. a stumbling * అభ్యంతరము, ప్రతిభంధకము, భంగము. he put this stumbling * in my way నాయత్నమును భంగపరచినాడు. a large pulley పెద్దకప్పి. Blockade, n. s. ముట్టడి, దోవమూయడము. they raised the * ముట్టడిని తీసినారు. To Blockade, v. a. ముట్టడివేసుట, దోవ మూసుట. He blocaded the door with boxes పెట్టేలతో గడపమూసినాడు. Blockhead, n. s. జడుడు, మొద్దు, మందమతి. Block-house, n. s. రాయిలేకుండా కొయ్యమొద్దులతో కట్టిన యిల్లు. Blockish, adj. మందమతి అయిన, జడుడైన. Blockishness, n. s. జడత్వము. Block-tin, n. s. తహరపుగడ్డ, తగరపు ముద్ద. To Block up, v. a. అడ్డముగా వేసుట. he blocked up the door with boxes ఆ గడపకు అడ్డముగా పెట్టెలను వేసినాడు. Blonde lace, n. s. మహావెలపొడుగైనరవశెల్లా. Blood, n. s. నెత్తురు, రక్తము. No * was shed on this occasion యీతరణములో యెవరికిన్ని గాయముతగలలేదు. * of the grape i. e. wine సారాయి, or kin బంధుత్వము. Borthers by * సయాంతోడ పుట్టిన వాండ్లు. relations by * రక్తసంబంధముగల బంధువులు. one of base * నీచుడు, క్షుద్రుడు. a son of the full * ఔరసపుత్రుడు. gentle * సద్వంశము. one of gentle * మంచికులస్తుడు. or progeny సంతతి, సంతానము, వంశము. the prices of * చంపినందుకుచెల్లు. or courage ధైర్యము. His * was up వాడికి చెడు ఆగ్రహము వచ్చినది. a * horse శ్రేష్టమైన గుర్రము. bad * పగ, ద్వేషము. there is bad * between them వారియిద్దరికిన్ని ద్వేషముగావున్నది. this bred ill * between them యిందుచేత వారికి విరోధము పట్టినది. In cold * నిశ్చింతగా, సునాయాసముగా. they murdered him in cold * వాణ్ని వక పురుగును నలిపినట్టు చంపినారు. hot * ఆగ్రహము. a man of * ఘాతకుడు, అతిక్రూరడు. a deed of * హత్య. my * curdled at hearing this దీన్ని వినగానే నా గుండెఝల్లుమన్నది. his * is cooled by experience కాగిచల్లారిన పాలుగా వున్నాడు. a fop or coxcomb బడాయికోరు. * hot గోరువెచ్చని, నులివెచ్చని. * red రక్తవర్ణమైన. a * hound వాసనచేత దొంగజాడను కనిపెట్టేకుక్క * shot eyes యెర్రబారిన కండ్లు. * stone యమునా రాయి, ఒక తరహా యెర్ర రాయి. To Blood, v. a. (This is not a good word.) See To Bleed. Blooded, adj. or i. ఏ. having * నెత్తురుగల. the patient was blood or * ఆ రోగికి నెత్తురు దీసినారు. cold * నిర్దయాత్మక, క్రూర. hot * రేగే, మండిపడే. Bloodguilitiness, n. s. హత్యదోషము. Blood heat, n. s. గోరువెచ్చన, నులివెచ్చన. Bloodily, adv. క్రూరముగా. Bloodiness, n. s. నెత్తురుగా వుండడము. from the * of this battle యీ యుద్ధములో చాలామంది చచ్చినారుగనుక. Bloodless, adj. రక్తహీనమైన, నెత్తురు చచ్చిన, తెల్లపారిన. * sacrifice సాత్విక పూజ, పిష్టపశు మేధము. Bloodletting, n. s. కత్తివాటు చేయడము. Bloodshed, n. s. ప్రాణహాని. Bloodsheding, n. s. ప్రాణహాని. Bloodstone, ఒక తరహా చెకముకరాయి, నల్లరాతి భేదము. Bloodsucker, n. s. (a sort of lizard) తొండ, వూసరవల్లి, సరటః. voracious wretch పీల్చేవాడు, దోచేవాడు. Bloodthirstiness, n. s. క్రూరత్వము, గాతుకత్వము. Bloodthirsty, adj. క్రూరమైన, ఘాతుకమైన. Bloodvessel, n. s. నరము. Bloody, adj. రక్తమయమైన. the * flux నెత్తురుభేది. or cruel క్రూరమైన, అఘోరమైన. * minded క్రూరహృదయముగల. a * battle అఘోరమైన యుద్ధము. a * sacrifice తామసపూజ. (compare unbloody సాత్విక). Bloodyminded, adj. క్రూరమనస్సుగల. Bloodysweat, n. s. నెత్తురు చెమట. Bloom, n. s. మొగ్గ, పువ్వు. the prime of life బాల్యము, కౌమారము. he was cut off in the * of his age వాణ్ని పశితనములో తుంచుకొని పోయినది. To Bloom, v. n. పూచుట, వికసించుట. Blooming, adj. నవయౌవనముగల. a * beauty నవయౌవనవతీ. Bloomy, adj. వికసించిన, పువ్వులుగల. Blossom, n. s. మొగ్గ, పువ్వు. To Blossom, v. n. పూచుట, వికసించుట. To Blot, v. a. కొట్టివేయుట, తుడుపు పెట్టుట, పాటాకొట్టుట, పోగొట్టుట. you have blotted the paper నీవు ఆ కాకితమును శిరామరకలు చేసినావు. blot this line out ఆ పజ్ఞ్తిని కొట్టివేయి, తుడుపుపెట్టు. this blots out his past offences యిందువల్ల వాడు యిదివరకు చేసిన తప్పులన్ని పోయినవి. this blotted out all his sins యిది వాడి పాపములన్నిటిని పోగొట్టినది. Blot, n. s. తుడుపు, పాట, గిరుగు, మరక. Stain or disgrace కళంకము, మాలిన్యము, అపనింద. Blotch, n. s. చమరకాయలు, కడి, మచ్చ, సిభ్యము. Blotted, adj. మరక తగిలిన. * out పాటాకొట్టిన, తుడుపుపెట్టిన, కొట్టివేయబడ్డ. Blotting-paper, n. s. వూరే కాకితము. Blow, n. s. దెబ్బ, పెట్టు, ఆపద, ఢక్కా. who gave the first *? ముందర చెయి మించినది యెవడు? they came to blows గుద్దులాడసాగిరి. a * with the first గుద్దు, పిడిగుద్దు. a * on the head with the knuckles మొట్టు, మొట్టికాయ. on the cheek చంపపెట్టు, చంపకాయ. this was a fatal * to him వాడికి యిది ఒక దౌర్భాగ్యము, ఆపద, ఢక్కా. the cholera destroyed a thousand people at a * వాంతి భేది బహుమందిని ఒక దెబ్బనకొట్టుకొని పోయినది. or bloom వికసనము, పూయడము. the flowers are now in full * యిప్పట్లో పువ్వులు బాగా వికసించివున్నవి. To Blow, v. n. ఘాలికొట్టుట, విసురుట. which way was the wind blowing? యేఘాలికొట్టుతూ వున్నది? the storm blew over ఘాలివాన తేలిపోయినది. the paper blew away ఆ కాకితము ఘాలికి కొట్టుకొని పోయినది, or to bloom పూచుట, వికసించుట. Roses blow in May మే నెలలో రోజా పువ్వులు పూస్తవి. the flowers that are already blown మునుపే వికసించిన పువ్వులు. To Blow, v. a. వూదుట. the explosion blew him over the wall రంజకము అంటుకొని వాణ్ని గోడకు అవతలవేసినది. He blew the conch or horn శంఖమును పూరించినాడు, కొమ్మువూదినాడు. He blew his nose ముక్కుచీదినాడు. He blew his brains out తలమెదడు చెదిరేటట్టు పిస్తోలుతో తలను కాల్చుకొన్నాడు. He blew the light out దీపమును వూదివేసినాడు. they blew him away from the mouth of a gun వాణ్ని ఫిరంగి వాత పెట్టినారు. the wind blew the papers away ఆ కాకితాలు ఘాలికికొట్టుకొని పోయినవి. He was blown up with pride గర్వముచేత వుబ్బినాడు. He was blown up with drinking నిండానీళ్ళు తాగివుబ్బినాడు. the house was blown up ఆ యింటికింద రంజకము పెట్టి కాల్చిబోర్ల తోసినారు. He blew up the bladder వుచ్చబుడ్డను వుబ్బేటట్టు వూదినాడు, they blew up his passion వాడికిమరిన్ని ఆగ్రహము వచ్చేటట్టు చేసినారు. His character was much blown upon వాడిపేరు నిండా చెడిపోయినది. the flesh was blown or fly blown ఆ మాంసము పాసిపోయినది యీటిబట్టినది. blowing weather యీదర ఘాలి కొట్టే కాలము. Blown, the part. of Blow. Blowzy, adj. పెద్ద యెర్ర ముఖముగల, పల్లెటూరి మోటుపడుచుల వర్నన యందు వచ్చేమాట. To Blubber, v. a. ముఖము వాచేటట్టు యేడుచుట్ట. Blubber, n. s. (fat of a whale) పెద్దచేప కొవ్వు, యిందుతో నూనె చేస్తారు. Blubber-lip, n. s. లావు పెదివి. Bludgeon, n. s. దుడ్డుకర్ర, దండము, యిది దొంగచేతికర్రను గురించిన మాట. Blue, adj. నీలవర్ణమైన. dark * శామవర్ణము. light * చామనిచాయ. the * sky నీలవర్ణమైన ఆకాశము. the * veins పచ్చ నరాలు. eyes నీల వర్ణమైన కండ్లు. He looked * వెలవెలపోయినాడు, యిది నీచ తిట్టు మాట. a * light in fire works మత్తాపు, పగులువత్తి. the * bell flower గంటెన పువ్వు. a * bottle fly గండీగ, పోతుటీగ. * stocking విద్వాంసురాలు యిది పరిహాసముగా చెప్పేమాట. Blueness, n. s. నీలత్వము, నైల్యము. * of a wound కందువ. Blue-pill, n. s. రసముతో చేసినవక మాత్ర. Blue-vitriol, n. s. మయిలతుత్తము. Bluff, adj. దాష్టీకమైన, తృణీకరమైన. a * rock నెట్రముగా వొడుదుడుకుగా వుండేమోటు కొండ. Bluish, adj. కొంచము నీలవర్ణమైన. To Blunder, v. n. పొరబాటుపడుట, తప్పుట. He blundered out that I was gone నేను పోయినానని నోరుజారి చెప్పినాడు. Blunder, n. s. పొరబాటు, తప్పు. Blunderbuss, n. s. పెద్దతుపాకి, మూతి వెడల్పైన పొట్టి తుపాకి. Blunderer, n. s. పొరబాటుపడేవాడు, తప్పేవాడు. Blunder-headed, adj. జడుడైన, మూఢుడైన, Blundering, adj. పొరబాటుపడే, తప్పే, మూఢుడైన. Blunt, adj. మొద్దైన, మొక్కబోయిన, మొండియైన. * knife మొద్దుకత్తి, పదనులేనికత్తి. * catridge గుండులేని తోటా. To Blunt, v. a. పదునుపోగొట్టుట, మొక్కచేసుట, మొద్దుచేసుట. Blunted, adj. పదునులేని, మొక్కైన, మొద్దైన, మొండిపారిన. his sorrow was * by time దినాలుచెల్లినందు మనవాడివెసనం ఆరింది. He used blunt language కట్టె విరిచినట్టు మాట్లాడినాడు. He gave a blunt answer మోటు జవాబు యిచ్చినాడు. Bluntly, adv. మొద్దుగా, మోటుగా. Bluntness, n. s. పదునులేని మోటు, మొద్దుతనము, మోటతనము. Blur, n. s. కర, మరక, కళంకము, మాశినది. To Blur, v. a. మాపుట, కరచేసుట, మరకచేసుట. you have blurred the paper నీవు ఆ కాకితాన్ని మురికిచేసినావు, మాపినావు. To Blush, v. n. యెర్రబారుట, సిగ్గుపడుట. she blushed with shame సిగ్గుచేత దానిముఖము యెర్రబారింది. she blushed at this యిందుకు సిగ్గుపడ్డది. Blush, n. s. యెరపు, సిగ్గు. at the first * this appears unjust పైకిచూస్తే అన్యాయము వలె తోస్తున్నది. Blushing, adj. యెర్రపారిన, యెర్రని. a * apple యెర్రటి పండు. To Bluster, v. n. బడాయికొట్టుట, జంభాలు నరుకుట, ఉతాళపడుట. blustering weather గాలి కాలము, blustering language జంభాలు. Bluster, n. s. జంభము.