విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Boa-Boss

విక్షనరీ నుండి

Boa, n. s. (a snake) దాసరిపాము, పెంజరిపాము. an article of 
female dress దొరసాన్లు వేసుకొనే బొచ్చుమాల.

Boar, మొగపంది. A * spear బల్లెము. A wild * అడవిపంది.

Board, n. s. పలక. table మేజ, బల్ల. the festive * విందు. the 
royal * రాజు యింటి భోజనము. subsistence కూటి శెలవు. I pay for his  
* వాడికూటి శెలవుకు యిస్తాను. entertainemnt విందు, పంజ్ఞ్తి భోజనము, 
గ్రాసము, భోజనము. In this school they furnish the boys with * and 
lodging యీపళ్ళి కూటములో పిల్ల కాయలకు గ్రాస నివాసములను యిస్తారు. 
boards of a book పుస్తకానికి రెండుపక్కల వేసే పలకలు. a book in 
boards తోలులేకుండా ఉత్త కాకితముతో స్వల్పముగా బైండు చేసిన పుస్తకము. the 
boards నాటకశాలలో ఆడేటందుకు పలకలతో పేర్చిన స్థలము. She went on
the boards దాన్ని ఆటకువిడిచినారు. Council ఆలోచన సభ. the * of 
Revenue ములికీసంగతిని విచారించే ఆలోచనసభ. the military * దండుక 
మామిసునే విచారించే ఆలోచనసభ. on * a ship వాడలో. he went on * 
వాడ యెక్కినాడు. he fell over * వాడమీదనుంచి నీళ్ళలోపడ్డాడు. sea-board 
అనగా, Land-ward భూమివేపు, above * (without artifice) నిష్కపటముగా, 
బహిరంగముగా.

To Board, v. a. పలకలుపరుచుట, బల్లకూర్పు చేసుట. he boarded the 
room ఆ యింటితలవరసకు బల్లకూర్పు వేసినాడు. or give food అన్నము 
పెట్టుట. I boarded him at my house వాడికి నా యింట్లో వణ్ణంపెట్టినాను. 
they boarded the ship తమవాడలోనుంచి శత్రువువాడకు దుమికినారు.

To Board, v. n. or eat భోజనము చేసుట. he boarded ten days at 
my house నా యింట్లో పది దినాలు భోజనము చేసినాడు.

Boarded, adj. పలకలతో తాపిన, పలకలుపరచిన.

Boarder, n. s. పూటకూళ్ళుతినేవాడు. in battle, శత్రువాడమీద దూరేవాడు.

a Boarding-house, n. s. పూటకూటి యిల్లు.

Boarding-school, n. s. కూడుపెట్టి చదువుచెప్పే పళ్ళి కూటము.

Board-wages, n. s. కూటిఖర్చు, బత్యఖర్చు.

To Boast, v. n. జంభాలునరుకుట, జంభాలు కొట్టుట, బడాయికొట్టుట.

To Boast, v. a. కలిగివుండుట. he boasts a noble son వాడికి వక
దొడ్డకుమారుడు వున్నాడు. this town * many rich merchant యీ పట్టణము
లో అనేక గొప్పవర్తకులు వుంటారు. she boasts a royal sire దానితండ్రిరాజు.
Sanscrit literature boasts a great antiquity సంస్కృతము అనాది.

Boast, n. s. జంభము, బడాయి, జల్లి.

Boaster, n. s. జంభాలుకొట్టేవాడు, బడాయికొట్టేవాడు.

Boastful, adj. జంభాలునరికే, బడాయికొట్టే.

Boasting, n. s. జంభము, బడాయి.

Boastingly, adv. జంభముగా, బడాయిగా.

Boat, n. s. పడవ, దోనే. a basket * పుట్టి. a butter *, sauce *, or pap
* గిన్నె.

Boat-hook, n. s. అంకుశంవంటి, చేపలనే పొడిచే వక తరహా యీటి.
                         
Boating, n. s. పడవ యెక్కి విహారముగా పోవడము.

Boatman, n. s. పడవవాడు.

Boatswain, n. s. తండేలు.

To Bob, v. a. యిటూ అటూ వేలాడుట, వూగాడుట, తొలగతీసుకొనుట. she had
a pearl bobbing at her nose దానిముక్కున ముత్యము వేలాడుతుండెను. he
bobbed his head to avoid the blow ఆ దెబ్బను తప్పించుకోవడానకు తలను
తొలగ తీసుకొన్నాడు.

Bob, n. s. కాయ. an ornment జుమికి, బులాకి, కప్పై కుచ్చు, మొదలైనవి.

Bobbin, n. s. a kind of string ఒక తరహా అల్లిక దారము. or pin 
మేకు.

Bobtailed, adj. మొండితోక గలది.

Boddice, n. s. రవికె.

To Bode, v. a. సూచించుట, తెలియ చేసుట. this bodes on good
యిది అశుభమును సూచిస్తున్నది.

Bodice, n. s. రవికె.

Bodiless, adj. శరీరములేని, శరీర విహీనమైన.

Bodily, adj. శరీరముగల, స్థూలరూపముగల. God appeared in * 
shape దేవుడు స్థూల రూపై అగుపడెను. mental plain and * pain 
మనోవ్యధ, శరీరబాధ. * strength శరీరబలము. * exertion కాయకష్టము. 
* fear మహత్తైన భయము.

Bodily, adv. బొత్తిగా, యావత్తు. he carried it off * దాన్ని అంతా వక 
దెబ్బగా అంటుకొని పోయినాడు.

Bodkin, n. s. దబ్బనము.

Body, n. s. శరీరము, దేహము, కాయము. somebody యెవడో. anybody
యెవడైనా. nobody యెవరులేదు. everybody అందరు. all over the
నిలువెల్లా. a dead * పీనుగ, శవము. the * was carried out of 
the town ఆ పీనుగ పట్ణానికి బయట తీసుకొని పోబడ్డది. a headless 
* కబంధము, మొండెము. or person మనిషి. she is a good * అది 
మంచి మనిషి. the old body will not agree ముసిలిది వొప్పదు. a 
busy * అధిక ప్రసంగి, దుర్వ్యాపారానికి పొయ్యేవాడు. principal part 
ముఖ్యమైన భాగము. the * of the people were in our favour, but 
a few were agaisnt us జనమంతా మా పక్షముగా వుండినారు గాని కోందరు 
మాత్రము విరుద్ధముగా వుండిరి. a few troops have arrived, but the * 
of army not come yet కొంత సేన వచ్చిందిగాని ముఖ్యమైన దండు రాలేదు. 
the body of the tree is sound but the branches have perished 
కొమ్మలు పోయినవి అడుగు మొద్దు మాత్రము బాగా వున్నది. the * of the letter 
was in his hand writing ఆ జాబులో ముఖ్యమైన భాగమును సొంతముగా వ్రాసినాడు. 
the * of her gown was red, the skirt was white దాని గౌను 
నడుములమట్టుకు యెరుపున్ను కింది పావడ తెలుపుగా వుండినది. or assembly 
గుంపు, స్తోమము. they came in a * గుంపుగా వచ్చిరి. a * of travellers
బాటసారుల గుంపు. a * of police బంట్రోతుల గుంపు. a * of soldiers
కాల్బలము. a * of friends ఆప్తవర్గము. a * of horse గుర్రపు దళము. 
there was large * of evidence బహుమంది సాక్షులువుండిరి. a * of poetry 
కావ్య గ్రంధములు. a * of divinity వేదాంతసార సంగ్రహము. a * of law 
ధర్మ శాస్త్రము. a * of medicine వైద్య శాస్త్రము. the coach had a black 
* with a red carriage బండిపయిపెట్టె నలుపున్ను అడుగు చట్టము యెరుపుగా
నున్ను వుండెను. the * of the church is old, the front is new ఆ గుడి
యొక్క ముఖ్యమైన భాగము పాతది ముఖమంటపము కొత్తది. the heavenly bodies 
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి. or strength of wine కారము, 
సత్తువ. this wine has no body యీ సారాయిలో కారములేదు, చప్పగా వున్నది.
or substance వస్తువు. glass is a brittle * గాజు పెళుచైన వస్తువు. 
this is a metallic * యిది వక లోహము. wood is an inflamable * కాష్టము 
దహనశీలమైనది, కొయ్య అంటుకొనేటిది. a particle or atomic * అణువు, 
కణము. she has a fine * of voice దానిది మంచి శారీరము. able bodied 
దృఢగాత్రుడైన, కాయపుష్టిగల. the bank burst and a large * or water 
broke out కట్ట తెగి విస్తారము నీళ్ళుపోయినది. BODY అనే శబ్దమును తప్పుగా 
ప్రయోగిస్తారు, యేలాగంటే, వాడికి వొళ్ళు కుదురు లేదు, దానికి వొళ్ళు కుదురుగా 
వున్నది, వారికి శరీరము కుదురలేదు. he is ill, she is well, they are 
unwell, యిట్లా అనకుండా his body is not well అంటే వాడి పీనుగ బాగా వుండ
లేదు, అని విరుద్ధముగా అర్థమౌతున్నది గనుక యీలాటి స్థలములలో body అనగా 
శవము, మానము, పొట్ట, పేగులు అని భావిస్తున్నది గనుక యీ శబ్దము బహు 
పదిలముగా ప్రయోగించవలసినది.

Body-clothes, n. s. విడి గుర్రమునకు పైనవేసే బురకా.

Body-guard, n. s. అంగరక్షక సేన, అనగా రాజు సమీపములో వుండే తురుపు
సవార్లు.

Bodysnatchers, n. s. పాతిపెట్టిన పీనుగను తొవ్వి యెత్తుకొనేవాడు.

Bog, n. s. బాడవ నేల, వాడవపొలము, చితచితలాడే భూమి, బురద
నేల.

To Boggle, v. n. సందేహించుట, సంకోచించుట, ఆజ్జాయించుట, అనుమానించుట,
శంకించుట.

Boggling, n. s. సందేహము, అనుమానము, సంకోచము, శంక.

Boggy, adj. చిత చితలాడే, బురదగా వుండే.

Bog-house, n. s. (Johnson) మరుగు పెరడు, పాయఖానా.

Bohea, n. s. ఒక తరహా తేయాకు.

To Boil, v. n. కాగుట, వుడుకుట, పచనమౌట. To * over పొంగుట, 
మసలుట. I saw he was boiling with rage వాడు కోపముతో మండుతూ 
వుండగా చూస్తిని. the water boilded away ఆ నీళ్ళు యిగిరిపోయినది, 
యగర కాగినది.

To Boil, v. a. కాచుట, వుడకపెట్టుట, పచనము చేసుట.

Boil, n. s. కురుపు, గడ్డ, పుండు. a raja * (gangrene or carbuncle) 
రాచపుండు.

Boiled, adj. కాగిన, వుడికిన, పచనమైన. half * వుడికీ వుడకని, 
ననుబాయిగా వుండే. * water కాగి చల్లారిన నీళ్ళు. * rice అన్నము.

Boiler, n. s. బాన, కాగు. a sugar * or vessel బెల్లముకాచే బాన. 
or merchant బెల్లపు వర్తకుడు.

Boiling, adj. వుడికే, కాగే. * water వుడుకునీళ్ళు. * bravery ఉత్సాహము.

Boisterous, adj. ఘర్జించే, ఘోషించే, ప్రచండమైన, బ్రహ్మాండమైన. * sea
ఘోషించే సముద్రము. * wind ప్రచండ వాయువ్వు. * woman బొబ్బలు పెట్టే
ఆడది. Hunting and boxing are * amusements వేట, జట్టిపోట్లాట, యివి
దొమ్మిపనులు.

Boisterously, adv. ఘోషించి, ప్రచండముగా, అరిచి, బిగ్గర, దొమ్మిగా.

Boisterousness, n. s. ఘోష, ఘర్జన, అరుపు, కూత, దొమ్మి.

Bold, adj. ధైర్యముగల, ఘట్టిగుండెయైన, సాహసముగల. a * round hand
ధాటిగా బటువుగా వుండే దస్తూరి. a * hill నెట్రముగా వుండే కొండ. or
impudent మొండి, తుంట. I made * to tell him that this was not 
lawful యిది న్యాయము కాదని అతనితో చెప్పే దానికి తెగించినాను, సాహసము
చేసినాను. may I make * to come there నేను అక్కడికి వస్తాను అపరాధము
క్షమించవలెను. 

Boldly, adv. ధైర్యముగా, నిర్భయముగా.

Boldness, n. s. ధైర్యము, నిర్భయము. he has the * to ask this 
question తెగించి యీ మాటను అడిగినాడు.

Bole, n. s. (the trunk of a tree) అడుగుమాను, అడగు మొద్దు, ప్రకాండము.
Armenian * భోళమనే ఔషధము. Ainslie says సీమ కావిరాయి.

Bolled, adj. గింజపట్టిన.

Bolster, n. s. పెద్ద దిండు, పెద్ద తలగడ.

To Bolster up, v. a. అండకట్టుట. he bolstered me up with false 
hopes నాకు వట్టి ఆశలు పెట్టినాడు. he bolstered up his cause with 
false witnesses తప్పు సాక్షులచేత వాడి వ్యాజ్యానికి బలము కట్టినాడు.

Bolt, n. s. గడియ. or arrow అలుగులేని అంబు, అంపకట్టె. a * or 
thunder * పిడుగు తునక. a peg చీల, మేకు. a * of canvas నిండుకిత
నారచుట్ట. the horse made a bolt ఆ గుర్రము బెదిరి చంగున దుమికినది. 
he shot the * or he fastened the * గడియ వేసినాడు. he drew the 
* గడియ తీసినాడు.

To Bolt, v. a. గడియవేసుట, గడియపెట్టుట. She bolted the corn 
ఆ ధాన్యమును జల్లించినది. he bolted the fruit ఆ పండును లటక్కున 
మింగినాడు, గుటుక్కున మింగినాడు, ఆతురముగా మింగినాడు. they bolted him 
in వాణ్ని లోపలవేసి గడియఅ వేసినారు. I bolted him out వాణ్ని బయట 
తోసి గడియ వేస్తిని. he bolted out the secret ఆ రహస్యమును పదిరి 
బయట చెప్పినాడు, నోరుజారి చెప్పినాడు.

To Bolt, v. n. చివుక్కున పోవుట, లటక్కున వచ్చుట.

Bolus, n. s. పెద్దమాత్ర, లేహ్యము.

Bomb, n. s. బొంబసుగుండు.

Bombproof, adj. బొంబసుగుండు దెబ్బ తాకని, బొంబసుగుండు పారని. the 
house was * ఆ యిల్లు బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టి
వుండినది.

Bombproofs, n. s. బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టిన యిండ్లు.

To Bombard, v. a. బొంబసుగుండుతో కాల్చుట.

Bombardier, n. s. బొంబసుగుండు కాల్చేవాడు.

Bombardment, n. s. బొంబసు ఫిరంగులతో కాల్చడము. the twon suffered 
much from the * బొంబసుగుండ్ల చేత ఆ వూరునిండా హితమైనది.

Bombasin, or Bombazeen, n. s. ఒక తరహా నాణ్యమైన నల్లపట్టు.

Bombast, n. s. నిరర్ధకశబ్ద పుష్టి, నిరర్ధకమైన పెద్దపెద్ద మాటలు.

Bombastic, adj. నిరర్ధకశబ్ద పుష్టిగల.

Bomay, n. s. బొంబాయి అనే పట్నము. Commonly called కొంకణదేశము. 
Concan.

Bombazine, n. s. See Bombasin.

Bombaketch, n. s. (a ship for bombs) బొంబసు ఫిరంగులవాడ.

Bonafide, adv. (really, honestly, in truth) వాస్తవ్యముగా, నిశ్చయముగా,
యధార్ధముగా. Did he * sell you the horse నీవు ఆ గుర్రమును కొనుక్కున్నందులో
యేమిన్ని పిత్తలాటకములేదా.

Bond, n. s. cord or chain తాడు, కట్టు, సంకెళ్ళు మొదలైన బంధము. 
cuase of connection బంధము, బంధకము, పాశము. a written obligation 
పత్రము, కరారునామా, ఒడంబడిక, ముచ్చలిక. this formed a * of affection 
between them వాండ్ల యిద్దరికిన్ని వుండే ప్రేమకు యిది కారణమైనది. this 
severed the * of affection between them వాండ్ల యిద్దరికిన్ని వుండిన 
ప్రేమకు యిది భంగమైనది.

Bond, adj. దాసులైన, బద్ధులైన.

Bondage, n. s. or Slavery దాస్యము, గులాపుతనము. or captivity చెర,
ఖైదు, or restraint కట్టు, బంధము, పాశము.

Bondmaid, n. s. దాసి, గులాపుది.

Bondman, n. s. దాసుడు, గులాపువాడు.

Bondsman, n. s. జామీనుదారుడు, పూట బడ్డవాడు.

Bone, n. s. యెముక, అస్తి. the back * వెన్ను పూస. the cheek bones 
కటుమర్లు. the collar bones మెటకొంకులు, జత్రువు. a thin fish *
చేప ముల్లు. a stay * సన్నబద్ద, పలచనిబద్ద. a * or difficulty 
చిక్కు తంటా, పీకులాట. the bone of contention కలహాస్పదము, 
వ్యాజ్యాస్పదము. I have a * to pick with him వాడికి నాకు వక 
పీకులాటవున్నది. he gave them a * to pick వాండ్లకు వక పీకులాట 
పెట్టినాడు. they examined his accounts to the వాడిలెక్కను సమర్మముగా 
విచారించినారు. he made no bones of translating the letter ఆ జాబును 
భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.

To Bone, v. a. యెముకలు లేకుండా తీసివేసుట, దొంగిలించుట.

Bonefire, or Bonfire, n. s. భోగిమంట, చొక్కబానమంట, జయోత్సాహ
సూచకముగా కాల్చే మంట.

Boneless, adj. యెముకలులేని, శల్యవిహీనమైన. * gums దంతములేని, పండ్లు
లేని.

Bonesetter, n. s. యెముకనుచక్కగా తోసికట్టే వైద్యుడు.

Bonita, n. s. ఒక తరహా సముద్రపు చేప.

Bonmot, n. s. సరసము, ఛలోక్తి, పరిహాసోక్తి.

Bonnet, టోపి, ఆడవాండ్ల టొప్పి, లబ్బై కుల్లాయి.

Bonny, adj. (a Schotch word) సొగసైన, అందమైన.

Bonus, n. s. or privilege బహుమానము, or fee, bribe లంచము.

Bony, adj. అస్థిమయమైన, యెముకలగూడుగా వుండే.

Booby, n. s. మందుడు, జఢుడు, మూఢుడు. a bird వక తరహా సముద్రపు
పక్షి.

Book, n. s. పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగా
చెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or 
record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poem
కావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,
at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran 
into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడి
దయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడి
దయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowed
leaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.

To Book, v. a. లెక్క పుస్తకములో దాఖలు చేసుకొనుట.

Bookbinder, n. s. జిల్దుకట్టేవాడు, పుస్తకాలు కట్టేవాడు.

Bookbinding, n. s. జిల్దుకట్టడము, పుస్తకాలు కట్టడము.

Bookcase, n. s. పుస్తకములు పెట్టే అల్మారా.

Bookish, adj. పస్తకములమీద పడిచచ్చే, పుస్తకముల పిచ్చిపట్టిన.

Bookkeeper, n. s. లెక్క పెట్టేవాడు.

Bookkeeping, n. s. లెక్కలు పెట్టే రీతి.

Booklearned, adj. పండితుడైన, యిది యెగతాళిమాట.

Booklearning, n. s. పాండిత్యము, యిది యెగతాళిమాట.

Bookmaker, n. s. గ్రంధము చెప్పేవాడు.

Bookseller, n. s. పుస్తకములు అమ్మేవాడు.

Bookworm, n. s. the insect రామబాణమనే పురుగు, చిమట. or student
పుస్తక చాదస్తము పట్టినవాడు.

Bocm, n. s. of a ship దూలము, అనగా వాడవెనకతట్టు తోకవలె నిడువుగా
వుండేమాను.

To Boom, v. n. భుంమని ధ్వనించుట. a booming sound భుంమనే ధ్వని.

Boon, n. s. వరము, అనుగ్రహము.

Boon, adj. pleasant సరసులైన. a * companion సరసుడు.

Boor, n. s. మోటుమనిషి.

Boorish, adj. మడ్డియైన, మోటైన. * langauge ఎడ్డెమాటలు.

Boorishness, n. s. మడ్డితనము, మోటతనము, ఎడ్డెతనము.

To Boose, v. n. తాగుబోతుగా వుండుట.

To Boot, v. a. and n. లాభముకలుగుట. It boot you nothing యిందువల్ల
నీకేమిన్ని లాభము లేదు.

Boot, n. s. a covering for the leg బూట్సు. part of a coach బండిలో 
సామాన్లు పెట్టుకొనే పెట్టె. to * (over and above) పైన, అదిగాకుండా, 
సహితము. you may take this to * దీన్ని సహితము యెత్తుకో. he knows 
English to * వాడికి యింగ్లీషు సహితము తెలుసును. seven-league boots 
worn by hermits on active duty యోగవాగములు.

Booted, adj. బూట్సులు వేసుకొన్న.

Booth, n. s. పందిలి, పాక, సంత, తిరుణాల్ల మొదలైన వాటిలో అంగడి 
వాండ్లు వేసుకొనేటిది.

Bootless, adj. నిష్ఫలమైన, వ్యర్థమైన.

Boot-tree, n. s. బూట్సులోచేయడానకు కాలువలె చేసివుండే కొయ్య అచ్చు.

Booty, n. s. కొల్ల పెట్టబడ్డసొత్తు, దొంగసొత్తు. they were caught 
with their * దొంగసొమ్ముతోకూడా పట్టబడ్డారు.

Bopeep, n. s. దాగురుమూతలాట, దాగెర బూచి. to play at * దాగురుమూతలాడుట.

Borax, n. s. వెలిగారము, టంకణము.

Border, n. s. అంచు, సరహద్దు, పొలిమేర. of a cloth కమ్మీ. of flowers
in a garden వరసగా పెట్టిన పూలచెట్లు.

To Boarder, v. n. అంచునవుండుట, పొలిమేరగా వుండుట. Cuddapa borders
upon the Mysore country కడప దేశము మైసూరు దేశమును ఆనుకొని వున్నది. 
his fields borders upon mine వాడినేల నా నేలతో చేరికగా వున్నది. this 
borders upon murder యిది ఖూనిపనితో చేరినది.

To Boarder, v. a. అంచున పెట్టుట. he bordered the pond with stone 
ఆ గుంటకు రాళ్ళు కట్టినాడు. the cloth was boardered with yellow ఆ 
గుడ్డకు పసుపు అంచు వేసివుండినది. the dish was bordered with gold ఆ 
తట్ట యొక్క అంచుకు బంగారు వేసివుండినది.

To Bore, v. a. బెజ్జమువేసుట, తొలుచుట, దొండిచేసుట. thieves bored 
through the wall దొగలుగోడకు కన్నము వేసినారు. the worm that bores 
wood కొయ్యను తొలిచే పురుగు. or to torment పీడించుట. he bored me
about this యిందుకైనా ప్రాణాలు తీసినాడు. they bor their ears వాండ్లు 
చెవులు కుట్టుకుంటారు. he bored the pearl ఆ ముత్యానికి బెజ్జము వేసినాడు.

Bore, n. s. a hole రంధ్రము, బెజ్జము. or tiresom plague తొందర, 
పీడనము. or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని 
బాణమంటారు. Bore (supposed to be corrupted from the French Bar, 
used regarding the Seine) is the English word used regarding the 
river Severn.

Boreal, adj. Northern ఉత్తరపు, కుబేర దిక్కు సంబంధమైన.

Boreas, n. s. ఉత్తరపు ఘాలికి అధిష్టాన దేవత పేరు, యిది కావ్యమందు 
వచ్చేమాట.

Borer, n. s. a tool కంఠాణము, బరమా, పిడిసాన, తొరపణము.

Born, adj. పుట్టిన. the land in which he was * వాడి జన్మభూమి. first 
* జ్యేష్టుడైన, అగ్రజుడైన. youngest * కనిష్టుడైన. heirs * of his body
తన కడుపునపుట్టిన వార్సుదార్లు. high * సత్కుల ప్రసూతుడైన. base * కుల
హీనుడైన, దుర్భీజుడైన. a * villain జన్మతఃక్రూరుడు. a * fool పుట్టువెర్రి. 
* again పునఃజన్మించిన, పునర్జన్మమును పొందిన, అనగా ముక్తులు పుణ్యాత్ములు. 

To be Born, (v. n. past) పుట్టుట, జన్మించుట. he was * there అక్కడ
పుట్టినాడు. After a son was * to him వాడికి వక పుత్రుడు కలిగిన తరువాత.

Borne, past part of Bare మోసిన. the boxes were * on men's heads 
ఆ పెట్టలు తలల మీద మోసుకొని పోబడ్డవి. after she had * a son అది 
వక కొడుకును కన్న తరువాత. borne away by passion కోపపరవశుడైన.

Borough, n. s. పేట, చిన్నవూరు. the * or Southwark యిది లండన్ పట్టణములో
దక్షిణభాగము.

To Borrow, v. a. (money) అప్పు తీసుకొనుట, ఋణముచేసుట, అరువుగా 
తీసుకొనుట. he borrwed some money on a verbal promise కొంత 
రూకలను చెయిబదులుగా తీసుకొన్నాడు. he has borrowed this from 
Johnson దీన్ని జాన్సన్ గ్రంధములో నుంచి తెచ్చుకొన్నాడు.

Borrowed, adj. అప్పుగా తీసుకొన్న, అరువుగా తీసుకొన్న. not our own వర,
తెచ్చుకొన్న. * curls నవరము మొదలయిన దొంగ వెంట్రుకలు. Ornments 
form a * beauty భూషణములచేత పెట్టుఛాయ కలుగుతుంది.

Borrower, n. s. అప్పు తీసుకొనేవాడు, చెయిబదులుగా తీసుకొనేవాడు.

Borrowing, n. s. అప్పు, యెరవలు.

Bosky, adj. అడివిగావుండే.

Bosom, n. s. రొమ్ము, మనస్సు, ఆంతర్యము. they do not cover their *
వాండ్లు రొమ్ముమీద బట్టలు వేయరు. * friend ప్రాణ స్నేహితుడు. or centre
part నడిమి భాగము, గర్భము. My bosom's Lord నా ప్రాణనాధుడు. the
* of the wood నట్టడివి. he was received into the * of our family 
వాణ్ని మాసము సారములో చేర్చుకొన్నాము.

To Bosom, v. a. మనసులో పెట్టుకొనుట, దాచుట. he bosomed up his 
wrongs తానుపడ్డ అన్యాయములను తన మనసులోనే పెట్టుకొన్నాడు.

Boss, n. s. గుబ్బ, బుబక, కాయ.