విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Botanic-Brazil

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Botanic, adj. ఓషధుల సంబంధమైన. a botanical garden నూతనమైన
చెట్లను పెట్టి పెంచేతోట, మందు చెట్లు గల తోట.

Botanist, n. s. ఓషధి శాస్త్రజ్ఞుడు, ఓషధులను విచారించేవాడు.

Botany, n. s. ఓషధి శాస్త్రము.

Botch, n. s. or patch అతుకు, మాసిక. or boil గడ్డ, కురుపు.

To Botch, v. a. అతుకు వేసుట, మాసిక వేసుట. to do unskilfully
అబందరగా చేసుట.

Botcher, n. s. అబందరగా చేసుట.

Botcher, n. s. అబందరగా చేసేవాడు.

Both, adj. and conj. ఉభయ, రెండు. * have arrived యిద్దరు చేరినారు.
* parties ఉభయులు, ఉభయత్రులు, యిరువర్లు. on * tides ఉభయ పక్షముల 
యెందున్ను. at * ends రెండు మొనల. It is often understood; thus, 
* he and I came వాడూ నేను వస్తిమి.

Bother, n. s. తొందర.

To Bother, v. a. తొదర బెట్టుట.

Bots, n. s. గుర్రము కడుపులో పురుగులు.

Bottle, n. s. బుడ్డి, సీసా, గాజుకుప్పె. a metal or skin * శిద్దె. 
a * of wine చెంబెడు సారాయి. an ink * సిరా బుడ్డి. a * shaped 
gourd సొరకాయ * nosed బుర్రముక్కుగల.

To Bottle, v. a. బుడ్లలోకి పట్టుట, బుడ్లలో పోసుట.

Bottlescrew, v. a. దట్టాలు తీసే ఆయుధము.

Bottom, n. s. అడుగు, కింది, ఆధారము. Read to the * of the page 
ఆ పక్క కడవెళ్ళా చదువు. he is at the * of the business ఆ పనికి
వాడే మూలము, కారణము. from top to * నిలువల్లా, యావత్తు. or posterious 
పిరుదులు. or bravery ధైర్యము, సత్తువ. or ship వాడ. a valley లోయ.
of thread కండె. of a lane సందుకొన. or sediment గసి, మష్టు. he 
got at the * of the business ఆ వ్యవహారాన్ని సమర్మకముగా కనుకొన్నాడు.
at the * of his heart వాడి ఆంతర్యములో. he appears an honest man 
but is a thief at * వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.

Bottomed, adj. ఆధారముగల. this castle is * on a rock యీ కోట,
చట్టును ఆధారముగా చేసి కట్టి వున్నది. broad * మంచి ఆధారముగల.

Bottomless, adj. అగాధమైన. the * pit నరకము.

Bottomry, n. s. వాడను కుదువబెట్టి తీసుకున్న రూకలు.

Boudoir, n. s. a lady's private chamber నాయకి అలిగివుండే యిల్లు.

Bough, n. s. కొమ్మ, రెమ్మ, శాఖ. the * of a cocoanut or palm 
tree &c. మట్ట.

Bought, the past and part of Buy కొన్నది, కొన్న. bought over a 
tampered with స్వాధీనము చేసుకొన్న. he bought my witnesses over నా 
సాక్షులను తన పక్షముగా తిప్పుకొన్నాడు.

Boulders, n. s. గండశైలములు, ఒడ్డుగుండ్లు.

To Bounce, v. n. చివుక్కున యెగిరికొట్టుట, బుర్రున యెగిసి పడుట. he 
bounced into the room ఆ యింట్లోకి దఢాలున దూరినాడు. to make a sudden 
noise దభాలనుట. or to boast జంభాలు నరుకుట, జంభాలు కొట్టుట. 
bouncing boy నిండా బలిసిన పిల్లకాయ.

Bounce, adv. చివ్వున, చివుక్కున, చంగున, దఢాలున. or lie వట్టి అబద్ధము.

Bounce, n. s. దఢాలనే శబ్దము. or boast జంభము, గచ్చు.

Bouncer, n. s. బడాయిఖోరు, జంభాలు కొట్టేవాడు. or child నిండా బలిసిన
పిల్లకాయ.

Bound, n. s. or Boundary, హద్దు, సరహద్దు, మేర. or leap గంతు, 
కుప్పిగంతు, దుముకు. he crossed the river with a * ఆ యేటిని వక 
దాటులో దాటినాడు. Moderation మితము. Beyond all bounds అమితమగా. 
out of bounds హద్దుతప్పి. he went out of bounds హద్దు దాటి 
పోయినాడు. he went beyond all bounds and beat her వాడు హద్దు మించి 
దాన్ని కొట్టినాడు. speaking within bounds be is fifty years old 
యెంత కొంచెముగా చెప్పినా వాడికి యాభే యేండ్లు వుండును, వాడికి కనీసము 
యాభై యేండ్లు వుండును. you do not keep passion within bounds నీవు 
కోపాన్ని మితములో పెట్టవు.

To Bound, v. n. or to leap దుముకుట, గంతు వేసుట. he bounded 
over the hedge ఆ వెలుగును యెగిసి దాటినాడు. the deer were bounding 
ఆ జింకలు గంతులువేస్తూ వుండినవి.

To Bound, v. a. హద్దు యేర్పరచుట, యెల్లయేర్పరచుట, పొలిమేర 
యేర్పరచుట. the river bounds my land నా నేలకు ఆ యేరు హద్దుగా 
వున్నది. I bound all my expectations to this నేను యెదురు 
చూచినదంతా యింతే. the hills that * the plain ఆ బయలుకు హద్దుగా
వుండే కొండలు.

Bound, past and part of Bind కట్టిన. a book * in leather తోలుతో 
జిల్దు కట్టిన పుస్తుకము. a ship * for Bengal బంగాళాకు పొయ్యే వాడ. 
whither are you * నీవు యెక్కడికి పొయ్యేవాడవు. a * hedge కత్తిరించి 
కట్టిన చెట్ల వెలుగు. I will be * to say he is gone వాడు నిజముగా 
పోయివుండును. And your petitioner as in duty * shall every pray యిదే 
పది వేల దండములు.

Boundary, n. s. పొలిమేర, యెల్ల.

Bounden, adj. బద్ధమైన. It was your * duty to do this యిది నీవు 
అవస్యము చేయవలసిన ధర్మము, భారము.

Boundless, adj. అమితమైన, అపారమైన, మేరలేని.

Boundlessness, n. s. అమితత్వము, అపారత్వము. from the * of this 
prospect యిది దృష్టికి హద్దు లేని బయలుగనుక.

Bounteous, adj. దాతృత్వముగల, ఉదారత్వముగల.

Bounteously, adv. ఉదారత్వముగా.

Bounteousness, n. s. దాతృత్వము, వితరణ.

Bountiful, adj. దాతృత్వముగల, ఉదారత్వముగల.

Bountifully, adv. దాతృత్వముగా, ఉదారత్వముగా.
                                
Bountfulness, n. s. దాతృత్వము, ఉదారత్వము.

Bounty, n. s. దాతృత్వము, ఉదారత్వము, వితరణ, యీవి. Money advanced to 
soldeirs & c. బహుమానము.

Bouquent, n. s. పూబంతి.

Bourn, n. s. limit యెల్ల, పొలిమేర. brook చిన్న నది.

To Bouse, or Boose, v. n. to drink అమితముగా తాగుట.

Bousy, adj. drunk తాగుబోతైన.

Bout, n. s. తేప, తడవ, సారి. a wrestling * మల్ల యుద్ధము.

Bouts rimes, n. s. సమస్య, యిది ప్రెంచి భాష.

To Bow, v. a. or to Bend వంచుట, వాల్చుట. he bowed his head 
తలవంచిననాడు, వందనము చేసినాడు. they bowed their knees మోకాలించినారు.
* down thine ear అవధరింపుమా, ఆలకించండి. Poverty bowed him down 
దరిద్రము వాణ్ని అణిచినది, కుంగకొట్టినది. or beat cotton దూదేకుట. see 
bowed.

To Bow, v. n. వంగుట, వాలుట. he bowed to them వాండ్లకు దండము 
పెట్టినాడు. I * to your opinion మీయభిప్రాయమునకు లోబడుతాను.

Bow, n. s. a salute వందనము, దండము. to make a * దండముబెట్టుట.
bo for arrows విల్లు. a peller * వుండవిల్లు. a knot with bows దూముడి.
She wore bows of ribbon on her shoulder అది భుజము మీద కుచ్చులు 
వేసుకొని వుండినది. the bows of a ship అనీం. (aneem) వాడ ముఖము 
యొక్క చంపలు. a bow used by cotton cleaners దూదేకుడుబద్ద. or 
fiddlestick పిడ్డిలు వాయించే కొయ్య. Rain * ఇంద్ర ధనస్సు. * legged దొడ్డి 
కాళుగల.

Bowed, adj. వంచిన, వంగిన, వాలిన. * down with grief వ్యసనముచేత 
కుంగిన. * cotton యేకిన దూది.

Bowels, n. s. పేగులు. his * were freely opened వాడికి చక్కగా భేది 
అయినది. a son of his own * కడుపునబుట్టిన కొడుకు. In the * of 
the earth భూమధ్యమందు. or mercy అంతఃకరణ. having * of compassion 
కడుపులో విశ్వాసము గలవాడై. having his * moved with compassion వాడి
కడుపు మండినందున. his * yearned వాడి కడుపు మండినది, వాడికి అయ్యో 
అని తోచినది.

Bower, n. s. పొదరిల్లు, కుంజము, లతా గృహము. * anchor వక తరహా 
లంగరు.

Bowery, n. s. (Indian word for a well) భావి.

Bowl, గిన్నె, భోగిణి. of a lamp ప్రమిదె. an earthen * సానిక. the
* of a tobacco pipe చిలము, అనగా పొగతాగే సుంగాణి కొనను నిప్పు
వేసే చిలము. in poetry కలశము. or ball గుండు. to play at bowls
గుండ్లాడుట.

To Bowl, v. a. దొల్లించుట. I saw him bowling along వాడు గుడుగుడుమని
దొల్లగా చూస్తిని, అనగా వాడు గుడుగుడుమని రాగా చూస్తిని.

Bowlderstones, n. s. గండశైలముల, కొండమీదనుంచి దొల్లిన బ్రహ్మాండమైన
కలుగుండ్లు, ఒడ్డుగుండ్లు.

Bowlegged, adj. దొడ్డి కాళ్ళుగల.

Bowler, n. s. గుండ్లాడేవాడు.

Bowline, n. s. తాడు, యిదివాడభాష.

Bowling-green, n. s. గుండ్లాడేపసరిక బయలు.

Bowman, n. s. విలుకాడు.

Bowshot, n. s. బాణము పారే దూరము.

Bowspirt, or Boltsprit, n. s. వాడ యొక్క ముక్కుదూలము, దీన్ని చూదరియని
అంటారు.

Bowstring, n. s. నారి, అల్లె, శింజిణి.

Bow-window, n. s. అర్థచంద్రాకారముగా బయిటికి మించివుండే అద్దాలగవాక్షి.

Bow-wow, n. s. కుక్క కూతకు అనుకరణశబ్దము.

Bowyer, n. s. విలుకాడు, విండ్లుచేసేవాడు.

Box, n. s. a chest పెట్టె, బరిణె, డబ్బి. a great chest భోషాణము.
a strong * ఖజానాపెట్టె. a poor's * హుండి, భవనాశి అక్షయపాత్ర.
a snuff * పొడిభరణి, పొడిడబ్బి. a pill * మాత్రలువేసే భరణి. a 
scent * అత్తరుడబ్బి. a dice * పాచికలాడే గొట్టము. seat in a theatre 
నాటకశాలలో వేడుక చూచే వాండ్లు కూర్చుండేటందుకు చుట్టూరు కట్టివుండే చిన్న 
అరలు, వీటిని. Boxes అంటారు. the * tree వక తరహా చెట్టు. a cuff, 
as, he gave me a box on the ear నన్ను చంపమీద కొట్టినాడు. * or 
* iron యిస్త్రి చేసే యినుప పెట్టె. coach * బండిలో బండితోలేవాడు కూర్చుండే
చోటు. Christmass boxes పండుగ బహుమానము.

To Box, v. n. గుద్దులాడుట, ముష్టి యుద్ధముచేసుట. he boxed with me 
నాతో గుద్దులాడినాడు. boxing match ముష్టి యుద్ధము. to * the compass 
దిక్కుల పేళ్లు చెప్పుట.

Boxen, adj. బాక్సు అనేమానితో చేయబడ్డ, ఆ మాను తెల్లగా వుంటుంది.

Boxer, n. s. ముష్టి యుద్ధము చేసేవాడు, మల్లుడు, గుద్దులాడేవాడు.

Boxing, n. s. ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము.

Boy, n. s. మగబిడ్డ, పిల్లకాయ, చిన్నవాడు. come here my * యిక్కడ
రా అబ్బి. old * తంబూ a word used in calling to servants ఒరే a
palankeen * బోయి. from this the English word is taken.

Boyhood, n. s. బాల్యము, పసితనము.

Boyish, adj. పసి, బాల్యపు. * acts పిల్ల చేష్టలు.

Boyishly, adv. పసితనముగా, పిల్లతనముగా.

Boyishness, n. s. పసితనము, పిల్లతనము, బాల్యము.

Bp, Contraction of Bishop.

Brab, n. s. a sort of Plum రేగుపండు.

To Brace, v. a. బిగించుట, బిగించికట్టుట. to * a bow ఎక్కు బెట్టుట,
మోపెట్టుట. Cold air and bathing * the body చలిఘాలిన్ని, చన్నీల్ల
స్నానమున్ను దేహానికి బలమును కరగ చేస్తుంది.

Brace, n. s. కట్టు, బంధనము, బిగి, బిగువు తాడు. a pair (of birds 

& c.) జత, తోడు, యుగ్మము, యీయర్థమందు బహువచనములేదు గనక. ten *
అంటే, పది జతలు. ten braces అంటే, పది కట్లు అని అర్థమౌతున్నది, అయితే. 
braces worn in clothing యి జారును తొడుక్కొని భుజములకు తగిలించుకొనే
నాడాలు. In printing types అనే సంజ్ఞ.

Bracelet, n. s. కరభూషణము, కంకణము, కడియము, మురుగు, తోడా, గాజు
మొదలైనవి.

Brachman, n. s. the old fashioned spelling of the word Brahman 
బ్రాహ్మణుడు.
 
Bracing, adj. బలకరమైన, బిగువిచ్చే. a * climate చలి దేశము. a * 
wind చలి గాలి, దేహానికిబలమును కలగచేసే ఘాలి.

Bracket, n. s. వాల్సేడ్లు, పెద్దఘడియారములు, వుంచడానకై గోడకుకొట్టి
వుండే కొయ్య దిమ్మె, a sign used in printing [   ] యిది వక తరహా 
కుండలీకరణము.

Brackish, adj. వుప్పైన, కారువైన. * water వుప్పునీళు. * soil చవిటి నేల.
this water tastes * యీ నీళువుప్పుగా వున్నది.

Brackishness, n. s. చవకలు.

Brad, n. s. సన్న ఆణి, సన్నచీల, పల్లకి, బండి, మొదలైన వాటిలో గుడ్డలను
బిగించే సన్నమేకు.

To Brag, v. n. జంభాలు, గుచ్చులు, జల్లి. at eards, వక తరహా కాగితాలాట.

Braggadocio, n. s. జంభాల ఖోరు, బడాయిఖోరు.

Braggart, Bragger, n. s. జంభాలఖోరు, బడాయిఖోరు.

To Braid, v. a. జడవేసుట, అల్లుట.

Braid, n. s. జడ, అల్లిక.

Braided, adj. జడవేసిన, అల్లిన.

Brain, n. s. మెదడు. or understanding బుద్ధి తెలివి. A mad * పిచ్చివాడు,
వెర్రివాడు. hot brained తలకొవ్విన.

To Brain, v. a. పుర్రపగలకొట్టుట.

Brainless, adj. తెలివిమాలిన, పిచ్చి.

Brainpan, n. s. తలకాయ, యిదియెగతాళి మాట.

Brainsick, n. s. పిచ్చి, వెర్రి.

Brake, అనగా, Broke see Break.

Brake, n. s. డొంక, పొదలుగల పల్లము. the handle of a ship's pump
పిడి. a smith's * లాఢము కొట్టేటప్పుడు గుర్రము యొక్క కాళ్ళను యీడ్చి కట్టే 
కొయ్య.

Bramble, n. s. వుండ్రకంప, కోరిందకంప, గచ్చతీగె మొదలైన 
ముండ్లచెట్లు. I was then lying upon brambles నా కప్పుడు ముణక 
రాములుగా వుండెను. యెటవునోయని నా ప్రాణము గడగడ వణుకుతూ వుండెను.

Bramin, n. s. బ్రాహ్మణుడు, బాపనవాడు, బాపడు. * woman బాపనది. 
a * village అగ్రహారము. 

Braminical, adj. బ్రాహ్మణ సంబంధమైన. the * thread జంధ్యము.
Investiture with the thread ఉపనయనము. the * creed బ్రాహ్మణ
మతము.

Braminy bull, నంది, నందికేశ్వరుడు.

Braminy duck, బాపనకోడి అనేపక్షి.

Bran, n. s. తవుడు, పొట్టు, వుమక. * new కొత్త, అభినవ. a * new coat
కొత్త చొక్కాయ, యిది నీచమాట.

Branch, n. s. కొమ్మ, రెమ్మ, మండ, శాఖ. a slender * చువ్వ, మల్లె.
tendril of a vine పక్క తీగె. a forked * పంగలకొమ్మ. a double
branched candlestick రెండుకొమ్మల దీపపు శెమ్మె. part of division
భాగము, అంగము, శర్కము. a river పాయ. a * of a ravine పాయగావుండే 
గండి. Bramins consider grammar to be a * of the Vedas వ్యాకరణము 
వేదమునకు ఒక అంగమని అంటారు. they are a * of the royal family 
రాజవంశములో వాండ్లది ఒక తెగ. a * post office చిన్న తపాలాపీసు. * 
schools కింది పల్లె కూటములు.

To Branch, v. n. కొమ్మ విడుచుట, రెమ్మ విడిచుట, పక్క తీగె విడుట. 
to * forth in speaking శాఖోపశాఖలుగా మాట్లాడుట.

Branching, adj. శాఖోపశాఖలుగా వుండే, కొమ్మలు కొమ్మలుగా వుండే. this
stag has * horns దుప్పి కొమ్ములు శాఖోపశాఖలుగా వుంటవి.

Branchless, adj. కొమ్మలులేని. a * tree మొండిచెట్టు, మోటుచెట్టు.

Branchy, adj. కొమ్మలతో నిండివుండే. 

Brand, n. s. వాత, శునకముద్ర. or fire * కొరివి, ఉల్కా. or stigma
నేరస్తుడని తెలిసేటట్టు పొడిచిన పచ్చ మొదలయిన గురుతు. or sword
ఖడ్గము, యిది కావ్యములో వచ్చేమాట.

To Brand, v. a. వాత వేసుట, శునకముద్రవేసుట, నేరస్థుడి ముఖములో 
పచ్చ పొడుచుట, భ్రష్టుణ్నిగా చేసుట. they branded my name on the 
boxes ఆ పెట్టెల మీద నా పేరుగల ముద్రను కాల్చి వేయబడ్డది. they 
branded him with infamy వాడిమీద నింద కట్టినారు.

Branded, adj. వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ 
పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు 
కాల్చివేయబడ్డవి.

To Brandish, v. a. ఝళిపించుట, విసురుట, ఆడించుట. the snake 
brandishes its tongue పాము నాలికెను ఆడిస్తున్నది.

Brandy, n. s. బ్రాందియనే సారాయి.

Brangle, n. s. కలహము, వివాదము, వ్యాజ్యము.

Brazen, adj. See Brazen, యిత్తళితో చేసిన. a * cup యిత్తళి గిన్నె.

Brash, n. s. పొడి, చెక్క. stone * కత్తెర రాళ్ళ చెక్కలు.

Brasier, n. s. కంచరవాడు. a pan to hold fire in కుంపటి.

Brasil, n. s. ఒక దేశము పేరు. they brazil cherry బుడ్డ మిసరిపండు,
బుడ్డబూసరి పండు, తక్కాళి పండు. brazil wood యినుమడి చెక్క, సురుగుడిమాను.

Brass, n. s. యిత్తళి. or impudence సిగ్గుమాలిన తనము, మొండితనము.

Brassy, adj. యిత్తళి, చిలుముగల. this water has * taste యీ నీళ్ళు 
చిలుముకంపు కొట్టుతున్నది.

Brat, n. s. పాడుబిడ్డ, పాడుపిల్ల, యిది బిడ్డలను గురించిన తిరస్కారమైన 
మాట.

Bratty, n. s. పిడకలు. this is corrupted from the Tamil word
(వారట్టి) varatty.

Bravado, n. s. గర్వము, బడాయి, జంభము. he did out of mere * దీన్ని
వొట్టి జంభానికి చేసినాడు.

Brave, adj. ధైర్యముగల, శౌర్యముగల, వీర్యముగల. noble దివ్యమైన, దొడ్డ.
what a * house! యేమి దివ్యమైన యిల్లు O brave! శాబాసు.

To Brave, v. a. అలక్ష్యముచేసుట, తిరస్కరించుట. he praved the king's
displeasure రాజు యొక్క కోపమును అలక్ష్యము చేసినాడు. he braved the 
consequences వచ్చినది రానీ యని వుండినాడు. the marble has braved the 
weather for a thousand years వెయ్యేండ్లైనప్పటికిన్ని ఆ రాతికి చలనము
లేదు, హానిలేదు.

Bravely, adv. ధైర్యముగా, వీర్యముగా, పరాక్రమముగా.

Bravery, n. s. ధైర్యము, శౌర్యము, వీర్యము.

Bravo, n. s. కూలిపని ఒకణ్ని చంపేవాడు, ఘాతకుడు, కటికవాడు.

Bravo, interj. శాబాసు, భళా, భళీ.

Bravura, n. s. గాన విశేషము.

To Brawl, v. n. జగడమాడుట, పోరుట, పోరాడుట, కలహమాడుట. 
in legal language ఘర్షణ చేసుట, వాగ్వాదము చేసుట.

Brawl, n. s. పోరు, రచ్చ, కలహము, ఘర్షణా. 

Brawler, n. s. రచ్చబెట్టేవాడు, పోరాడేవాడు, జగడమాడేవాడు.

Brawn, n. s. fleshy part శరీరములో కండపట్టుగా వుండే స్థలము. 
a kind of food పంది మాంసముతో చేసిన ఆహారము. or boar మొగపంది.

Brawny, adj. కండపుష్టిగల.

To Bray, v. a. దంచుట.

To Bray, v. n. కూసుట, యిది గాడిదె కూతను గురించిన మాట.

Bray, n. s. Braying గాడిదెకూత. the * of a trumpet కొమ్ము ధ్వని.

Brazen, adj. యిత్తళి, యిత్తళితో చేసిన. or impudent సిగ్గుమాలిన, 
మొండి. * age ద్వాపర యుగము.

To Brazen, సిగ్గులేక వుండుట. she brazened it out that I was wrong
నేను తప్పినానని అది సిగ్గు శరము లేక చెప్పినది.

Brazier, n. s. కంచరవాడు. a pan to hold fire in కుంపటి.

Brazil, n. s. See Brasil.