విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Breach-Brilliantly
Appearance
Breach, n. s. an opening, gap గండి, సందు. a quarrel or wrangling ఛిద్రము, కలహము. violation of law or promise తప్పడము, తప్పి పోవడము. of faith or trust ద్రోహము, విశ్వాసఘాతకము. * of chastity పాతివ్రత్య భంగము. they have come to an open * వాండ్లు బయట పడి జగడమాడినారు. To Breach, v. a. గండిచేసుట, సందుచేసుట. they breached the wall with cannon ఫిరంగి గుండ్లువేసి ఆ గోడలో సందుచేసినారు. Bread, n. s. రొట్టె. he was locked up for a week on * and water వాడికి బుద్ధివచ్చేటట్టు వారం దినాలు ఒక గదిలో వేసి మూసిపెట్టి కూడు నీళ్ళు పెట్టినారు. he gave them sixpence for * and cheese వాండ్లకు గంజి మెతుకులకు అయ్యేటట్టు పావలా యిచ్చినాడు. or food ఆహారము, గ్రాసము. Support or maintenance జీవనము, బ్రతుకు. he took away my * నా బ్రతుకు చెరిచినాడు, నా కూటిలో రాయి వేసినాడు. daily * నానాటి బత్తెము. Give us this day our daily * నానాటి బత్తెమును నేటికి యివ్వవలెను. dry * వట్టి కూడు, శుష్కన్నము. consecrated * ప్రసాదము. Loaves or loaves of * రొట్టెలు. Bread అనే శబ్దమునకు బహువచనము లేదుగనుక Breads అని యెంతమాత్రము అనకూడదు, అయితే Loaves of * రొట్టెలు. one loaf of * ఒక రొట్టె. Ten loaves of * పదిరొట్టెలు, యీ ప్రకారము చెప్పవచ్చునే గాని a *, one * అని చెప్పకూడదు. Bread-corn, n. s. రొట్టెలు చేయడమునకు వుపయోగమైన గోధుమ మొదలైనది. Bread-fruit, n. s. రొట్టెపండు, యిది పెద్దచెట్టు, దీన్ని నిప్పున కాలిస్తే రొట్టె అవుతున్నది. Breadth, n. s. వెడల్పు, విశాలము. height and * తులార్జులు. To Break, v. a. పగలకొట్టుట, విరగకొట్టుట, విరుచుట, తెంచుట. or to separate విభాగించుట. he broke the school into four classes ఆ పల్లె కూటపు పిల్ల కాయలను నాలుగు భాగములు చేసినాడు. the river broke its banks ఆ యేరుకట్టను తెంచుకొన్నది. he broke the cord ఆ దారమును తెంచినాడు. the blow broke his head ఆ దెబ్బకు వాడి తల పగిలినది. If you say that again I will break your head మళ్ళీ అంటివంటే తల పగలకొట్టుతాను. I never broke bread in his house నేను వాడిమట్లో వొకనాడున్ను భోజనము చేసినదిలేదు. he did this to * the charm or spell దీన్ని చేసి ఆ మంత్రకట్టును విడిచినాడు. there was a heap of grass underneath which broke his fall వాడు పడ్డందుకు కింద కసువువామి వుండినందున దెబ్బ తిప్పినది. Fever broke his health జ్వరముచేత వాడి వొళ్ళు చెడిపోయినది. he is breaking his heart about her ఆమెను గురించి వ్యాకులముతో కుంగుతున్నాడు. the horse has broken his knees ఆ గుర్రముపది మోకాళ్ళు కొట్టుకొని పోయినవి. he broke his oath సత్యము తప్పినాడు. he broke the rule సూత్రభంగము చేసినాడు. I broke my shin నా కాలి గుర్రపు ముఖములో తగిలి గాయమైనది. when he broke silence మాట్లాడేటప్పటికి. he did not * silence వాడు నోరు తెరవలేదు. this fever broke his strength యీ జ్వరము వాడి బలమును కుంగ కొట్టినది. he was in doubt how to * the subject to her యీ సంగతిని ఆమెతో యెట్లా ప్రస్తాపము చేసేదని అనుమానిస్తూ వుండినాడు. he broke it to pieces దాన్ని బద్దలు చేసినాడు. to break wind పిత్తుట, తేణ్పువిడుచుట. he broke his vow ప్రతిజ్ఞ తప్పినాడు. he broke his word మాట తప్పినాడు. they broke the wall down గోడను యిడియ గొట్టినారు. to * in మరుపుట. he broke the horse in to the carriage ఆ గుర్రమును బండికి మరిపినాడు. the thieves broke into the house దొంగలు తలుపులు పగలకొట్టి, లేక, కన్నము వేసి యింట్లోకి దూరినారు. to * off వించుట, విరగగొట్టుట. he broke a branch off the tree ఆ చెట్టులో వొక కొమ్మ విరిచినాడు. he broke open the letter ల కోటా పగల కొట్టినాడు. he broke up the ground బీటిని తవ్వినాడు. he broke up the school by noon మధ్యాహ్నము పిల్లకాయలను విడిచి పెట్టినాడు, పళ్ళికూటము కలిసి పోయినది. he broke up his family సంసారాన్ని విచ్ఛిన్నము చేసినాడు. his death broke up the school అతను చచ్చినందున పల్లె కూటము ఛిన్నాభిన్నమై పోయినది. this will * you or cure you of telling stories యిందుచేత నీకు చాడి చెప్పే రోగము మానును. To Break, v. n. పగులుట, విరుగుట, తెగుట, చిట్లుట, చితుకుట. the cup broke in pieces ఆ గిన్నె తునకతునకలైనది. the stick broke to pieces ఆ కర్ర తునక తునకలైనది. after he had broken with them వాండ్లకున్ను వీడికిన్ని విరోధము వచ్చిన తరువాత. his health is breaking నానాటికి కృశిస్తున్నాడు. he is much broken శుష్కించినాడు, కృషించినాడు. I think his heart will break with grief వాడి మనసు వ్యాకులముతో కుంగిపోవును. When the clouds broke మేఘములు విచ్చిపొయ్యేటప్పటికి. the horse broke away from me నా చేతిలోనుంచి గుర్రము విడిబడి పారిపోయినది. when the boil broke గెడ్డ పగిలి నప్పుడు. when the dawn broke తెల్లవారేటప్పటికి. before morning broke తెల్లవారక మునుపు. the table broke down మేజా విరిగినది. the branch broke down కొమ్మ విరిగినది. the horse broke down ఆ గుర్రము డీలుపడిపోయినది. he broke forth into song పాడసాగినాడు. he broke forth into abuse తిట్టసాగినాడు. Sounds of music broke from the house ఆ యింట్లోనుంచి వాద్యఘోషము వింటున్నది. When the thieves * in or * through దొంగలు జొరబడేటప్పటికి. the horse broke loose ఆ గుర్రము తెంచుకొన్నది, వడబడ్డది. here the river breaks off యిక్కడ ఆ యేరు చీలుతుంది. they broke out of prison జెయిలులో నుంచి తప్పించుకొని పోయినారు. the blood broke out నెత్తురు వచ్చినది. I struck the tree the milk broke out ఆ చెట్టును కొట్టినాను పాలు వచ్చినది. a fire broke out in the market అంగడి వీధిలో నిప్పు బయలుదేరినది, అనగా అంగడి వీధి తగులుకొన్నది. Last year a war broke out పోయిన సంవత్సరము ఒక యుద్ధము ఆరంభమైనది. a quarrel broke out ఒక జగడము పుట్టినది. when the disease broke out in the town ఆ వూరిలో ఆ రోగము కనిపించినప్పుడు. the small pox broke out అమ్మవారు పోసినది. he broke out in a rage వాడికి ఆగ్రహము వచ్చినది. thieves have broken out in this neighbourhood యీ ప్రాంత్యములో దొంగలు బయలుదేరినారు. when the sun broke out మబ్బువిడిచి యెండకాశేటప్పటికి. prickly heat broke out చెమరకాయలు లేచినవి. White-ants have broken out here చెదుళ్ళు బయలుదేరినవి. when the sun's rays broke out through the darkness సూర్య కిరణములచేత చీకటి విచ్చేటప్పటికి. the school or assembly broke up పళ్ళికూటము, లేక, సభ కలిసి పోయినది. when the village broke upon my view ఆ వూరు నాకు కండ్లపడేటప్పటికి. Break, n. s. తెంపు, భంగము, బీటిక, గండి, సందు. Before the * of day తెల్లవారక మునుపు. at midnight there was a * of moonlight అర్ధరాత్రిలో కొంచెము వెన్నెలల వచ్చినది. or stop, pause నిలుపు. for teaching a horse గుర్రాన్ని మరపడానకు కట్టేబండి. a break training cattle బారకాడి. Breakage, n. s. పగిలిపోవడము. Out of these bottles I lost six by * యీ బుడ్లలో ఆరు బుడ్లు నాకు నష్టము. Breaker, n. s. a wave, కొండమీద, లేక, యిసుక దిబ్బమీద కొట్టే అల. a horse * చబుకుసవారు. a jaw * యినుపశనగలు, అనగా క్లిష్టమైన అతికఠీనమైన పదము. Breakfast, n. s. ప్రాతఃకాల భోజనము, సద్ది భోజనము. To Breakfast, v. n. తెల్లవారి భౌజనము చేసుట, సద్ది భౌజనము చేసుట. Breaking, n. s. or failure తప్పదము, భంగము, or eruption పేలినది, పోసినది. promise * ఆడి తప్పడము. Sabbath * ఆదివార వ్రత భంగము అనగా ఆదివారమునాడు లౌక్యములో ప్రవర్తించడము. there was a * out on the skin చిడుములు చమరకాయలు యీలాటివి వుండినవి. a * up of the constitution సన్నిపాతము. Breakwater, n. s. తరంగతిరస్కరణి, అనగా సముద్రమలో అలలకు అడ్డముగా కట్టిన సేతువ. Bream, n. s. ఒక తరహా చేప. Breast, n. s. రొమ్ము, వక్షస్థలము, యెదస్తనము. an infant at the చంటిపిల్ల. Milk from the చనుబాలు. he was lying on his * బోర్లపడి వుండినాడు. the wall was * high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది. or mind హృదయము, మనసు. he made a clean * తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు. keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు. a * of mutton నానుబోర. To Breast, v. a. యెదరెక్కుట. he breasted the waves అలలకు యెదురీదినాడు. Breastpin, n. s. దొరలు రొమ్ము వుడుపులో చెక్కుకొనే ఒక తరహా బంగారు గుండుసూది. Breastplate, n. s. రొమ్ము కవచము రొమ్ము జీరా, వక్షస్త్రాణము. an ornment పతకము. the high priest's * పూర్వ కాలమందు పురోహితుడు రొమ్మునకట్టు కొనే ఒక తరహా పతకము. Breastwork, n. s. రొమ్ము పొడుగు గోడ లేక, గ్రాది మొదలైనది. Breath, n. s. ఊపిరి, శ్వాసము. he suffers from shortness of * వుబ్బసముతో శ్రమపడుతాడు. he drew a deep * పెద్ద వూపిరివిడిచినాడు, నిట్టూర్పు విడిచినాడు. he is out of * with running పరుగెత్తినందున యెగరోజుతాడు. to take * గుక్క తిప్పుకొనుట. give me * and I will tell you సావధానముగా అడిగితే చెప్పుతాను. this is a mere waste of * యిది వొట్టి వాగ్వ్రయము. he spoke under his * పరులకు వినకుండా తిన్నగా మాట్లాడినాడు. I drew my first * there నేను అక్కడ పుట్టినాను. When he was at his last * వాడు కొన ప్రాణముతో వుండగా. he drew his last * there అక్కడ చచ్చినాడు. there was not a * of wind రవంతైనా ఘాలి లేక వుండెను. you say he is there and in the same * you say that he is dead వాడు వున్నాడంటావు, ఆ మాటతోనే చచ్చినాడంటావు. It was done in a * ఒక క్షణములో తీరింది. three was not a * of suspicion రవంతైన సందేహము లేదు. Before the least * of this scandal got wind యీ అపవాదము రవంతైనా బయిటపడక మునుపు. he wrote a poem and three letters all in a * ఒక కావ్యము మూడు జాబులు అంతా వొక దెబ్బన వ్రాసినాడు. To Breathe, v. n. and v. a. వూపిరి విడుచుట. can you * in this room యీ యింట్లో నీకు వూపిరి తిరుగుతుందా. he breathes hard యెగరోజుతాడు. As long as you * నీవు ప్రాణముతో వుండే వరకు. the best man that breathes లోకములో సర్వోత్తముడు. he breathed his last there అక్కడ చచ్చినాడు. he breathed vengeance against them వాండ్లకు శాస్తినేయక విడుస్తావాయని ఆగ్రహపడుతూ వుండినాడు. you must not * a word of this యిందులో ఒకమాటైనా బయిటవిడువబోతావు. Breathing, n. s. ఊపిరి, వుశ్వాసము. or accent in Greek grammar ఫభథ వీటికి వొత్తువంటి ఒక గురుతు. a picture సజీవముగా వుండే పటము. a * sweat మహత్తైన చెమట. Breathless, adj. out of Breath వూపిరి తిరగని. he was * with fear భయముచేత మానై నిలిచినాడు. or dead చచ్చిన. * haste అతిత్వర. * anxiety అతివ్యాకులము. Bred, the past and part of Breed. కలిగిన, జన్మించిన, పుట్టిన. Insects that are * in water నీళ్ళలో పుట్టిన పురుగులు. he was bred up as a doctor అతనికి వైద్యము నేర్పినారు. Ill * అమర్యాదస్థుడైన, మోటు, మూర్ఖ. An ill * man అమర్యాదస్థుడు. well * మర్యాదస్థుడైన, సరసుడైన. Brede, See Braid. Breech, n. s. ముడ్డి, పిరుదులు. of a gun తుపాకి యొక్క కుందా, చెవి. of a cannon ఫిరంగి యొక్క ముడ్డి. Breeched, adj. బట్టకట్టే యీడుగల, ఇది మొగపిల్ల కాయలను గురించినమాట. he was then just * వాడికి అప్పుడే జామాతొడుక్కొనే దశగా వుండెను. a boy just * యెదిగే కుర్ర. Breeches, n. s. చల్లడము. In that house the wife wears the * అది మొగుణ్ని చేతికింద వేసుకొన్నది. Breeching, n. s. ఫిరంగిమోకులు, ఫిరంగి కట్టేతాళ్ళు. To Breed, v. a. పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కలగచేసుట. to bring up పెంచుట సాకుట. to educate శిక్ష చెప్పుట. Familiarity breeds contempt చనువు అలక్ష్యమును కలగచేస్తుంది, అతిపరిచయము అవఙ్ఞతను కలగచేస్తుంది. he bred these horses up for war యీ గుర్రాలను యుద్ధానికి మరిపినాడు. he bred me up as his son అతడు నన్ను తనబిడ్డగా పెంచినాడు. corn breeds insects గోధుమలలో పురుగులు పట్టుతవి. this bred a dispute దీనివల్ల ఒక కలహము పుట్టినది. To Breed, v. n. పుట్టుట, జన్మించుట, కనుట, పిల్లను వేసుట. She breeds every year అది ప్రతిసంవత్సరమున్ను కంటున్నది. Goats breed twice a year మేకలు సంవత్సరానికి రెండుమాట్లు యీనుతవి. the birds bred in this place ఆ పక్షులు యిక్కడ పిల్లలు పెట్టినవి. Breed, n. s. జాతి, కులము. a horse of good * మంచిజాతి గుర్రము. a horse of English * యింగ్లీషు గుర్రమునకు పుట్టిన గుర్రము. he is of a good * మంచివంశములో పుట్టినవాడు. a mongrel * సంకరజాతి. Breeder, n. s. పిల్ల వేసేటిది. a horse * గుర్రములు పెంచి అమ్మేవాడు. a pigeon * పావు రాళ్ళు పెంచడము. or manners మర్యాద, నడవడి, he shewed his * వాడి యోగ్యతను అగుపరచినాడు. Bad * అమర్యాద. good * మంచి మర్యాద. he is a man of no * అమర్యాదస్తుడు. I will take care of their * వాండ్లకు శిక్షచెప్పడమును గురించి నేను జాగ్రత్త చేసుకుంటాను. Breeding, adj. గర్భిణియైన, కడుపుతో వుండే, చూలుగా వుండే. a * woman గర్భిణిస్త్రీ. Breeze, n. s. గాలి, పిల్లగాలి, మందమారుతము. the sea * సముద్ర తీరపు గాలి. the land breeze వడగాట్పు. in sea language, a storm ప్రచండ వాయువు, పెద్దగాలి. there was a * or quarrel between them వాండ్లలో ఒక కలహము పుట్టినది. or gad fly జోరీగె. Breezy, adj. గాలిగల. Brethren, n. s. plu. సహోదరులు. fellows or companions సంగాతులు. తనతోటిపాటి వాండ్లు, పాదిరి ప్రజలతో ప్రసంగించేటప్పుడు ప్రజలారా, జనులారా అనకుండా. my brethren సహోదరులారా, అంటాడు. he and his * in the faith తానున్ను తన మతస్థులున్ను. the carpetner went and consulted his * or, his brother artificers ఆ వడ్ల వాడు తనవంటిపని వాండ్లతో ఆలోచించినాడు. Breve, n. s. in music సంగీత శాస్త్రములో వాద్యస్వర విశేషము, హ్రాస్వస్వరముయొక్క గురుతు. Brevet, n. s. విశేషాధికార పత్రికె, అనగా దండులో ఒక దొరసంబళము తీసుకొని నియతముగా వుండే వుద్యోగమును వుండగా విశేషముగా దానికి పై వుద్యోగమును కలగచేసే విశేషాధికార పత్రిక, అయితె ఆ విశేష వుద్యోగమునకు మర్యాద స్వతంత్రములు మాత్రమేగాని మునుపటి వుద్యోగపు సంబళమేను. a captain who is major by * కేప్ట ్ సంబళము తీసుకొని విశేషాధికార పత్రికచేత మేజరు కితాబును పొందివుండేవాడు. Breviary, n. s. రోమ ్ కెతోలిక్ మతమందు ప్రార్ధననా సంగ్రహమనే పుస్తకము. Brevier, n. s. a small printing type సన్న అచ్చు అక్షరము. Brevity, n. s. సంగ్రహత, సంక్షేపత్వము. from the * of his style the book is difficult వాడు సంగ్రహముగా చెప్పడమువల్ల ఆ గ్రంధము కఠినముగా వున్నది. * is the sould of wit సంగ్రహత, చమత్కారమునకు జీవముగా వున్నది. To Brew, v. a. కాచుట. Ale, Beer, Porter సారాయీలను కాచుట. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. he brewed some punch కొంచముపానకము కలిపినాడు. to plot or contrive కల్పించుట, కలగచేసుట. there is a storm brewing ఘాలివాన ఆరంభమోతున్నది. I saw there was a qurrel brewing ఒక జగడము కలిగేటట్టు నాకు తెలిసినది. Brewage, n. s. కలపడము, కాచడము. this beer is of his * యిది వాడు కాచిన సారాయి. Brewer, n. s. కాచేవాడు. Ale, Beer, Porter యీ మూడు విధాల సారాయి కాచేవాడు. Brewhouse, n. s. సారాయి కాచే యిల్లు. Briar, n. s. ముండ్లకంప, గచ్చతీగె, ఉండ్ర కంప. Bribe, n. s. లంచము, పరిదానము. To Bribe, v. a. లంచమిచ్చుట, పరిదానమిచ్చుట. they bribed him with a horse అతనికి గుర్రమును లంచముగా యిచ్చినారు. Bribery, n. s. లంచము యివ్వడము, లంచము పుచ్చుకోవడము. Brick, n. s. యిటిక, యిటిక రాయి. to make * యిటికరాళ్ళు కోసుట. unburned or raw * పచ్చి యిటిక. a kind of loaf ఒక తరహా రొట్టె. Brickbat, n. s. యిటికరాయి తునక. Brikdust, n. s. యిటికరాయి పొడి. * colour కాషాయ వర్ణము. Brick, n. s. యిటిక ఆవము, యిటిక సూళ. Bricklayer, n. s. కాశేవాడు, తాపికాడు, కొల్లెత్తువాడు. Brickmaker, n. s. యిటికలు కోసేవాడు. Brick-work, n. s. యిటికపని, యిటిక కట్టు. Bridal, adj. వివాహ సంబంధమైన, పెండ్లి సంబంధమైన. * presents పెండ్లి చదివింపులు. Bridal, n. s. వివాహము, పెండ్లి. Bride, n. s. పెండ్లి కూతురు. Bride's maids తోడుపెండ్లికూతుర్లు. Bride's men తోడు పెండ్లి కొడుకు. Bridecake, n. s. పెండ్లి ఫలహారము, పెండ్లి కాగానే బంధువులకు, హితులకు యిచ్చే లేక, పంపించే ఒక తరహా మిఠాయి. Bridegroom, n. s. పెండ్లికొడుకు, వరుడు. Bridewell, n. s. a house of correction సీమలో ఒక చెరసాల యొక్క పేరు. Bridge, n. s. వారధి, వంతెన, నేతువ. the * end వారధికొన, అక్కడ బిచ్చపు వాండ్లు కూర్చుంటారని ప్రసిద్ధము. a bridge of boats పడవ వారధి, అనగా వారధివలె పడవలను వరసగా యేట్లో నిలిపి దానిమీద యేరును దాటుతారు. * of the roof మొగటి దూలము. of the nose ముక్కు దూలము. the * of a violin పీట, గుర్రము, బయిసణ, తంబుర పీఠము. Bridle, n. s. of a horse కల్లెము, లగాము. of a bullock ముక్కు దారము ముఖతాడు. you put no * upon your tongue నీకు నోరుదుడుకు. you should keep your passions under a * నీవు కామక్రోధాదులను అణచవలెను. a check నిర్బంధము, ఆటంకము. a * path or road ఒంటి గుర్రము పోతగ్గదారి. To Bridle, v. n. నిక్కుట, నిక్కిపడుట. he bridled up with pride గర్వముతో నిక్కిపడ్డాడు. To Bridle, v. a. కళ్ళెము పెట్టుట, లగామువేసుట, యీడ్చిపట్టుట. to restrain అణుచుట. he bridled up his horse కళ్ళెమును యీడ్చి పట్టినాడు. they do not * their passions వాండ్లు కామక్రోధాదులను అణచరు. Bridled, adj. కళ్ళెము పెట్టిన, యీడ్చిపట్టిన. restrained అణిచిన, నిర్బంధించిన. Brief, adj. సంగ్రహమైన, సంక్షేపమైన, కొద్దియైన. a * story కధాసంక్షేపము. how brief is life ! ఆయుస్సు యెంత అల్పము యెంత కొద్దిది. To be *, you must repent or you will perish వెయిమాటలేల పశ్చాత్తాపము లేకుంటే నీవు చెడిపోదువు. Brief, n. s. సంక్షేపము, సంగ్రహము. a lawyers * వ్యాజ్యసంగతి. In that cause he held a * for me; or, I gave him a * ఆ వ్యాజ్యములో అతడు నాకు లాయరుగా వుండెను. Briefly, adv. సంక్షేపముగా, సంగ్రహముగా. * they will not come వెయిమాటలేల వాండ్లు రారు. Briefness, n. s. సంక్షేపత, సంగ్రహత. from the * of his life వాడి ఆయుస్సు అల్పమైనందున. Brier, n. s. అడివి గులాబిపువ్వు, ముండ్లపొద. Briery, adj. ముండ్లుగల. Brig, n. s. రెండు స్తంభముల చిన్నవాడ, దోనె. Brigade, n. s. సైన్యములో ఒక భాగము ఒక దళము. Brigade Major, n. s. An Assistant to a Brigadier బ్రిగేడీర అనే దండు దొరకు రెండోవాడు. Brigadier, or Brigadier General, n. s. మేజరు జెనరలుకు కింది సేనాధిపతి. Brigand, n. s. దారిలో కొట్టి దోచే దొంగ. brigantine, n. s. ఒక తరహా వాడ. Bright, adj. ప్రకాశమైన, కాంతిగల, మెరిసే, తళతళలాడే, నిగనిగలాడే. clear తేటైన, పరిష్కారమైన, స్పష్టమైన. the lamp is not * ఆ దీపము ప్రకాశముగావుండలేదు. * sun shine మహత్తైన యెండ. * white నిగనిగలాడే తెలుపు. * black నిగనిగలాడే నలుపు. he is very * వాడు తేటైన బుద్ది గలవాడు. he has a * reputation స్వచ్ఛమైన కీర్తిగలవాడు. that is a * idea అదిమంచియుక్తి. Sun * కోటి సూర్య ప్రకాశమైన. To Brighten, v. a. మెరుగుబెట్టుట, నిగనిలాడేటట్లుచేసుట. Rubbing brightens the colour రాయడముచేత ఆ వర్ణానికి మెరుగుపుట్టుతుంది. Joy brightens the heart సంతోషము మనస్సుకు వుల్లాసము కలుగచేస్తుంది. To Brighten, v. n. నిగనిగలాడుట, తళతళమని మెరుసుట, నిర్మలముగా వుండుట, స్వచ్ఛముగా వుండుట. When the east brightens with day తూర్పు తెల్లవారేటప్పుడు. the east was now brightening యింతలో తూర్పు తెల్లవారినది. I saw her eyes brighten with joy దానికండ్లు ఆనందముచేత వుజ్వలిస్తుందని నాకు తెలిసింది. Brightly, adv. ప్రకాశముగా, నిగనిగమని, తళతళమని. Brightness, n. s. ప్రకాశము, కాంతి, తేజస్సు, మెరుగు. Brilliance, n. s. ప్రకాశము, కాంతి, దీప్తి, మెరుగు. Brilliant, n. s. పట్టెలు తీర్చినరవ, కమలము. Brilliantly, adv. ప్రకాశముగా, కాంతిగా, తళతళమని.